కొహ్లీ టీమ్ లో ఫెదరర్ | Roger Federer joins UAE Royals, Virat Kohli to co-own team | Sakshi
Sakshi News home page

కొహ్లీ టీమ్ లో ఫెదరర్

Published Thu, Sep 10 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

కొహ్లీ టీమ్ లో ఫెదరర్

కొహ్లీ టీమ్ లో ఫెదరర్

యూఏఈ రాయల్ ఫ్రాంఛైజీలో ప్రపంచ నంబర్ టూ టెన్సిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ చేరాడు. డిసెంబర్ 2 నుంచి ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్సిస్ లీగ్(ఐపీటీఎల్) రెండో సీజన్ లో ఫ్రాంఛైజీ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు దుబాయ్ లో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఐపీటీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ భూపతి తెలిపాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కొహ్లీ యూఏఈ రాయల్స్ కో ఓనర్ గావ్యవహరించనున్నాడు. నీలేష్ భట్నాకర్, సచిన్ గడోయా, ప్రవీణ్ భట్నాకర్ కొహ్లీ ప్రాంచైసీ భాగస్వాములు.

టెన్సిస్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. రోజర్ ఫెదరర్ కి పెద్ద అభిమానినని..విరాట్ కొహ్లీ తెలిపాడు. ప్రొఫెషనల్ టెన్సిస్ లీట్ టీమ్ లో భాగస్వామి కావడం సంతోషంగా ఉంది విరాట్ కొహ్లీ  అన్నాడు. ఐపీటీఎల్2015 కోసం రాయల్స్ టీమ్ ను ఈ సందర్భంగా ఆవిష్కరించాడు. కాగా డిసెంబర్ రెండు నుంచి 20 దాకా ఐపీటీఎల్ సీజన్ 2 టోర్నీ సాగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement