సైనా, శ్రీకాంత్ శుభారంభం | Indus, gurusaidath defeat | Sakshi
Sakshi News home page

సైనా, శ్రీకాంత్ శుభారంభం

Published Thu, Jun 9 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

సైనా, శ్రీకాంత్ శుభారంభం

సైనా, శ్రీకాంత్ శుభారంభం

సింధు, గురుసాయిదత్ ఓటమి 
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
 

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లరకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల, పురుషుల సింగిల్స్‌లో సైనా, శ్రీకాంత్ శుభారంభం చేయగా, సింధు, గురుసాయిదత్ నిరాశపర్చారు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌లో ఏడోసీడ్ సైనా 21-10, 21-14తో జోయ్ లాయ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా; ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 15-21, 19-21తో ప్రపంచ 40వ ర్యాంకర్ కిమ్ హో మిన్ (కొరియా) చేతిలో కంగుతింది. మరో మ్యాచ్‌లో తన్వీ లాడ్ 18-21, 21-14, 21-11తో క్వాలిఫయర్ టిఫానీ హో (ఆస్ట్రేలియా)పై నెగ్గింది.

పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-16, 21-12తో ప్రపంచ 11వ ర్యాంకర్ ఎన్‌జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలవగా; క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన గురుసాయిదత్ 19-21, 21-12, 15-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 22-20, 15-21, 21-15తో ముస్తాఫా (ఇండోనేషియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో నిఖర్ గార్గ్-అనిల్ జోడి 12-21, 10-21తో ఎనిమిదోసీడ్ షేమ్ గో- టాన్ (మలేసియా) చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement