భారతీయ విద్యాభవన్‌కు టైటిల్ | Indian vidyabhavan got title | Sakshi
Sakshi News home page

భారతీయ విద్యాభవన్‌కు టైటిల్

Published Thu, Oct 2 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

భారతీయ విద్యాభవన్‌కు టైటిల్

భారతీయ విద్యాభవన్‌కు టైటిల్

సౌత్‌జోన్ సీబీఎస్‌ఈ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ సీబీఎస్‌ఈ టెన్నిస్ టోర్నమెంట్ అండర్-14 బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన భారతీయ విద్యాభవన్ (బీవీబీ) పబ్లిక్ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది. బెంగళూరులోని ఆకాశ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో దాదాపు 70 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్లో భారతీయ విద్యాభవన్ 2-0 తేడాతో హైదరాబాద్‌కే చెందిన గ్లోబల్ ఎడ్జ్ స్కూల్‌పై విజయం సాధించింది. బీవీబీకి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు రెండు వరుస సింగిల్స్ మ్యాచ్‌లలో నెగ్గి తమ జట్టుకు టైటిల్ అందించారు. ఫైనల్ తొలి సింగిల్స్‌లో ప్రత్యూష రాచపూడి 5-3, 4-0 స్కోరుతో విదిశ రెడ్డిపై విజయం సాధించింది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో శ్రీవల్లి రష్మిక 5-4 (7/3), 4-0 తేడాతో మాన్య విశ్వనాథ్‌ను ఓడించింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement