న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ ఆడిన ఆమె ఇకపై ఇంగ్లండ్‌లో జరిగే కియా సూపర్ టి20 లీగ్‌లోనూ బరిలో దిగనుంది. ఫలితంగా ఈ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. ఆరు జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో స్మృతి వెస్ట్రన్ స్ట్రోమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
దీనిపై ఆమె స్పందిస్తూ... ‘ఈ టోర్నీ లో ఆడుతున్న తొలి భారతీయురాలిని కావడం చాలా గౌరవంగా భావిస్తున్నా. జట్టు విజయానికి కావాల్సిన కృషి చేస్తా’ అని పేర్కొంది. ‘స్మృతి జట్టుతో కలవనుండటం చాలా సంతోషం. ప్రస్తుతం క్రికెట్‌లో ఆమె సంచలనం’ అని వెస్ట్రన్ స్ట్రోమ్ కోచ్ ట్రెవర్ గ్రిఫిన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment