diapers
-
ఆస్ట్రోనాట్స్..ఇంకేం చేస్తాం..డైపర్లు ధరిస్తాం..!
భూమి నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో స్పేస్ స్టేషన్. 197 రోజులుగా అక్కడే గడుపుతున్న అస్ట్రోనాట్స్. మరికొద్ది సేపట్లో భూమికి తిరుగు ప్రయాణానికి షెడ్యూల్ ఖరారయ్యింది. కానీ ఆఖరి నిమిషంలో వారికి ఊహించని సమస్య ఎదురైంది. ఓవైపు షెడ్యూల్ మరోవైపు సాంకేతిక సమస్య. ఏ మాత్రం అటు ఇటు అయినా సరే అస్ట్రోనాట్స్ ప్రాణాలకు ప్రమాదంతో పాటు ఎంతో విలువైన స్పేస్ ఎక్వీప్‌మెంట్‌ను సైతం నష్టపోవాల్సి ఉంటుంది. అయితే అస్ట్రోనాట్స్ చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి నష్టం లేకుండా ఆ స్పేస్ క్యాప్యూల్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటీ ? దాన్ని ఎలా పరిష్కరించారు. ఎప్పుడు ఇక్కడికి చేరుకుంటున్నారు తెలుసుకోవాలంటే... ఏప్రిల్ నెలలో అంతరిక్ష కేంద్రానికి పయనం ప్రయోగాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 23న స్పేస్ఎక్స్ చెందిన క్యాప్యూల్స్ ద్వారా నాసాకు చెందిన ఆస్ట్రోనాట్స్ షేన్ కింబ్రో,ఫ్రాన్స్‌కు చెందిన థామస్ పెస్కెట్, జపాన్‌కు చెందిన అకిహికో హోషిడే, మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్లు స్పేస్‌లో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వెళ్లారు. అలా స్పేస్‌లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ గరిష్టంగా 210 రోజుల పాటు స్పేస్‌లో ప్రయోగాలు చేయాల్సి ఉండగా శుక్రవారంతో 197 రోజులు పూర్తి చేసుకొని తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది. అయితే ప్రయోగాలు పూర్తి చేసుకొని కిందికి వచ్చే సమయంలో క్యాప్యూల్స్‌లో ఉన్న యురినల్ మూత ఊడిపోవడంతో ఆ యూరిన్ క్యాప్యూల్స్ అడుగుకు చేరింది. దీంతో స్పేస్ స్టేషన్ నుంచి సుమారు 20 గంటల సమయం పట్టనుంది. అయితే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేసినా..ఆలస్యం అయితే అబ్జారెంట్ అండర్‌గార్మెంట్స్ (డైపర్లు) ధరించి భూమి మీదకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మహిళా వ్యోమగామి మెక్ ఆర్థర్ వర్చువల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భయపడేది లేదు క్యూప్యూల్స్ అంతరాయంపై మహిళా ఆస్ట్రోనాట్స్ మెక్ ఆర్థర్ స్పందించారు. క్యాప్యూల్స్‌లోని యురినల్ విభాగంలో అంతరాయం ఏర్పడిందని మెక్ ఆర్థర్ తెలిపింది. స్పేస్ ప్రయాణం అనేక సవాళ్లతో కూడుకుందని, అన్నింటిని అధిగమించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ యురినల్ విభాగంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. టాయిలెట్ విభాగంలోని సమస్యతో అంతరిక్షం నుంచి భూమి మీదకు 20గంటల ప్రయాణం చేయడం అంత సులభం కాదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ నెలలోనే క్యూప్యూల్లో యురినల్ విభాగంలో టాయిలెట్ లీకైంది. ఆ విషయాన్ని సెప్టెంబర్‌లోనే గుర్తించినట్లు తెలుస్తోంది. స్పేస్ఎక్స్ క్యాప్సూల్‌లోని ప్యానెల్లను పైకి లాగడం వల్ల లీకేజీ జరుగుతున్నట్లు ఆస్ట్రోనాట్స్ గుర్తించి, ఆ సమస్యను పరిష్కరించారు. తాజాగా ఆ తరహా సమస్య మరోసారి పునరావృతం కావడంతో భూమి మీదకు వచ్చేందుకు ఆస్ట్రోనాట్స్ అబ్జారెంట్ అండర్ గార్మెంట్స్‌ను ధరించి ఆదివారం ఉదయం 10గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి భయలు దేరి సోమవారం ఉదయం 4గంటలకు ఫ్లోరిడాలో దిగనున్నారు. చదవండి: చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
తండ్రి అయ్యాక అదెంతో మేలు చేసింది: కోహ్లి
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ సెలవులు ముగించుకుని జట్టుతో కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇంగ్లాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టులో ఆడుతున్నాడు. అయితే ఏళ్ల తరబడి క్రికెటర్‌గా ఉండటం వల్ల కొత్త విషయాలను సులువుగా నేర్చుకోగలుతున్నానని తెలిపాడు. ఈ మేరకు బీసీసీఐ పోస్ట్ చేసిన ఓ వీడియోలో కోహ్లి తండ్రి అయిన తర్వాత తన జీవితంలోకి వచ్చిన కొత్త బాధ్యతల గురించి తెలియజేశాడు. డైపర్లు మార్చడం మరీ అంత కష్టమైన పనేం కాదన్నాడు. ‘‘ఏళ్లుగా క్రికెట్ ఆడటం వల్ల చాలా విషయాలను సులువుగా అర్థం చేసుకునే లక్షణం అబ్బింది. నేర్చుకున్న ప్రతి విషయంలో మాస్టర్ని కాకపోవచ్చు కానీ.. మేనేజ్ చేయగలను. ఇక రవీ భాయ్ వల్ల క్రీజులో, బయట అన్ని విషయాల గురించి ఎంతో కొంత అవగాహన కలిగింది. పరిస్థితులకు అనుకూలంగా నన్ను నేను మార్చుకోగలగడం క్రికెట్ వల్ల సాధ్యమయ్యింది. ఇదే అంశం తండ్రి అయ్యాక నాకు బాగా పనికి వచ్చింది. డైపర్లు మార్చడం.. పాపను జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకోవడం వంటి అంశాల గురించి ఇప్పడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి డైపర్లు మార్చడం మరీ అంత కష్టమేం కాదు. అయితే ఈ పనిలో నేను ఇంకా మాస్టర్ని కాలేదు’’ అన్నాడు. A special Test series triumph in Australia A new chapter in life Return of international cricket in India DO NOT MISS: #TeamIndia skipper @imVkohli and Head Coach @RaviShastriOfc get candid. 😎👌 Watch the full interview 🎥 https://t.co/9gffUQG2I2 @Paytm #INDvENG pic.twitter.com/ISg5TzMPXn — BCCI (@BCCI) February 5, 2021 ఇక బ్రిస్బెన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత టీమిండియాకు ఏ ర్యాంక్ ఇస్తారని ప్రశ్నించగా.. ఖచ్చితంగా టాప్ అనే వెల్లడించాడు కోహ్లి. ‘‘ఎందుకంటే బ్రిస్బెన్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో పోల్చితే మాకు ఎన్నో అవరోధాలు ఉన్నాయి. కానీ వాటన్నింటిని తట్టుకుని మేం విజయం సాధించాం. అందుకే టాప్ ర్యాంక్ ఇస్తానని’’ తెలిపాడు. ఇక ఈ వీడియోలో కోహ్లి, టీమిండియా కోచ్ రవి శాస్త్రిలు పలు అంశాల గురించి ముచ్చటించారు. చదవండి: నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు.. చదవండి: ‘ఏంటి కోహ్లి.. మరీ అంత పనికిరాని వాడినా’ -
డిక్కీలు ఊపుకుంటూ వయ్యారంగా..!
ఈ మధ్య అమెరికాలోని కోళ్లు డిక్కీలు ఊపుకుంటూ వయ్యారంగా తిరుగుతున్నాయట.. విషయమేంటని ఆరాతీస్తే.. హవ్వ అంటూ నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చూశారుగా.. డిక్కీలకు డైపర్లు!! ఇక్కడైతే.. పిల్లలకు వేస్తాం.. అమెరికాలో వీటికి వేశారు... కనిపించినచోటల్లా రెట్టలతో ముగ్గులు పెట్టేయకుండా.. ఇలా కట్టడి చేశారన్నమాట. అక్కడి గ్రామీణప్రాంతాల్లో కోళ్లను పెంపుడు జంతువులుగా పెంచడం స్టేటస్ సింబల్‌గా మారిందట. దీంతో న్యూహాంప్‌షైర్‌కు చెందిన జూలీ బేకర్ బుర్రలో ఐడియా వచ్చింది. వెంటనే కోళ్లకు ఫ్యాషనబుల్‌గా కనిపించే డైపర్లు తయారుచేయడం ద్వారా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. కొన్నేళ్ల క్రితం యూ ట్యూబ్‌లో ఎవరో సరదాగా పెట్టిన కోడిపెట్టకు డైపర్ వేసిన వీడియోను ఆమె చూశారు. దీంతో నిజంగా మనమెందుకు ఇలా చేయకూడదు అనిపించిందట. పైగా.. తన కూతురు ఓ కోడిని పెంచుకుంటోంది. అది ఇంటిలో అక్కడక్కడా రెట్టలు వేయడం.. దాన్ని శుభ్రపరుచుకోవడానికి ఈవిడ తిప్పలు పడటం వంటివి గుర్తుకొచ్చాయి. దీంతో వాటికి డైపర్లు తయారు చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల క్రితం ‘పేంపర్డ్ పౌల్ట్రీ’పేరిట ఆన్లైన్లో విక్రయాలు మొదలుపెట్టింది. నెమ్మది నెమ్మదిగా విక్రయాలు పెరిగాయి. నగరాల్లో ఉన్నవారు కూడా కొనడం మొదలుపెట్టారు. అన్ని ఖర్చులు పోనూ.. జూలీకి ఏటా రూ.40 లక్షల దాకా మిగులుతున్నాయట. డైపర్లు సక్సెస్ కావడంతో ఆమె కోళ్లకు డ్రస్సులు వంటి వాటి విక్రయాలు కూడా మొదలుపెట్టింది. -
టీవీ షోలో కోహ్లి ఏం చేశాడంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు అనుష్క శర్మను త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని రూమర్లు షికారు చేస్తుండగా మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. పిల్లలకు అతడు డైపర్స్ మార్చాడని వెల్లడైంది. పెళ్లికాకుండానే ఈ ఛాన్స్ ఎలా దక్కిందని ఆశ్చర్యపోకండి. జింబాబ్వే పర్యటకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకుంటున్న విరాట్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలో అతడు టీవీలో కనిపించనున్నాడు. స్టార్ వరల్డ్ చానల్ లో తారా శర్మ నిర్వహిస్తున్న షోలో విరాట్ కోహ్లి పాల్గొన్నాడు. పిల్లల పెంపకం గురించి ఈ షోలో కోహ్లి మాట్లాడని తారా శర్మ తెలిపారు. తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని చిన్నారులకు సూచించాడని చెప్పారు. తనకు ఇష్టమైన క్రికెట్ క్రీడను తాను ఎంచుకున్నానని కోహ్లి చెప్పాడని తెలిపారు. అంతేకాదు పిల్లలకు డైపర్లు కూడా మార్చాడని వెల్లడించారు. 'అవును డైపర్లు మార్చాన'ని కోహ్లి కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే స్టార్ వరల్డ్ చానల్ లో ఈ షో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు విరాట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
బ్రేక్ లేక.. డైపర్స్ వాడుతున్నారు!
వాషింగ్టన్: అమెరికాలోని చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెల్లడించిన విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. చౌక ధరకే చికెన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ.. కోట్లు గడిస్తున్న బడా చికెన్ ఫ్యాక్టరీలు తమ కార్మికుల విషయంలో మాత్రం కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించడం లేదు. కార్మికులు టాయ్‌లెట్‌కు వెళ్లడానికి కూడా యాజమాన్యాలు అనుమతించకుండా వేధిస్తున్నాయంటూ కొందరు కార్మికులు వెల్లడించిన నిజాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పని మధ్యలో కార్మికులు టాయ్‌లెట్ కోసం విరామం తీసుకోవడం మూలంగా ఉత్పదకత తగ్గిపోతుందని భావించే యాజమాన్యాలు అందుకు అనుమతించడం లేదని, దీనివల్ల డైపర్స్ వాడుతున్నానంటూ ఓ కార్మికుడు వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయంగా పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఆక్స్‌ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. తానే కాదు తనతో పాటు పనిచేసే చాలా మంది కార్మికులు ఇలాగే డైపర్స్ వాడుతారని, మరికొందరు టాయ్‌లెట్‌కు వెళ్లే అవసరం లేకుండా నీటిని త్రాగకుండా పనిచేసి అనారోగ్యం పాలౌతున్నారని ఓ కార్మికుడు వెల్లడించిన విస్తుగొలిపే విషయాలను ఆ నివేదిక పేర్కొంది. చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే వందలాది కార్మికుల భయంకర అనుభవాలను ఈ నివేదిక తెలిపింది. ఇటీవల చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెరిగిన టెక్నాలజీ మూలంగా ఉత్పాదన వేగం కూడా పెరిగింది. అయితే ఈ వేగాన్ని అందుకోవడానికి బడా కంపెనీలు కార్మికులపై తీవ్రస్థాయిలో పనిభారం మోపుతున్నారని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెండు విడతలు అరగంట చొప్పున విరామం ఇవ్వాలన్న కనీస నిబంధనలను చికెన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పట్టించుకోవడం లేదని నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. -
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!
బీజింగ్: ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా తెలిపాడో ప్రేమికుడు. వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడో చైనా లవర్. డైమండ్ రింగ్ బదులుగా డైపర్స్ తో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 50పైగా డైపర్ ప్యాక్స్ తో ప్రపోజ్ చేశాడని స్థానిక మీడియా వెల్లడించింది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ రెండేళ్ల పాటు తన ప్రియురాలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె నెల తప్పిందని తెలుసుకుని తన ప్రేమను వెరైటీగా తెలపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. తన స్నేహితుల సహాయంతో 4500 డైపర్లు కొని వీటిని 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో ప్యాక్ చేశాడు. పెర్ల్ నది ఒడ్డున తన ప్రియురాలికి దీన్ని బహూకరించి ప్రేమను వ్యక్తం చేశాడు. అంతేకాదు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. డ్రోన్ సహాయంతో మరో డైపర్ బ్యాగ్ ను ఆమెకు అందించాడు. ఇది ఓపెన్ చేయగానే ఫెంగ్ ప్రియురాలి ముఖం సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోయింది. డైపర్ బ్యాగ్ లోపల డైమండ్ రింగ్ పెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు. 'ఈరోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అని ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే అంగీకరించింది.