భారత హాకీ స్టార్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రాణి రాంపాల్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అసమాన ప్రతిభకు జెర్సీ నంబర్ 28 చిరునామాగా మారిందని ఆయన అన్నారు. 29 ఏళ్ల రాణి భారత మహిళల హాకీ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సారథ్యంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో జట్టు నాలుగో స్థానంలో నిలిచింది.
‘భారత హాకీలో అసమాన ప్రతిభ, అత్యున్నత స్థాయి లక్ష్యాలకు నీ 28 నంబర్ జెర్సీ చిరునామాగా నిలిచింది. ఇకపై మైదానంలో ఆ ఆట కనిపించకపోవచ్చు గానీ ఒక అత్యుత్తమ క్రీడాకారిణిగా నువ్వు అందించిన జ్ఞాపకాలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచి ఉంటాయి. అతి పిన్న వయసులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన నువ్వు నీ ఆటతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించావు. సారథిగా ముందుండి నడిపించిన నువ్వు ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త బాధ్యతతో ఆటలోనే కొనసాగడం సంతోషకరం’ అని మోదీ తన సోషల్ మీడియా ద్వారా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment