ఐపీఎల్ ‘కింగ్స్’ | IPL: Will Michael Hussey, the Chennai Super Kings 'discard | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ‘కింగ్స్’

Published Sun, Apr 13 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

ఐపీఎల్ ‘కింగ్స్’

ఐపీఎల్ ‘కింగ్స్’

 చెన్నై సూపర్ కింగ్స్

ఓనర్: ఇండియా సిమెంట్స్

కెప్టెన్: మహేంద్ర సింగ్ ధోని

కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్

గత ఉత్తమ ప్రదర్శన:
 చాంపియన్ (2010, 2011),
 రన్నరప్ (2008, 2012, 2013)  
 కీలక ఆటగాళ్లు: ధోని, రైనా,
 బి.మెకల్లమ్, డుప్లెసిస్, బ్రేవో, అశ్విన్, జడేజా
 
 
 రెండుసార్లు చాంపియన్... మూడుసార్లు రన్నరప్... ఒకసారి సెమీ ఫైనలిస్ట్... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు ఇది. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నైలో స్టార్ ఆటగాళ్లకు కొదువలేదు. భారత జట్టు సారథి, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలో లీగ్ ఆరంభం నుంచి ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒకటి, రెండు అపజయాలు మినహా ఆడిన ప్రతి మ్యాచ్‌లో కచ్చితంగా గెలుస్తుందనే భావన అటూ అభిమానుల్లోనూ, ఇటూ ఫ్రాంచైజీ పెద్దల్లోనూ బలంగా నాటుకుపోయింది.

ఈసారి కూడా స్టార్ ప్లేయర్లతో సూపర్‌కింగ్స్ అత్యంత బలమైన జట్టుగా లీగ్‌లో బరిలోకి దిగుతోంది. ధోని, రైనా, జడేజా, అశ్విన్, బ్రేవోలను రిటైన్ చేసుకోవడంతో పాటు డుప్లెసిస్ (రూ. 4.75 కోట్లు), డ్వేన్ స్మిత్ (రూ. 4.5 కోట్లు), బి.మెకల్లమ్ (రూ. 3.25 కోట్లు)లాంటి సంచలన క్రికెటర్లకు భారీ మొత్తం వెచ్చించింది. నెహ్రా (రూ. 2 కోట్లు), మోహిత్ శర్మ (రూ. 2 కోట్లు), ఈశ్వర్ పాండే (రూ. 1.5 కోట్లు) వంటి బౌలర్లకు కూడా బాగానే ఖర్చు చేసింది.
 
 
 వెంటాడుతున్న వివాదాలు
 ఎప్పుడూ లేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌కింగ్స్‌ను వివాదాలు వెంటాడుతున్నాయి. టీమ్ ప్రిన్సిపల్‌గా పని చేసిన శ్రీనివాసన్ అల్లుడు గురునాథన్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడినట్లు ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించడం, స్పాట్ ఫిక్సింగ్‌లో ఇతర ఆటగాళ్లు, బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటికి రావడం, ఈ అంశం మొత్తం చెన్నై జట్టు చుట్టే తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
 బలాలు...
 బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కీలక సమయంలో ఒంటిచేత్తో జట్టును గెలిపించే ఆటగాళ్లకు కొదువలేదు. ధోని వ్యూహాలు అదనపు బలం.

 బలహీనతలు...
 జట్టుపై అంచనాలు భారీగా ఉండటం, ఒక్కొసారి ఒత్తిడిని జయించలేకపోవడం. చెప్పుకోదగ్గ దేశవాళీ క్రికెటర్లు లేకపోవడం సూపర్ కింగ్స్ బలహీనత.
 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: ధోని, రైనా, అశ్విన్, రవీంద్ర జడేజా, ఆశిష్ నెహ్రా, మోహిత్ శర్మ.


విదేశీ క్రికెటర్లు: డ్వేన్ బ్రేవో, డ్వేన్ స్మిత్, సామ్యూల్ బద్రీ (వెస్టిండీస్), బి. మెకల్లమ్, మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), హిల్ఫెన్హాస్, జాన్ హేస్టింగ్స్ (ఆస్ట్రేలియా).

 భారత దేశవాళీ క్రికెటర్లు: ఈశ్వర్ పాండే, మిథున్ మన్హాస్, విజయ్ శంకర్, రోనిత్ మోరె, బాబా అపరాజిత్, పవన్ నేగి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement