మహిళల హాకీలో మనోళ్లకు ఐదో స్థానం | Indian women's hockey team finish 5th place | Sakshi
Sakshi News home page

మహిళల హాకీలో మనోళ్లకు ఐదో స్థానం

Published Fri, Aug 1 2014 7:02 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

Indian women's hockey team finish 5th place

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల హాకీ జట్టు ఓదార్పు విజయంతో నిష్ర్కమించింది. శుక్రవారం ఐదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 2-1తో ఆతిథ్య స్కాట్లాండ్పై విజయం సాధించింది. గ్రూపు దశలో రాణించలేకపోయిన భారత్ నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత క్రీడాకారులు అద్భుతంగా రాణించారు. ఆట ప్రథమార్ధంలో ఇరు జట్టు గోల్ చేయలేకపోయాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణితో ఆడగా, స్కాట్లాండ్కు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. విరామం తర్వాత భారత్ రెండు గోల్స్ చేయగా, స్కాట్లాండ్ ఓ గోల్కు మాత్రమే పరిమితమైంది. దీంతో భారత్ విజయంతో ఇంటిదారిపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement