Parvez Rasool
-
జాతీయ గీతానికి అవమానం..క్రికెటర్‌పై ఫైర్!
-
క్రికెటర్ పర్వేజ్ రసూల్‌పై విమర్శలు
కాన్పూర్: సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహానికి గురైన క్రికెటర్ల జాబితాలో భారత ఆటగాడు పర్వేజ్ రసూల్ తాజాగా చేరిపోయాడు. గత రెండు రోజుల క్రితం నగరంలో ఇంగ్లండ్ తో్ జరిగిన తొలి ట్వంటీ 20 సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో రసూల్ చూయింగ్ గమ్ నములుతూ కన్పించడం నెటిజన్ల కోపానికి కారణమైంది. భారత ట్వంటీ 20 క్రికెట్ జట్టుకు కశ్మీర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన తొలి క్రికెటర్ గా నిలిచిన పర్వేజ్... జాతీయ గీతాన్ని అవమానపరుస్తూ నోటిలో చూయింగ్ గమ్‌ను పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యహరించాడు. ఆ సమయంలో మిగతా భారత క్రికెటర్లు పూర్తి ఏకాగ్రతతో ఉండగా, రసూల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యహరించాడు. దాంతో రసూల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. జాతీయ గీతం ఆలపించడం కంటే చూయింగ్ గమ్‌ను నమలడమే రసూల్ కు ముఖ్యమని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, భారత్ జెర్సీని ధరించి కూడా జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఆ క్రికెటర్ ఆసక్తి కనబరచకపోవడం నిరాశ కల్గించందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఒకవేళ జాతీయ గీతాన్ని పాడటానికి రసూల్ ఇష్టపడకపోతే, భారత జెర్సీని ఎందుకు ధరించినట్లు అంటూ మరొక నెటిజన్ విమర్శించారు. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన రసూల్ కు భారత్ క్రికెట్ జట్టులో స్థానం కల్పించకూడదని మరొకరు మండిపడ్డారు. Seems like that chewing gum is more important for Parvez Rasool than our national anthem. — LOLendra Singh (@LOLendraSingh) 26 January 2017 DISAPPOINTED to see Parvez Rasool standing at ease & chewing gum during national anthem. Can wear India jersey, can't sing anthem? #INDvENG — Chinmay Jawalekar Dear BCCI, If Parvez Rasool can't sing India's national anthem, chews gum while it's being played, why should he wear India's jersey? — Sonam Mahajan (@AsYouNotWish) 26 January 2017 -
ఐపీఎల్‌తో ఎదుగుతా
సన్‌రైజర్స్ ఆటగాడు రసూల్ విశ్వాసం న్యూఢిల్లీ: క్రికెటర్‌గా తన ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదని జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ అన్నాడు. తొలిసారిగా గత ఏడాది ఐపీఎల్-6లో పుణె వారియర్స్‌కు ఎంపికైన రసూల్.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్లో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అయితే కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే తుదిజట్టులో అతనికి స్థానం దక్కింది. ఆ తరువాత కోహ్లి సారథ్యంలో జింబాబ్వే పర్యటనకు భారత జట్టుకు ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతనికి రాలేదు. కానీ, ఈ విషయంలో తనకు ఎటువంటి నిరాశ లేదని, జట్టుకు ఎంపికవడం, సీనియర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకొనే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నానని రసూల్ అన్నాడు. ఇక ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుండటంతో ఐపీఎల్-7 ద్వారా తనను తాను నిరూపించుకునే అవకాశం రానుందని చెబుతున్నాడు. ‘వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడంపైనే దృష్టి నిలిపాను. క్రికెటర్‌గా నా ఎదుగుదలకు ఐపీఎల్ చక్కని వేదిక కాగలదు. సన్‌రైజర్స్ జట్టులోని జాతీయ, అంతర్జాతీయ స్టార్లతో కలిసి ఆడనుండటం కచ్చితంగా అందుకు దోహదపడేదే’ అని 25 ఏళ్ల రసూల్ అన్నాడు. ఇక యువరాజ్ విషయంలో అభిమానుల తీరును అతడు ఖండించాడు. -
రసూల్ సెంచరీ
వడోదర: జమ్మూ కాశ్మీర్ ఆల్‌రౌండర్, కెప్టెన్ పర్వేజ్ రసూల్ రంజీ ట్రోఫీలో తన బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. ఈ సీజన్లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన అతను క్వార్టర్ ఫైనల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌తో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో రసూల్ (137 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో రాణించి తన జట్టును మెరుగైన స్థితికి చేర్చాడు. రసూల్‌తో పాటు ఆదిల్ రిషి (108 బంతుల్లో 65; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో మ్యాచ్ రెండో రోజు గురువారం జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆ జట్టు పంజాబ్‌కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే కోల్పోయింది. రసూల్ నాలుగో వికెట్‌కు ఆదిల్‌తో 81 పరుగులు, సమీయుల్లా బేగ్ (37)తో ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించడం విశేషం. సందీప్ శర్మకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం కాశ్మీర్ బౌలర్లు కట్టడి చేయడంతో పంజాబ్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చేతిలో 8 వికెట్లు ఉన్న పంజాబ్ ప్రస్తుతం ఓవరాల్‌గా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. మహేశ్ రావత్ శతకం కోల్‌కతా: బెంగాల్‌తో జరుగుతున్న మరో క్వార్టర్స్‌లో రైల్వేస్ జట్టు ఆధిక్యం దిశగా వెళుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మహేశ్ రావత్ (125 బంతుల్లో 105 బ్యాటింగ్; 18 ఫోర్లు, 1 సిక్స్), ఆరిందమ్ ఘోష్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్; 11 ఫోర్లు) ఆరో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 191 పరుగులు జత చేయడం విశేషం. దిండా (3/83), శివ్ పాల్ (2/36) ధాటికి రైల్వేస్ ఒక దశలో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే రావత్, ఘోష్ జోడి జట్టును ఆదుకుంది. ప్రస్తుతం మరో 84 పరుగులు వెనుకబడి ఉన్న రైల్వేస్ చేతిలో 5 వికెట్లు ఉండటంతో ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 274/8 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన బెంగాల్ మరో 43 పరుగులు జోడించి 317 పరుగులకు ఆలౌటైంది. ఉత్తరప్రదేశ్ వెనుకంజ బెంగళూరు: కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. పర్వీందర్ సింగ్ (181 బంతుల్లో 92; 13 ఫోర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, పీయూష్ చావ్లా (99 బంతుల్లో 56; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 110 పరుగులు జోడించడంతో యూపీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మరో వికెట్ మాత్రమే చేతిలో ఉన్న యూపీ ప్రస్తుతం 128 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 297/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులకు ఆలౌటైంది. సీఎం గౌతమ్ (100) సెంచరీ పూర్తి చేసుకోవడం గురువారం ఆటలో విశేషం. భారీ ఆధిక్యం దిశగా ముంబై ముంబై: మహారాష్ట్రతో వాంఖడే మైదానంలో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబైకి భారీ ఆధిక్యం దక్కే అవకాశం ఉంది. గురువారం ఆట ముగిసే సరికి మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అంకిత్ బానే (113 బంతుల్లో 84; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ (66 బంతుల్లో 51; 9 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 115 పరుగులు జత చేసి జట్టును ఆదుకున్నారు. ముంబై బౌలర్ షార్దుల్ ఠాకూర్ (4/62) ఆకట్టుకున్నాడు. యువ ఆటగాడు విజయ్ జోల్ (15) వికెట్‌ను మాత్రం జహీర్ ఖాన్ పడగొట్టగలిగాడు. అంతకు ముందు ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. చివర్లో ఇక్బాల్ అబ్దుల్లా (49 నాటౌట్), జహీర్ ఖాన్ (39) ఎనిమిదో వికెట్‌కు 62 పరుగులు జత చేయడం విశేషం. ప్రస్తుతం 3 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న మహారాష్ట్ర మరో 183 పరుగులు వెనుకబడి ఉండటంతో ముంబై భారీ ఆధిక్యం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
బ్యాటింగ్ లో భజ్జీ మెరుపులు
వడోదర: జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ సింగ్ రంజీ ట్రోఫీలో పంజాబ్‌ను ముందుండి నడిపించాడు. అయితే అది బంతితో కాదు... బ్యాట్స్‌మన్‌గా సత్తా చాటుతూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా జమ్మూ కాశ్మీర్‌తో బుధవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్ సింగ్ (79 బంతుల్లో 92; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకోవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ నిలబడింది. కాశ్మీర్ బౌలర్లు ఉమర్ నజీర్ (4/66), రామ్ దయాళ్ (3/59) చెలరేగడంతో పంజాబ్ 146 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హర్భజన్, సందీప్ శర్మ (123 బంతుల్లో 51; 8 ఫోర్లు) కలిసి ఎనిమిదో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. ముఖ్యంగా పర్వేజ్ రసూల్‌పై భజ్జీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. రసూల్ బౌలింగ్‌లోనే 5 సిక్సర్లు కొట్టిన పంజాబ్ కెప్టెన్, చివరకు అతనికే వికెట్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసింది. ఉతప్ప, కరుణ్ నాయర్ సెంచరీలు బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌తో ప్రారంభమైన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప (160 బంతుల్లో 100; 19 ఫోర్లు), కరుణ్ నాయర్ (246 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు చేయడం విశేషం. రాహుల్ (0), సమర్థ్ (0), మనీశ్ పాండే (0) వరుసగా వెనుదిరగడంతో కర్ణాటక స్కోరు 15/3 వద్ద నిలిచింది. ఈ దశలో ఉతప్ప, నాయర్ నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించి ఆదుకున్నారు. గౌతమ్ (101 బంతుల్లో 89 బ్యాటింగ్; 14 ఫోర్లు) సెంచరీకి చేరువలో ఉన్నాడు. సూర్యకుమార్ శతకం ముంబై: వాంఖడే మైదానంలో మహారాష్ట్రతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (139 బంతుల్లో 120; 18 ఫోర్లు), వినీత్ ఇందూల్కర్ (164 బంతుల్లో 82; 13 ఫోర్లు) ఐదో వికెట్‌కు 183 పరుగులు జోడించడం విశేషం. వసీం జాఫర్ (44) ఫర్వాలేదనిపించాడు. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచా, ఫలా చెరో 3 వికెట్లు పడగొట్టారు. సుదీప్ ఛటర్జీ సెంచరీ మిస్ కోల్‌కతా: రైల్వేస్‌తో ప్రారంభమైన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆట ముగిసే సరికి బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. సుదీప్ ఛటర్జీ (176 బంతుల్లో 96; 14 ఫోర్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈశ్వరన్ (65), సాహా (60 బ్యాటింగ్) రాణించారు. రైల్వేస్ బౌలర్ అనురీత్ సింగ్ (4/75) ఆకట్టుకున్నాడు. మళ్లీ అదే సీన్! లీగ్ దశలో బెంగాల్, రైల్వేస్ జట్ల మధ్య ‘మన్కడింగ్’తో ఏర్పడిన వివాదం చల్లబడినట్లు లేదు. ఇరు జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్లో కూడా మళ్లీ మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఈసారి కూడా రైల్వేస్ కెప్టెన్ మురళీ కార్తీక్ ఇందులో భాగమయ్యాడు. బెంగాల్ ఆటగాడు అశోక్ దిండా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కార్తీక్ అతని ఆట గురించి ఏదో వ్యాఖ్య చేసినట్లు తెలిసింది. అయితే 12 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసిన దిండా, ఆట ముగిశాక డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళుతూ తన బ్యాట్‌ను రైల్వేస్ టీమ్ వైపు చూపిస్తూ సైగలు చేశాడు. ‘కార్తీక్ మాటలకే దిండా స్పందించాడు. తగిన విధంగా జవాబు ఇవ్వడం దిండాకు బాగా తెలుసు’ అని బెంగాల్ జట్టు సభ్యుడొకరు వెల్లడించారు. అంతకు ముందు కార్తీక్ బౌలింగ్‌లో కీపర్ రావత్ స్టంపింగ్ మిస్ చేయడంతో బెంగాల్ కెప్టెన్ శుక్లా బతికిపోయాడు. ఈ సందర్భంలో కూడా మాటల దాడికి దిగారు. -
రంజీలో తొలిసారి...
అగర్తల: రంజీ ట్రోఫీలో తమ చరిత్రలో తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. త్రిపురతో ఇక్కడ ముగిసిన చివరి మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాగా ముగించింది. 228 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కాశ్మీర్ ఆట ముగిసే సరికి 2 వికెట్లకు 87 పరుగులు చేసింది. అర్ధ సెంచరీతో పాటు 7 వికెట్లు పడగొట్టిన పర్వేజ్ రసూల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. త్రిపురతో మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కాశ్మీర్‌కు 3 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పరంగా గోవా (24)తో సమానంగా నిలిచింది. లీగ్ దశలో ఇరు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. దాంతో రన్ కోషెంట్ (చేసిన, ఇచ్చిన పరుగుల ఆధారంగా)ను పరిగణలోకి తీసుకున్నారు. గోవా (1.005)కంటే 0.001 పాయింట్లు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ (1.006) స్వల్ప తేడాతో ముందుకు దూసుకుపోయింది. 2000-01 సీజన్లో కాశ్మీర్ నాకౌట్ దశకు చేరినా అది అప్పటి రంజీ ఫార్మాట్ ప్రకారం ప్రిక్వార్టర్స్ మాత్రమే. ముంబై సంచలన విజయం వల్సాడ్: రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సత్తా చాటింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఇక్బాల్ అబ్దుల్లా (5/44), విశాల్ దభోల్కర్ (4/33) చెలరేగడంతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై సంచలన విజయం సాధించింది. 175 పరుగుల విజయలక్ష్యం ముందుండగా, 67/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ ఒక దశలో 134/4తో గెలుపు దిశగా పయనించింది. అయితే 12 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 147 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్ (65) తప్ప అంతా విఫలమయ్యారు. లక్నోలో రైల్వేస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఉత్తరప్రదేశ్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మరో వైపు గత ఏడాది ఫైనలిస్ట్ సౌరాష్ట్ర ఈ సారి క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్లో సెమీ ఫైనల్ చేరిన సర్వీసెస్‌తో పాటు క్వార్టర్స్ వరకు చేరుకున్న జార్ఖండ్, బరోడా ఈ సారి లీగ్ దశను దాటలేకపోయాయి. క్వార్టర్ ఫైనల్లో ఎవరితో ఎవరు (జనవరి 8 నుంచి 12 వరకు) 1. ముంబై x మహారాష్ట్ర ( వాంఖడే స్టేడియం, ముంబై) 2. బెంగాల్ x రైల్వేస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా) 3. కర్ణాటక x ఉత్తరప్రదేశ్ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు) 4. పంజాబ్ x జమ్మూ కాశ్మీర్ (మోతీబాగ్ స్టేడియం, వడోదర) 1, 2 మ్యాచ్‌ల విజేతల మధ్య తొలి సెమీ ఫైనల్ ఇండోర్‌లో... 3, 4 మ్యాచ్‌ల విజేతల మధ్య రెండో సెమీ ఫైనల్ మొహాలీలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగుతాయి. ఉప్పల్‌కు ‘ఫైనల్’ చాన్స్ హైదరాబాద్: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగానే ఉన్నా మ్యాచ్‌ల నిర్వహణపరంగా నగరంలోని స్టేడియం మాత్రం బీసీసీఐ దృష్టిలో ప్రధాన వేదికగానే కనిపిస్తోంది. ఈ సీజన్లో రంజీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ నెల 29నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇక్కడ ఫైనల్ జరుగుతుంది. గతంలో ఒక సారి 2008-09 సీజన్లో ముంబై, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య కూడా రంజీ ట్రోఫీ ఫైనల్ ఉప్పల్లోనే జరిగింది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. -
రసూల్‌కు ఐదు వికెట్లు
మైసూర్: జమ్ము కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ (5/116) ఐదు వికెట్లతో రాణించినా... భారత్ ‘ఎ’తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. ఫుదాదిన్ (86 నాటౌట్), మిల్లర్ (49) సమయోచితంగా రాణించడంతో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 135 ఓవర్లలో 429 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసింది. జునేజా (47 నాటౌట్), ఖడివాలే (5 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (46) ఓ మోస్తరుగా ఆడాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ చతేశ్వర్ పుజారా (3) విఫలమయ్యాడు. నాలుగు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన భారత్... రాహుల్, జునేజాలు మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో కుదురుకుంది. -
సీనియర్లకు మరో చాన్స్
సాక్షి, విశాఖపట్నం: ఫామ్‌లో లేక, ఫిట్నెస్ కోల్పోయి భారత సీనియర్ జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది. సొంతగడ్డపై వెస్టిండీస్ ‘ఎ’తో జరిగే అనధికారిక టెస్టు, వన్డే సిరీస్‌లకోసం సెలక్టర్లు మంగళవారం ఇక్కడ మూడు భారత ‘ఎ’ జట్లను ప్రకటించారు. సీనియర్లు సెహ్వాగ్, జహీర్ ఖాన్, గౌతం గంభీర్‌లకు టెస్టు జట్టులో చోటు లభించింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌లో మొదటి టెస్టుకు కాకుండా...రెండు, మూడు టెస్టుల కోసం వీరిని ఎంపిక చేశారు. కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ ఒక్కడే మూడు టెస్టులకూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ టూర్లో భాగంగా విండీస్‌తో జరిగే మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్ కోసం ఎంపిక చేసిన వన్డే జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సీనియర్ టీమ్‌లోకి వచ్చేందుకు ఇది అతనికి లభించిన అవకాశంగా భావించవచ్చు. గత నెల దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు చాంపియన్స్ లీగ్ ఆడుతున్నందున వారిని ఎంపిక చేయలేదు. సెప్టెంబర్ 15నుంచి 21 వరకు బెంగళూరులో వన్డే, టి20 మ్యాచ్‌లు... సెప్టెంబర్ 25నుంచి అక్టోబర్ 12 వరకు మైసూరు, షిమోగా, హుబ్లీలలో టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి.