హెడింగ్లే: ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు తనను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఇంగ్లండ్ ఆటగాడు జోస్ బట్లర్ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘ కాలం తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నాడు. కాగా, తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై బట్లర్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
‘ముందుగా నాకు టెస్టు జట్టులో చోటు కల్పిస్తూ పిలుపు రావడం ఆశ‍్చర్యానికి గురి చేసింది. దీన్ని పూర్తిగా వినియోగించుకోవాలనే భావించా. పాకిస్తాన్‌పై భారీ స్కోర్లు సాధించాలనే తలంపుతో బరిలోకి దిగా. ఇక్కడ సక్సెస్ అయ్యాననే చెప్పాలి. ఇందుకు కారణం కచ్చితంగా ఐపీఎలే. ఐపీఎల్లో కీలక సమయాల్లో రాణించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఐపీఎల్‌లో నన్ను నిరూపించుకోవాలని అనుకున‍్నా. విదేశీ ఆటగాడికి ఐపీఎల్ వంటి లీగ్‌లో ఎంత ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఒత్తిడ్ని అధిగమించి వరుస హాఫ్ సెంచరీల రాణించా. దానికి కొనసాగింపే పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో రాణించడం. పాక్‌పై నా సక్సెస్‌కు కారణం ఐపీఎల్’ అని జోస్ బట్లర్ తెలిపాడు.
పాకిస్తాన్‌తో లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో బట్లర్ 67 పరుగులతో మెరవగా, లీడ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 80 పరుగులు నమోదు చేశాడు. ఫలితంగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్ సమం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment