
ఫిల్ హ్యూగ్స్
అడిలైడ్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్కు ఎలాంటి సహకారాన్నైనా అందిస్తామని భారత క్రికెట్ జట్టు ప్రకటించింది. సిడ్నీలో స్థానిక జట్లతో క్రికెట్ ఆడుతున్న సందర్భంగా అతని తలకు బంతి తగిలి బలమైన గాయమైన విషయం తెలిసిందే. బంతి తలకు తాకగానే అతడు కుప్పకూలిపోయాడు. దాంతో హ్యూగ్స్ను హుటాహుటీన చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో సెయింట్ విన్సెంట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేశారు. కాగా హ్యూగ్స్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత్ జట్టు ఫిల్ హ్యూగ్స్కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. కష్టకాలంలో ఉన్న హ్యూగ్స్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది.
**