ఫైనల్లో ఫెడరర్, వావ్రింకా | Indian Wells Masters Series tennis tournament final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఫెడరర్, వావ్రింకా

Published Mon, Mar 20 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

Indian Wells Masters Series tennis tournament final

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ కోసం స్విట్జర్లాండ్‌ స్టార్స్‌ రోజర్‌ ఫెడరర్, స్టానిస్లాస్‌ వావ్రింకా అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఫెడరర్‌ 6–1, 7–6 (7/4)తో జాక్‌ సాక్‌ (అమెరికా)పై గెలుపొందగా... వావ్రింకా 6–3, 6–2తో బుస్టా (స్పెయిన్‌)ను ఓడించాడు.

వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో ఫెడరర్‌ 19–3తో ఆధిక్యంలో ఉన్నాడు. 42 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో 2001 తర్వాత (అగస్సీ, సంప్రాస్‌–అమెరికా) తొలిసారి ఒకే దేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఫైనల్‌ జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement