టాంటాన్: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కియా సూపర్ టి20 లీగ్‌లో భారత క్రీడాకారిణి స్మృతీ మంధాన చెలరేగింది. ఈ లీగ్‌లో వెస్ట్రన్ స్ట్రోమ్ తరపున బరిలోకి దిగిన మంధాన తన అరంగేట్రపు మ్యాచ్‌లోనే అదరగొట్టింది. 20 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 48 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు జతగా కెప్టెన్ హీథర్ నైట్(96; 62 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో వెస్ట్రన్ స్ట్రోమ్ 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ డైమండ్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల లక్ష‍్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్రన్ స్ట్రోమ్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రాచెల్ ప్రైస్ట్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మంధాన-హీథర్ నైట్ జోడి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. ఇరువురి క్రీడాకారిణులు ధాటిగా ఆడటంతో వెస్ట్రన్ స్ట్రోమ్ 10 పరుగుల రన్‌రేట్‌తో దూసుకుపోయింది. వెస్ట్రన్ స్ట్రోమ్ స్కోరు 161 పరుగుల వద్ద హీథర్ నైట్ పెవిలియన్ చేరినప్పటికీ అప్పటికే ఆ జట్టు విజయం లాంఛనమైంది.
చదవండి: తొలి భారత క్రికెటర్‌గా..
Comments
Please login to add a commentAdd a comment