యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్ | Silic on behalf of the Royals UAE | Sakshi
Sakshi News home page

యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్

Published Mon, Oct 20 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్

యూఏఈ రాయల్స్ తరఫున సిలిచ్

దుబాయ్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్ జట్టు తరఫున యూఎస్ ఓపెన్ విజేత, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మారిన్ సిలిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టులో ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు బౌచర్డ్, వోజ్నియాకి, ఇవానిసెవిచ్, మాలెక్ జాజిరిలు ఉన్నారు. టెన్నిస్ క్రీడాకారులకు ఐపీటీఎల్ మంచి వేదికని, ఈ టోర్నీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని సిలిచ్ అన్నాడు. భారత్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో నాలుగు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ టోర్నీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement