
ఇషాంత్ ఇలా భయపెడుతున్నాడు!
బెంగళూరు:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్ కు మారుపేరు. మరి అటువంటుది ఆస్ట్రేలియా జట్టునే స్లెడ్జ్ చేస్తున్నాడు మన పేసర్ ఇషాంత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ దేశ క్రికెటర్ల పట్ల వెకిలి చేష్టలను ప్రదర్శించి మరీ స్లెడ్జింగ్ కు దిగాడు ఇషాంత్. ఆదివారం రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటింగ్ దిగిన క్రమంలో ఇషాంత్ ఉన్నపళంగా తనలోని నటుడ్ని బయటకు తీశాడు. ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ రెన్ షాలు బ్యాటింగ్ చేస్తున్నసమయంలో వారిని అనుకరించే యత్నం చేశాడు.
ఇలా ఇషాంత్ కొత్త తరహాలో స్లెడ్జింగ్ చేయడం అభిమానులకు విపరీతమైన నవ్వులు తెప్పించగా, మన కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం పగలబడి నవ్వుకోవడం కొసమెరుపు. ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతున్న ఇషాంత్ శర్మ కనీసం ఇలా అయినా ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెడుతున్నాడని అభిమానులు సర్దుకుపోతున్నారు.