ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’ | IPTL 2015: India Aces thump UAE Royals in Rafael Nadal's debut | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’

Published Tue, Dec 8 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

IPTL 2015: India Aces thump UAE Royals in Rafael Nadal's debut

మనీలా (ఫిలిప్పీన్స్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు 30-18 గేమ్‌ల తేడాతో నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఆడిన ఐదు సెట్‌లలోనూ ఏసెస్ జట్టుకు విజయం దక్కడం విశేషం. మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 6-4తో నెస్టర్-మ్లాడెనోవిచ్ (రాయల్స్) జోడీపై...

మహిళల సింగిల్స్‌లో సమంత స్టోసుర్ (ఏసెస్) 6-3తో మ్లాడెనోవిచ్ (రాయల్స్)పై... పురుషుల లెజెండ్స్ సింగిల్స్‌లో సాంతోరో 6-3తో ఇవానిసెవిచ్ (రాయల్స్)పై... పురుషుల డబుల్స్‌లో నాదల్-డోడిగ్ (ఏసెస్) జోడీ 6-3తో నెస్టర్-బెర్డిచ్ జంటపై... పురుషుల సింగిల్స్‌లో నాదల్ (ఏసెస్) 6-4తో బెర్డిచ్ (రాయల్స్)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement