దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత పాక్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. ఆపై లక్ష్యాన్ని 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా ఒక కొత్త రికార్డును భారత్ నమోదు చేసింది. ఇది బంతుల పరంగా చూస్తే భారత్‌కు అతి పెద్ద విజయం. ఇంకా 126 బంతులు(21 ఓవర్లు) ఉండగానే భారత్ గెలుపును సొంతం చేసుంది.
దాంతో పాక్‌పై గతంలో 105 బంతులు ఉండగా సాధించిన విజయాన్ని టీమిండియా తాజాగా సవరించింది. 2006లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో భారత్ 105 బంతులు మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది. ఇదే ఇప్పటివరకూ భారత్‌కు పాక్‌పై భారీ విజయం కాగా, ఇప‍్పుడు దాన్ని తిరగరాస్తూ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1997లో 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో టీమిండియా 92 బంతులు ఉండగా విజయాన్ని సాధించింది. ఈ మూడు బంతులు పరంగా చూస్తే పాక్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయాలుగా ఉన్నాయి.
చదవండి: తొలి దెబ్బ మనదే
Comments
Please login to add a commentAdd a comment