అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందర్భంగా భారత్...
`న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) సందర్భంగా భారత్‌కు వచ్చిన టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన రెండు రోజుల పర్యటన ముగించాడు. అయితే త్వరలోనే భారత్‌కు మరోసారి వచ్చి తగినంత సమయం గడుపుతానని అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, బిజీ షెడ్యూల్ కారణంగా ఈసారి ఎటూ వెళ్లలేకపోయానని చెప్పాడు.