క్రికెటర్ పర్వేజ్ రసూల్పై విమర్శలు | Indian cricketer Parvez Rasool embroiled in national anthem row | Sakshi
Sakshi News home page

క్రికెటర్ పర్వేజ్ రసూల్పై విమర్శలు

Published Sat, Jan 28 2017 11:43 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

క్రికెటర్ పర్వేజ్ రసూల్పై విమర్శలు

కాన్పూర్: సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహానికి గురైన క్రికెటర్ల జాబితాలో  భారత ఆటగాడు పర్వేజ్ రసూల్ తాజాగా చేరిపోయాడు. గత రెండు రోజుల క్రితం నగరంలో ఇంగ్లండ్ తో్ జరిగిన తొలి ట్వంటీ 20 సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో రసూల్ చూయింగ్ గమ్ నములుతూ కన్పించడం నెటిజన్ల కోపానికి కారణమైంది. భారత ట్వంటీ 20 క్రికెట్ జట్టుకు  కశ్మీర్  నుంచి ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్ గా నిలిచిన పర్వేజ్... జాతీయ గీతాన్ని అవమానపరుస్తూ నోటిలో చూయింగ్ గమ్ను పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యహరించాడు. ఆ సమయంలో మిగతా భారత క్రికెటర్లు పూర్తి ఏకాగ్రతతో ఉండగా, రసూల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యహరించాడు.

దాంతో రసూల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ గీతం ఆలపించడం కంటే చూయింగ్ గమ్ను నమలడమే రసూల్ కు ముఖ్యమని ఒక నెటిజన్  ట్వీట్ చేయగా, భారత్ జెర్సీని ధరించి కూడా జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఆ క్రికెటర్ ఆసక్తి కనబరచకపోవడం నిరాశ కల్గించందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఒకవేళ జాతీయ గీతాన్ని పాడటానికి రసూల్ ఇష్టపడకపోతే, భారత జెర్సీని ఎందుకు ధరించినట్లు అంటూ మరొక నెటిజన్ విమర్శించారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన రసూల్ కు భారత్ క్రికెట్  జట్టులో  స్థానం కల్పించకూడదని మరొకరు మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement