రాయల్స్‌ను ఆదుకున్న ఫెడరర్
సింగపూర్: స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన అద్భుత ఆటతీరుతో యూఏఈ రాయల్స్‌ను ఆదుకున్నాడు. దీంతో అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో శుక్రవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్‌ను 27-23 తేడాతో యూఏఈ ఓడించింది. కేవలం రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న తమ జట్టును... చివరి సింగిల్స్‌లో ఫెడరర్ 6-4 తేడాతో వావ్రింకాను ఓడించి గట్టెక్కించాడు. అంతకుముందు మ్యాచ్‌ల్లో ఇవాన్‌సెవిచ్ (రాయల్స్) 6-4తో కార్లోస్ మోయా (స్లామర్స్)ను, మహిళల సింగిల్స్‌లో మ్లదెనోవిక్ (రాయల్స్) నెగ్గగా..
మిక్స్‌డ్ డబుల్స్‌లో డస్టిన్ బ్రౌన్, ప్లిస్కోవా (స్లామర్స్) జోడి ఫెడరర్, మదెనోవిక్‌ను ఓడించడంతో స్కోరు 15-15తో సమమైంది. అయితే పురుషుల డబుల్స్‌లో ఫెడరర్, నెస్టర్ 6-4తో వావ్రింకా, మార్సెలో మెలోను ఓడించడంతో రెండు పాయింట్ల ఆధిక్యం పొందింది. ఇక చివరి మ్యాచ్‌లో ఫెడరర్ సత్తా చాటి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇతర మ్యాచ్‌లో జపాన్ వారియర్స్ 29-15తో ఫిలిప్పై న్స్ మావెరిక్స్‌ను ఓడించింది.
పురుషుల సిం గిల్స్‌లో సఫిన్ (వారియర్స్) 6-3తో బ్లాక్‌ను ఓడించి వారియర్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కురుమి (వారియర్స్) 6-1తో గజ్దోసోవాపై.. మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్, బరోని జంట 6-2తో గజ్దోసోవా, రోజర్ వాసెలిన్‌పై గెలిచారు. పురుషుల డబుల్స్‌లో మావెరిక్ జోడి వాసెలిన్, ట్రీట్ హ్యూ 6-5తో పేస్, లూసిక్‌పై గెలిచినా.. చివరి పురుషుల సింగిల్స్ లో హెర్బట్ 6-3తో కార్లోవిచ్‌ను ఓడించి వారి యర్స్‌కు రెండో విజయాన్ని అందించాడు.