ఆసియాకప్ జూ. మహిళల హాకీ
చాంగ్జూ (చైనా) : మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో దుమ్ము రేపింది. శనివారం డీపీఆర్ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రాణీ రాంపాల్ ఐదు గోల్స్‌తో రెచ్చిపోవడంతో భారతజట్టు ఏకంగా 13-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ప్రీతీ దుబే 11వ నిమిషంలో తొలి గోల్ చేయగా ఆ తర్వాత జస్‌ప్రీత్ కౌర్ (20వ నిమిషంలో), నవ్‌నీత్ కౌర్ (24), రాణీ రాంపాల్ (28), లిల్లీ చాను (31), పూనమ్ బార్లా చేసిన గోల్స్‌తో తొలి అర్ధభాగంలో 6-0తో తిరుగులేని ఆధిక్యాన్ని అందుకుంది.
ఇక ద్వితీయార్ధంలో రాణీ రాంపాల్ సూపర్ షోతో ఉత్తర కొరియా జట్టు చేతులెత్తేసిం ది. 43, 44, 46వ నిమిషాల్లో వరుస ఫీల్డ్ గోల్స్‌తో తను ప్రత్యర్థి గోల్‌పోస్టుపై విరుచుకుపడి హ్యాట్రిక్ సాధించింది. లిలిమా మింజ్ (51) పదో గోల్ సాధించగా మిగతా మూడు గోల్స్ 52, 64, 70వ నిమిషాల్లో వచ్చాయి.
భారత్ ఘనవిజయం
Published Sun, Sep 6 2015 1:22 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement