టీవీ షోలో కోహ్లి ఏం చేశాడంటే..? | Indian cricketer Virat Kohli is already changing diapers | Sakshi
Sakshi News home page

టీవీ షోలో కోహ్లి ఏం చేశాడంటే..?

Published Wed, Jun 15 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

టీవీ షోలో కోహ్లి ఏం చేశాడంటే..?

టీవీ షోలో కోహ్లి ఏం చేశాడంటే..?

న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మను త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని రూమర్లు షికారు చేస్తుండగా మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. పిల్లలకు అతడు డైపర్స్ మార్చాడని వెల్లడైంది. పెళ్లికాకుండానే ఈ ఛాన్స్ ఎలా దక్కిందని ఆశ్చర్యపోకండి. జింబాబ్వే పర్యటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలో అతడు టీవీలో కనిపించనున్నాడు.

స్టార్ వరల్డ్ చానల్ లో తారా శర్మ నిర్వహిస్తున్న షోలో విరాట్ కోహ్లి పాల్గొన్నాడు. పిల్లల పెంపకం గురించి ఈ షోలో కోహ్లి మాట్లాడని తారా శర్మ తెలిపారు. తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని చిన్నారులకు సూచించాడని చెప్పారు. తనకు ఇష్టమైన క్రికెట్ క్రీడను తాను ఎంచుకున్నానని కోహ్లి చెప్పాడని తెలిపారు. అంతేకాదు పిల్లలకు డైపర్లు కూడా మార్చాడని వెల్లడించారు. 'అవును డైపర్లు మార్చాన'ని కోహ్లి కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే స్టార్ వరల్డ్ చానల్ లో ఈ షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విరాట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement