ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’ | International Premier Tennis League (IPTL) Team Standings: Sania Mirza’s Micromax Indian Aces lead Points Table | Sakshi
Sakshi News home page

ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’

Published Mon, Dec 1 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’

ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’

మూడో మ్యాచ్‌లో 28-20తో యూఏఈ రాయల్స్‌పై గెలుపు
ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 28-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 4-6తో క్రిస్టినా మల్డోనోవిచ్ చేతిలో ఓడింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న ద్వయం 6-3తో జిమోన్‌జిక్-మల్డోనోవిచ్‌లపై గెలిచింది.

పురుషుల డబుల్స్‌లో బోపన్న-మోన్‌ఫిల్స్ జోడి 6-4తో జిమోన్‌జిక్-సిలిచ్‌పై; సింగిల్స్‌లో మోన్‌ఫిల్స్ 6-3తో మాలెక్ జజీర్‌పై నెగ్గారు. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో సంటారో 6-4తో ఇవానిసెవిచ్‌ను ఓడించి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో మనీలా మావెరిక్స్ 27-19తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. ప్రస్తుతం ఏసెస్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా, రాయల్స్ 10, మనీలా 7, సింగపూర్ స్లామర్స్ 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement