IPL Auction 2019 LIVE Updates in Telugu | ఐపీఎల్ 2019 వేలం అప్‌డేట్స్‌ - Sakshi
Sakshi News home page

ఐపీఎల్ వేలం: హనుమ విహారి జాక్‌పాట్‌

Published Tue, Dec 18 2018 3:35 PM | Last Updated on Tue, Dec 18 2018 9:50 PM

IPL 2019 Auction Updates - Sakshi

జైపూర్‌: పదకొండు సీజన్‌లుగా అలరించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పన‍్నెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ఐపీఎల్‌–12 సీజన్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. మంగళవారం ప్రారంభమైన వేలం క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించనుంది.  తమ అభిమాన ఆటగాడు ఏ జట్టు సొంతం అవుతాడో, తమ అభిమాన జట్టు కొత్త స్వరూపం ఎలా ఉండబోతోందో అన్న ఆలోచన రాక మానదు. మరోవైపు ఫ్రాంచైజీలు కూడా పూర్తి స్థాయిలో జట్టును ఎంచుకోవాల్సి ఉండటంతో నాణ్యమైన, మేటి ఆటగాళ్లను చేజిక్కించుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో బరిలో దిగనున్నాయి. ఈ వేలంలో ఏమైనా జరగొచ్చు. ఎన్నాళ్ల నుంచో తమ దృష్టి ఉన్న ప్రత్యర్థి జట్టులోని కీలక ఆటగాళ్లను తన్నుకుపోయేందుకు ఫ్రాంచైజీలకు ఇదే మంచి అవకాశం.

2019 సీజన్‌కు అవసరమైన ఆటగాళ్ల కొనుగోలుకు ఫ్రాంచైజీలు ‘పింక్‌ సిటీ’ జైపూర్‌ వేదికగా పోటీపడనున్నాయి. తుది వడపోత అనంతరం మిగిలిన 351 మంది నుంచి 70 మందిని లీగ్‌లోని 8 జట్లు ఎంపిక చేసుకోనున్నాయి. వచ్చే ఏడాది మే నెలాఖరు నుంచి వన్డే ప్రపంచ కప్‌ ఉన్నందున... లీగ్‌ మార్చి 23 నుంచే ప్రారంభమై మే రెండో వారంలో ముగుస్తుంది. ఇప్పటివరకూ జరిగిన వేలంలో జయదేవ్‌ ఉనాద్కత్‌(రూ. 8.40 కోట్లు-రాజస్థాన్‌), శివం దుబే(రూ. 5కోట్లు-ఆర్సీబీ), వరుణ్‌ చక్రవర్తి(రూ. 8.40 కోట్లు-కింగ్స్‌ పంజాబ్‌)లు  జాక్‌పాట్‌ కొట్టారు. హనుమ విహారి కనీస ధర రూ. 50 లక్షలుండగా, రూ. 2 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ ను రూ. రూ. 5 కోట్లకు కేకేఆర్‌ తీసుకోగా,  హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.

సాయంత్రం 9.10: ముగిసిన ఐపీఎల్‌-12 సీజన్‌ ఆటగాళ్ల వేలం.  

సాయంత్రం 9.08: చివరి నిమిషంలో బతికి పోయిన వోహ్రా. రూ. 20 లక్షల కనీస ధరకు వోహ్రాను సొంతం చేసుకున్న రాజస్థాన్‌.

సాయంత్రం 9.00: జోయ్‌ డెన్లీని కోటి రూపాయలకు చేజిక్కించుకున్న కేకేఆర్‌

సాయంత్రం 8.58: మురుగర్‌ అశ్విన్‌కు అందివచ్చిన అవకాశం. రెండో రౌండ్‌ వేలంలో ఈ స్పిన్నర్‌ను అతడి కనీస ధరకే సొంతం చేసుకున్న కింగ్స్‌ పంజాబ్‌.

సాయంత్రం 8.35: రెండో రౌండ్‌ వేలంలోనూ దక్షిణాఫ్రికా స్పీడ్‌గన్‌ డేల్‌ స్టెయిన్‌పై ఆసక్తి కనబరచని ప్రాంచైజీలు.   

సాయంత్రం 8.30: యూపీ బ్యాట్స్‌మన్‌ అక్ష్‌దీప్‌ నాథ్‌ను అదృష్టం వరించింది. రూ.3.60 కోట్లకు ఈ ఆటగాడిని ఆర్సీబీ సొంతం చేసుకుంది. గతంలో పంజాబ్‌ తరుపున ఆడాడు. 

సాయంత్రం 8.25: టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిమానులకు ఆనందం కలిగించే విషయం. తొలి రౌండ్‌లో యువరాజ్‌ను పక్కకు పెట్టిన ఫ్రాంచైజీలు.. రెండో రౌండ్‌ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. దీంతో యువీ ఊపిరిపీల్చుకున్నాడు. లేకుంటే ఐపీఎల్‌లో యువీ ఆటను అభిమానులు చూసే అవకాశం కోల్పోయేవారు.  
 
సాయంత్రం 8.24: రెండో రౌండ్‌ వేలంలో ఊపిరి పీల్చుకున్న న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గుప్తిల్‌. తొలి రౌండ్‌లో అతడిపై ఆసక్తి కనబరచని ప్రాంఛైజీలు.. రెండో రౌండ్‌లో అతడి కనీస ధర కోటి రూపాయలకు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌.

సాయంత్రం 8.22: అగ్నివేష్‌ అయాచి, హర్‌ప్రీత్‌లను సొంతం చేసుకున్న కింగ్స్‌ పంజాబ్‌. 

సాయంత్రం 8.19: 16 ఏళ్ల యంగ్‌ ఆల్‌రౌండర్‌ బర్మాన్‌ను రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ.

సాయంత్రం 8.16: యార్ర పృథ్వీ రాజ్‌ను కేకేఆర్‌ రూ.20 లక్షలకు, లివింగ్‌స్టన్‌ను రాజస్థాన్‌ రూ.50 లక్షలకు, కీమో పాల్‌ను రూ.50 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకున్నాయి.

సాయంత్రం 8.14: రిషిక్‌ దార్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.

సాయంత్రం 8.12: వికెట్‌ కీపర్‌, అండర్‌-19 టీమిండియా మాజీ సారథి ప్రబుసిమ్రాన్‌ సింగ్‌ను రూ.4.80 కోట్ల భారీ మొత్తంతో సొంతం చేసుకున్న కింగ్స్‌ పంజాబ్‌.

సాయంత్రం 8.02: బ్యాట్స్‌మన్‌ మిలింద్‌ కుమార్‌ను కనీస ధర రూ.20 లక్షలకే చేజిక్కించుకున్న ఆర్సీబీ

సాయంత్రం 8.01: హ్యారీ గుర్నేని కనీస ధర రూ.75 లక్షలకు సొంతం చేసుకున్న కేకేఆర్

సాయంత్రం 8.00: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫ్యాబియన్‌ అలెన్‌పై ఆసక్తి కనబరచని ఫ్రాంచైజీలు

సాయంత్రం 7.56: రూ. 65 లక్షలకు హిమ్మత్‌ సింగ్‌ను సొంతం చేసుకున్న ఆర్సీబీ.

సాయంత్రం 7.54: హార్దూస్‌ విల్జొయెన్‌ను సొంతం చేసుకున్న కింగ్స్‌ పంజాబ్‌

సాయంత్రం 7.53: ఒషానే థామస్‌ను రూ.1.10 కోట్లకు సొంతం చేసుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌

సాయంత్రం 7.48: జోయ్‌ డెన్లీని కనీస ధర రూ. కోటికి ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

సాయంత్రం 7.47: అన్రిచ్‌ నొర్తేజ్‌ను రూ. 20 లక్షల కనీస ధరకే సొంతం చేసుకున్న కేకేఆర్‌

సాయంత్రం 7.44: ఆల్‌రౌండర్‌ రూథర్‌ఫర్డ్‌ను రూ. రెండు కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌.

సాయంత్రం 7.43: ప్రవీణ్‌ దుబేను కనీస ధరకు కూడా ఏ ప్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరమయ్యాడు.

బ్రేక్‌ తర్వాత ప్రారంభమైన ఐపీఎల్‌ వేలం పాట

సాయంత్రం 6.40 : దక్షిణాఫ్రికా సీనియర్‌ బౌలింగ్‌ ద్వయం, బ్యాట్స్‌మెన్‌కు దడపుట్టించే మోర్నీ మోర్కెల్‌, డేల్‌ స్టెయిన్‌లకు ఈ ఐపీఎల్‌ వేలంలో నిరాశే ఎదురయింది. వారి కనీస ధరకు కూడా ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

సాయంత్రం 6.36: బౌలర్‌ బరిందర్‌ శ్రాన్‌కు అదృష్టం వరించింది. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆ బౌలర్‌ను రూ.3.40 కోట్లకు ముంబై ఇండియన్స్‌ చేజిక్కించుకుంది.  

సాయంత్రం 6.33: దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసన్‌ కనీస ధర రూ.50 లక్షలకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.

సాయంత్రం 6.32: ల్యూక్‌ రాంచీ, ముష్పీకర్‌ రహీమ్‌, కుశాల్‌ పెరీరాల జోలికి ఏ ఫ్రాంచైజీ వెళ్లలేదు.

సాయంత్రం 6.25: ముందుగా అనుకున్నట్టుగానే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ స్యామ్‌ కర్రాన్‌ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డారు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ హిట్టర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ రూ.7.40 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుంది.

సాయంత్రం 6.22: న్యూజిలాండ్‌ ఆల్‌ రౌండర్‌, గత ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనలు చేసిన కోరె అండర్సన్‌ను ఈ సీజన్‌ కోసం ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు.  

సాయంత్రం 6.20: శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌పై  ఏ ఫ్రాంచైజీ పెద్దగా ఆసక్తి కనబర్చక పోవడంతో అమ్ముడుపోలేదు.
 

సాయంత్రం 6.19: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ హషీమ్‌ ఆమ్లాను ఈ సీజన్‌కు కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. గత సీజన్‌ వేలంలోనూ ఆమ్లా అమ్ముడుపోని విషయం తెలిసిందే. 

సాయంత్రం 6.17: న్యూజిలాండ్‌ ఆటగాడు కొలిన్‌ ఇంగ్రామ్‌ కోసం ఫ్రాంచైజీలు తెగ పోటీ పడ్డారు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడిని రూ.6.40 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. 

సాయంత్రం 6.11: ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజాను ఏ ఫ్రాంచైజీ పెద్దగా పట్టింకోలేదు.

సాయంత్రం 5.54: రాజస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ నాథూ సింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది. అతడి కనీస ధర రూ.20 లక్షలకే ఢిల్లీ కొనుగోలు చేసింది. 

సాయంత్రం 5.50: కేరళ వికెట్‌ కీపర్‌ అరుణ్‌ కార్తీక్‌ను కనీస ధర రూ.20 లక్షలకు కూడా కోనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.

సాయంత్రం 5.49: యువ క్రికెటర్లు  జలజ్‌ సక్సేనా, జాక్సన్‌, బాబా ఇంద్రజిత్‌, అనుజ్‌ రావత్‌, జహీర్‌ఖాన్‌ పక్తీన్‌లను వారి కనీస ధర రూ.20 లక్షలకు కూడా కొనుగోలు చేయాడనికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.   

సాయంత్రం 5.35: తమిళనాడు యువ ఆల్‌ రౌండర్‌ వరుణ్‌ చక్రవర్తి ఊహించని రీతిలో అమ్ముడుపోయాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రూ. 20లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న చక్రవర్తిని రూ. 8.40 కోట్ల భారీ మొత్తానికి కింగ్స్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది. 

సాయంత్రం 5.31: ఆల్‌రౌండర్‌ శివం దుబే పంట పండింది. రూ 20 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్న ఈ యువ సంచలనాన్ని ఐదు కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ ఆటగాడి కోసం ముంబై, ఢి​ల్లీ, ఆర్సీబీ ప్రాంఛైజీలు పోటీ పడటం విశేషం.
 

సాయంత్రం 5.30: యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ను కింగ్స్‌ పంజాబ్‌ రూ.25 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ఆర్సీబీకి ఆడినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 

సాయంత్రం 5.23: మాజీ కింగ్స్‌​ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ మనాన్‌ వోహ్రాపై ఏ ప్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.  

సాయంత్రం 5.23 : అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ దేవ్‌దత్‌ పడిక్కాల్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు రూ. 20 లక్షల కనీస ధరకు కొనగోలు చేసింది. 

సాయంత్రం 5.00: మోహిత్‌ శర్మను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. అతన్ని రూ. 5 కోట్ల భారీ మొత్తం చెల్లించి సీఎస్‌కే కొనుగోలు చేసింది. 

మధ్యాహ్నం 4.57: వరుణ్‌ అరోన్‌ రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. 

మధ్యాహ్నం 4.51: మహ్మద్‌ షమీని రూ. 4.80 కోట్లకు కింగ్స్‌ పంజాబ్‌ కొనుగోలు చేసింది.  అతని కనీస ధర కోటి కాగా, కింగ్స్‌ పంజాబ్‌ పోటీ పడి దక్కించుకుంది. 

మధ్యాహ్నం 4.47: లసిత్‌ మలింగాను ముంబై ఇండియన్స్‌ చేజిక్కించుకుంది. అతని కనీస ధర రూ. 2 కోట్లకే ముంబై తీసుకుంది.
 

మధ్యాహ్నం: 4.46: ఇషాంత్‌ శర్మను కోటి 10 లక్షలకు ఢిల్లీ కేపిటల్‌ తీసుకుంది. అతని కనీస ధర రూ. 75 లక్షలు

మధ్యాహ్నం 4.43: జయదేవ్‌ ఉనాద్కత్‌ రూ. 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. ఉనాద్కత్‌ కనీస ధర  ఒక కోటి 50 లక్షల రూపాయిలు ఉండగా అతని కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. 

మధ్యాహ్నం 4.25:  వృద్ధిమాన్‌ సాహా కనీస ధర కోటి రూపాయిలతో అందుబాటులోకి రాగా, అతన్ని రూ. 1కోటి 20 లక్షలకు సన్‌రైజర్స్‌ తీసుకుంది.

మధ్యాహ్నం 4.23: విండీస్‌ కీపర్‌ నికోలస్‌ పూరన్‌ను కింగ్స్‌ పంజాబ్‌ రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు కింగ్స్‌ పంజాబ్‌ అతనికి భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. 

మధ్యాహ్నం 4.22: జానీ బెయిర్‌ స్టో కనీస ధర 1 కోటి 50 లక్షలు ఉండగా, రెండు కోట్ల 20 లక్షలకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసింది.

మధ్యాహ్నం 4.15: అక్షర్‌ పటేల్‌ను రూ. 5 కోట్లకు ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. కనీస ధర రూ. కోటి ఉండగా, ఐదు కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.

మధ్యాహ్నం 4.08: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు. యువీ కనీస ధర రూ. 1 కోటి ఉండగా అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు.

మధ్యాహ్నం 4:07: ఇంగ్లండ్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ కోటి రూపాయల కనీస ధరతో వేలానికి వచ్చాడు. కానీ ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి చూపలేదు.
 
మధ్యాహ్నం 4.06: విండీస్‌ ఆల్‌ రౌండర్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ను రూ. 5 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్నికోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కొనుగోలు చేసింది. బ్రాత్‌వైట్‌ కనీస ధర రూ. 75 లక్షలు ఉండగా, రూ. 5 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. 
 

మధ్యాహ్నం​ 3:58: ఇంగ్లండ్‌ క్రికెటర్‌ క్రిస్‌ వోక్స్‌పై కూడా ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. 

మధ్యాహ్నం 3:56: న్యూజిలాండ్‌ మాజీ సారథి, హిట్టర్‌, టీ20 స్పెషలిస్టు బ్రెండన్‌ మెకల్లమ్‌ రెండు కోట్ల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే ఏ ఫ్రాంఛైజీ అతడిపై  సుముఖత వ్యక్తం చేయలేదు. 

మధ్యాహ్నం 3.54: విండీస్‌ చిచ్చర పిడుగు హెట్‌మెయిర్‌ను రూ. 4.20 కోట్లకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. 50 లక్షలు ఉండగా, ఆర్సీబీ నాలుగు కోట్లకు పైగా వెచ్చించి అతన్ని తీసుకుంది. హెట్‌మెయిర్‌ కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లతో ఆర్సీబీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. 

మధ్యాహ్నం 3.47: హనుమ విహారినికి ఢిల్లీ కేపిటల్స్‌ కొనుగోలు చేసింది. అతని కనీసం ధర రూ. 50 లక్షలు ఉండగా,  రెండు కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

మధ్యాహ్నం 3:43: ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ కోటిన్నర కనీస ధరతో ఐపీఎల్‌ వేలానికి వచ్చాడు. అయితే ఏ ఫ్రాంచైజీ అతడిపై అసక్తి కనబరచలేదు. 

మధ్యాహ్నం 3:43: టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పూజారా 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. అయితే అతడిని కొనుగోలు చేసుందుకే ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. 

మధ్యాహ్నం 3:42: వేలానికి మొదటి ఆటగాడిగా టీమిండియా ఆటగాడు మనోజ్‌ తివారి రాగా అతడిపై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి కనబరచలేదు. 

మధ్యాహ్నం 3.40: ఈ సీజన్‌కు కొత్తగా ఎంపికైన వేలంపాట దారుడు హ్యూజ్‌ ఎడ్మీడ్స్‌  పోడియంకు చేరుకుని వేలాన్ని ఆరంభించారు. 

మధ్యాహ్నం 3.30: ఐపీఎల్‌ వేలం కార్యక్రమానికి భారత క్రికెట్‌ జట్టు మాజీ మహిళా క్రికెటర్‌, సీఓఏ సభ్యురాలు ఎడ‍్జుల్లీ స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement