రాణీ రాంపాల్ హ్యాట్రిక్: సెమీస్‌లో భారత్
చాంగ్‌జౌ : జూనియర్ మహిళల ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 9-1తో మలేసియాను ఓడించింది. భారత్ తరఫున రాణీ రాంపాల్ హ్యాట్రిక్ గోల్స్ తో చెలరేగగా, జస్‌ప్రీత్ కౌర్ రెండు, ప్రీతి, పూనమ్ గోల్స్ చేశారు. సైటీ నార్ఫిజా మలేసియాకు ఏకైక గోల్ అందించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత్ 8వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది.
15వ నిమిషంలో పెనాల్టీని జస్‌ప్రీత్ గోల్‌గా మల్చడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగాన్ని 2-1 స్కోరుతో ముగించిన భారత్... రెండో అర్ధభాగంలో మరింత రెచ్చిపోయింది. ఆరు నిమిషాల వ్యవధిలో ఐదు గోల్స్ చేసింది. ఇక ఆట చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జస్‌ప్రీత్ గోల్‌గా మల్చడంతో భారత్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.