UAE Royals
-
లెక్క సరిచేసిన ఇండియన్ ఏసెస్
యూఏఈ రాయల్స్‌పై గెలుపు ఐపీటీఎల్-2016 సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మంగళవారం మొదలైన సింగపూర్ అంచె పోటీల్లో ఇండియన్ ఏసెస్ 26-19 పాయింట్ల తేడాతో యూఏఈ రాయల్స్ జట్టును ఓడించింది. మూడు రోజుల క్రితం జపాన్ అంచె పోటీల్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 20-30తో యూఏఈ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. తాజా విజయంతో ఏసెస్ జట్టు ఆ ఓటమికి బదులు తీర్చుకుంది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 10 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉంది. మహిళల సింగిల్స్‌లో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్‌స (ఏసెస్) 6-3తో అనా ఇవనోవిచ్‌ను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న-సానియా మీర్జా ద్వయం (ఏసెస్) 6-3తో క్యువాస్-మార్టినా హింగిస్ జంటపై గెలిచింది. పురుషుల లెజెండ్స సింగిల్స్‌లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఏసెస్) 6-3తో థామస్ జొహాన్సన్ను ఓడించగా... పురుషుల సింగిల్స్‌లో ఫెలిసియానో లోపెజ్ (ఏసెస్) 2-6తో బెర్డిచ్ చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ మ్యాచ్‌లో డోడిగ్-లోపెజ్ జంట (ఏసెస్) 6-4తో క్యువాస్-నెస్టర్ జోడీపై గెలిచింది. ఫెడరర్, సెరెనా దూరం హైదరాబాద్‌లో ఈనెల 9 నుంచి 11 వరకు జరగాల్సిన చివరి అంచె ఐపీటీఎల్ పోటీలకు స్టార్ క్రీడాకారులు రోజర్ ఫెడరర్, సెరెనా విలియమ్స్ దూరమయ్యారు. ఫెడరర్ పేరు ఏ జట్టులోనూ లేకున్నా... సెరెనా మాత్రం సింగపూర్ స్లామర్స్ తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. ‘ఈ ఏడాది సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తానన్న నమ్మకం ఉంది. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన పరిస్థితులను ఫెడరర్, సెరెనాలకు వివరించాను. గత రెండు సీజన్లలో వీరిద్దరూ ఎంతో సహకరించారు. భవిష్యత్ సీజన్లలో వారు మళ్లీ బరిలోకి దిగుతారని ఆశిస్తున్నాను’ అని ఐపీటీఎల్ వ్యవస్థాపకుడు మహేశ్ భూపతి తెలిపాడు. -
రాయల్స్‌ను ఆదుకున్న ఫెడరర్
సింగపూర్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన అద్భుత ఆటతీరుతో యూఏఈ రాయల్స్‌ను ఆదుకున్నాడు. దీంతో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్‌ను 27-23 తేడాతో యూఏఈ ఓడించింది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న తమ జట్టును... చివరి సింగిల్స్‌లో ఫెడరర్ 6-4 తేడాతో వావ్రింకాను ఓడించి గట్టెక్కించాడు. అంతకుముందు మ్యాచ్‌ల్లో ఇవాన్‌సెవిచ్ (రాయల్స్) 6-4తో కార్లోస్ మోయా (స్లామర్స్)ను, మహిళల సింగిల్స్‌లో మ్లదెనోవిక్ (రాయల్స్) నెగ్గగా.. మిక్స్డ్ డబుల్స్‌లో డస్టిన్ బ్రౌన్, ప్లిస్కోవా (స్లామర్స్) జోడి ఫెడరర్, మదెనోవిక్ను ఓడించడంతో స్కోరు 15-15తో సమమైంది. అయితే పురుషుల డబుల్స్‌లో ఫెడరర్, నెస్టర్ 6-4తో వావ్రింకా, మార్సెలో మెలోను ఓడించడంతో రెండు పాయింట్ల ఆధిక్యం పొందింది. ఇక చివరి మ్యాచ్‌లో ఫెడరర్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతర మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 29-15తో ఫిలిప్పై న్స్ మావెరిక్స్‌ను ఓడించింది. పురుషుల సిం గిల్స్‌లో సఫిన్ (వారియర్స్) 6-3తో బ్లాక్‌ను ఓడించి వారియర్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కురుమి (వారియర్స్) 6-1తో గజ్దోసోవాపై.. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్, బరోని జంట 6-2తో గజ్దోసోవా, రోజర్ వాసెలిన్పై గెలిచారు. పురుషుల డబుల్స్‌లో మావెరిక్ జోడి వాసెలిన్, ట్రీట్ హ్యూ 6-5తో పేస్, లూసిక్పై గెలిచినా.. చివరి పురుషుల సింగిల్స్ లో హెర్బట్ 6-3తో కార్లోవిచ్‌ను ఓడించి వారి యర్స్‌కు రెండో విజయాన్ని అందించాడు. -
కొహ్లీ టీమ్ లో ఫెదరర్
యూఏఈ రాయల్ ఫ్రాంఛైజీలో ప్రపంచ నంబర్ టూ టెన్సిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ చేరాడు. డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్సిస్ లీగ్(ఐపీటీఎల్) రెండో సీజన్ లో ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు దుబాయ్ లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఐపీటీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ భూపతి తెలిపాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ యూఏఈ రాయల్స్ కో ఓనర్ గావ్యవహరించనున్నాడు. నీలేష్ భట్నాకర్, సచిన్ గడోయా, ప్రవీణ్ భట్నాకర్ కొహ్లీ ప్రాంచైసీ భాగస్వాములు. టెన్సిస్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. రోజర్ ఫెదరర్ కి పెద్ద అభిమానినని..విరాట్ కొహ్లీ తెలిపాడు. ప్రొఫెషనల్ టెన్సిస్ లీట్ టీమ్ లో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది విరాట్ కొహ్లీ అన్నాడు. ఐపీటీఎల్2015 కోసం రాయల్స్ టీమ్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించాడు. కాగా డిసెంబర్ రెండు నుంచి 20 దాకా ఐపీటీఎల్ సీజన్ 2 టోర్నీ సాగనుంది. -
ఎదురులేని ఇండియన్ ఏసెస్
యూఏఈ రాయల్స్‌పై 30-11తో గెలుపు ఐపీటీఎల్ సింగపూర్: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ఎదురులేకుండా దూసుకెళుతోంది. మనీలా లెగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ఏసెస్ తాజాగా సింగపూర్‌లోనూ తొలి మ్యాచ్‌లో నెగ్గింది. మంగళవారం యూఏఈ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 30-11 తేడాతో ఘనవిజయం సాధించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల విజయాలతో ఏసెస్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముందుగా మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 6-2తో క్రిస్టినా లడెనోవిక్‌పై గెలుపొందగా మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న, సానియా మీర్జా జంట 6-5తో జిమోన్జిక్, లడెనోవిక్‌పై గెలుపొందింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 6-1తో మాలెక్ జాజిరిపై సునాయాసంగా నెగ్గాడు. లెజెండ్స్ సింగిల్స్‌లోనూ సాంటోరో 6-2తో జిమోన్జిక్ను మట్టికరిపించాడు. చివరగా పురుషుల డబుల్స్‌లో బోపన్న, మోన్ఫిల్స్ 6-1తో జిమోన్జిక్, మారిన్ సిలిచ్‌ను ఓడించారు. మరో మ్యాచ్‌లో మనీలా మావ్రిక్స్ 29-21తో సింగపూర్ స్లామర్స్‌పై గెలిచింది. ఢిల్లీలో డిమాండ్: సింగపూర్ లెగ్ తర్వాత ఈ నెల 6 నుంచి 8 వరకు ఢిల్లీలో ఐపీటీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లకు మొత్తం టిక్కెట్లు అమ్ముడయ్యాయని టోర్నీ సీఈఓ ఎరిక్ గాట్స్చాక్ చెప్పారు. మనీలా, సింగపూర్లలో తాము ఆశించిన స్థాయికి మించి ప్రేక్షకులు ప్రత్యక్షంగా టోర్నీని చూశారని చెప్పారు. -
ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’
మూడో మ్యాచ్‌లో 28-20తో యూఏఈ రాయల్స్‌పై గెలుపు ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఏసెస్ 28-20తో యూఏఈ రాయల్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో అనా ఇవనోవిచ్ 4-6తో క్రిస్టినా మల్డోనోవిచ్ చేతిలో ఓడింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఏసెస్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న ద్వయం 6-3తో జిమోన్జిక్-మల్డోనోవిచ్లపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో బోపన్న-మోన్ఫిల్స్ జోడి 6-4తో జిమోన్జిక్-సిలిచ్‌పై; సింగిల్స్‌లో మోన్ఫిల్స్ 6-3తో మాలెక్ జజీర్పై నెగ్గారు. పురుషుల లెజెండ్ సింగిల్స్‌లో సంటారో 6-4తో ఇవానిసెవిచ్ను ఓడించి ఏసెస్‌కు స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో మనీలా మావెరిక్స్ 27-19తో సింగపూర్ స్లామర్స్‌పై నెగ్గింది. ప్రస్తుతం ఏసెస్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతుండగా, రాయల్స్ 10, మనీలా 7, సింగపూర్ స్లామర్స్ 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్
దుబాయ్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టు తరఫున యూఎస్ ఓపెన్ విజేత, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మారిన్ సిలిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టులో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు బౌచర్డ్, వోజ్నియాకి, ఇవానిసెవిచ్, మాలెక్ జాజిరిలు ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారులకు ఐపీటీఎల్ మంచి వేదికని, ఈ టోర్నీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని సిలిచ్ అన్నాడు. భారత్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది.