న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడా ప్రమాణాలను పెంచడంతోపాటు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే దిశగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఏర్పడిన ‘ది మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్’ (ఎంసీటీ) రద్దయ్యింది.
నిధుల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని... మరింత డబ్బును వెచ్చించేందుకు వారు (మిట్టల్) సుముఖంగా లేరని ట్రస్ట్ సీఈవో మనీష్ మల్హోత్రా తెలిపారు. స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ఆధ్వర్యంలో 2005 నుంచి ఉనికిలో ఉన్న ఎంసీటీ.. షూటర్ అభినవ్ బింద్రా, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న రెజ్లర్ యోగేశ్వర్ దత్‌లకు సహకారం అందించింది. భారత క్రీడా వ్యవస్థలో నిర్వహణ లోపం కనిపిస్తోందని, ప్రభుత్వంతో పాటు ఆయా సమాఖ్యల దగ్గర కూడా సరైన ప్రణాళికలు కనిపించడం లేదని ఎంసీటీ హెడ్ అమిత్ భాటియా ఆరోపించారు.
మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ రద్దు
Published Thu, Mar 13 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement