స్మృతీ మంధాన బ్యాటింగ్‌ రికార్డు | Indias Smriti Mandhana Equals Record for Fastest Womens T20 Half century of All Time | Sakshi
Sakshi News home page

స్మృతీ మంధాన బ్యాటింగ్‌ రికార్డు

Published Mon, Jul 30 2018 11:27 AM | Last Updated on Mon, Jul 30 2018 11:39 AM

Indias Smriti Mandhana Equals Record for Fastest Womens T20 Half century of All Time - Sakshi

టాంటాన్‌: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కియో సూపర్‌ లీగ్‌లో ఆడుతున్న తొలి భారత క్రీడాకారిణి గుర్తింపు పొందిన స్మృతీ మంధాన అరుదైన క్లబ్‌లో చేరిపోయారు. ఈ లీగ్‌లో వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ తరపున బరిలోకి దిగిన మంధాన మహిళల టీ 20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించి సరికొత్త బ్యాటింగ్‌ రికార్డు నమోదు చేశారు. ఆదివారం లాఫ్‌బారఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధాన 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో  అర్థ శతకం​ సాధించారు. ఫలితంగా సోఫీ డివైన్‌(న్యూజిలాండ్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం కల్గిన మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారు. ఈ క‍్రమంలోనే తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్ట్రన్‌ స్ట్రోమ్‌ ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. మంధాన(59; 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రాచెల్‌ ప్రీస్ట్‌(25; 13 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్‌ ఝుళిపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాఫ్‌బారఫ్‌ ఆరు ఓవర్లలో 67 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

చదవండి: కామెంటేటర్‌గా స్మృతి మంధాన!

స్మృతీ మంధాన మెరుపులు

తొలి భారత క్రికెటర్‌గా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement