ishanth sharma
-
IPL 2022: రూ. 6.5 కోట్లు.. అన్రిచ్ నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు వీరే!
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్, దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్జే ఐపీఎల్-2022 సీజన్ మొత్తానికి దూరం కానున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గాయపడిన అతడు ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. దీంతో రూ. 6.5 కోట్లు వెచ్చించి అతడిని రిటైన్ చేసుకున్న ఢిల్లీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇక గత సీజన్లో 8 ఇన్నింగ్స్ ఆడి 12 వికెట్లు పడగొట్టిన ఈ స్టార్ బౌలర్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లు ఎవరన్న అంశంపై ఓ లుక్కేద్దాం! 1. లాహిరు కుమార శ్రీలంక పేసర్ లాహిర్ కుమార 50 లక్షల కనీస ధరతో ఐపీఎల్-2022 మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఫ్రాంఛైజీలు అతడి పట్ల ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుమార.. 23 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల టీమిండియాతో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా 1, 2, 2 వికెట్లు తీసిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌తో ఢిల్లీ నోర్జే స్థానాన్ని భర్తీ చేయవచ్చు. 2. ధవళ్ కులకర్ణి టీమిండియా పేసర్ ధవళ్ కులకర్ణికి ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. 2012 నుంచి ఈ మెగా టోర్నీలో భాగమైన అతడు ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. సగటు 28.76. ధవళ్ను కూడా నోర్జేని రీప్లేస్ చేయగల ఆటగాళ్లలో ఒకడిగా భావించవచ్చు. 3. ఇషాంత్ శర్మ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈసారి మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లలో ఒకడు. గత సీజన్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన ఇషాంత్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం కలిసి వచ్చే అంశం. ఐపీఎల్లో ఇప్పటి వరకు 93 మ్యాచ్‌లు ఆడిన అతడు 73 వికెట్లు పడగొట్టాడు. వేలంలో కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న ఈ అనువభజ్ఞుడైన పేసర్‌ను జట్టులోకి తీసుకుంటే ఢిల్లీకి ఉపయుక్తంగా ఉంటుందనేది విశ్లేషకుల భావన. 4. కేన్ రిచర్డ్సన్ ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్సన్కు నోర్జే స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 30 టీ20 మ్యాచ్‌లు ఆడిన రిచర్డ్సన్ 37 వికెట్లు పడగొట్టాడు. ఇక క్యాష్‌రిచ్ లీగ్ ఐపీఎల్ విషయానికొస్తే... ఇప్పటి వరకు ఆడిన 15 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీశాడు. కనీస ధర 1.5 కోట్లుగా నమోదు చేసుకున్న రిచర్డ్సన్ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. 5. ఆండ్రూ టై ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ఐపీఎల్ మెగా వేలం-2022లో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. కానీ అతడి పట్ల ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఐపీఎల్లో 27 మ్యాచ్‌లు ఆడి 40 వికెట్లు పడగొట్టిన ఈ పేసర్.. ఢిల్లీ జట్టులో నోర్జే స్థానాన్ని భర్తీ చేయగలడు. చదవండి: IPL 2022- CSK: సీఎస్కే అభిమానులకు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
ఫ్యాబ్-ఫోర్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం!
టీమిండియా సీనియర్ టెస్టు క్రికెటర్లు రహానే, పుజారా, ఇషాంత్, వృద్ధిమాన్ సాహాలపై వేట పడనుంది. రాబోయే శ్రీలంకతో టెస్టు సిరీస్ నుంచి ఈ నలుగురిని తప్పించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఫ్యాబ్-ఫోర్ క్రికెటర్లకు వ్యక్తిగతంగానే సమాచారం అందించినట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఈ నలుగురిని శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవద్దని సెలక్షన్ కమిటీకి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ''రహానే, పుజారా, ఇషాంత్, సాహాలపై వేటు నిజమే. వీరి స్థానంలో కొత్త మొహాలకు చాన్స్ ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఫ్యాబ్-ఫోర్కు పర్సనల్‌గా సమాచారం అందించాం. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టులోని మరికొంతమంది సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయాలు అడిగాకే ఈ నిర్ణయానికి వచ్చామంటూ'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం పుజారా, రహానేలకు బ్రేక్ మాత్రమే.. పుజారా, రహానేలకు ఇది బ్రేక్ మాత్రమే అని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న ఈ ఇద్దరు జట్టుకు భారంగా మారారు. అయితే ఇప్పటికి వీరిద్దరు రాణిస్తారనే నమ్మకం బీసీసీఐకి ఉంది. ఎందుకంటే ఎంత కాదనుకున్న రహానే, పుజారాలు ప్రస్తుతం టీమిండయా టెస్టు జట్టులో కీలక ఆటగాళ్లు. కాబట్టి రానున్న రంజీ సీజన్లో వీరిద్దరు రాణిస్తే మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇద్దరికి రంజీ సీజన్ కీలకం. ఇషాంత్, సాహాల కెరీర్ ముగిసినట్లే.. ఇషాంత్, సాహాలను మాత్రం తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరు వయసు పైబడడంతో ఫిట్నెస్ను అందుకోలేకపోతున్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో మునుపటి పదును కనిపించడం లేదు. 33 ఏళ్ల వయసు ఉన్న ఇషాంత్ మహా అయితే మరో రెండేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో షమీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లకు తోడూ సిరాజ్, శార్దూల్ లాంటి కొత్త బౌలర్లు వస్తుండడంతో ఇషాంత్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమై. దీంతో ఇషాంత్ రిటైర్ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడున్నారు. పరోక్షంగా బీసీసీఐ కూడా ఇషాంత్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లే. చదవండి: IND Vs WI: కేఎల్ రాహుల్ హిట్టయ్యాడు కానీ సమస్య అక్కడే.. Virat Kohli: అదే నిర్లక్ష్యం.. ప్రతిష్టాత్మక వన్డేలో కోహ్లి చెత్త ప్రదర్శన ఇక సాహా విషయంలోనూ బీసీసీఐ ఇదే అభిప్రాయంతో ఉంది. రెగ్యులర్‌గా కాకున్నా ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తున్నప్పటికి సాహా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీనికి తోడూ వయసు కూడా 37 ఏళ్లు ఉండడం పెద్ద మైనస్‌గా మారింది. దాదాపు కెరీర్ చరమాంక దశలో సాహా ఉన్నాడు. ఇప్పుడు జట్టులో స్థానం ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకపక్క రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు అన్ని ఫార్మట్లలోనూ రెగ్యులర్‌గా ఆటగాళ్లుగా మారిపోవడం.. వీరిద్దరు వికెట్కీపర్లు కావడంతో సాహాకు అవకాశాలు మరింతగా తగ్గిపోయాయి. కేఎస్ భరత్ లాంటి యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు కూడా వస్తుండడంతో సాహా కెరీర్ దాదాపు ముగిసినట్లే. అందుకేనేమో ఎలాగూ టీమిండియాకు సెలక్ట్ కావడం లేదని ఈసారి రంజీ సీజన్‌కు దూరంగా ఉండాలని సాహా నిర్ణయం తీసుకున్నాడు. పైకి వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నప్పటికి.. అంతర్లీనంగా తనకు అవకాశాలు రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక శ్రీలంకతో టీమిండియా రెండు టెస్టులు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 25-మార్చి 1 మధ్య తొలి టెస్టు(మొహలీ) మార్చి 5-9 రెండో టెస్టు(బెంగళూరు) తొలి టి20- మార్చి 13, మొహలీ రెండో టి20-మార్చి 15, ధర్మశాల మూడో టి20- మార్చి 18, లక్నో -
India Tour Of South Africa: టీమిండియాకు భారీ షాక్.. నలుగురు ఆటగాళ్లు దూరం!
Ind Vs Sa: These 4 Indian Players Doubtful For SA Tour, Cause Of Injuries దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే సమయం ఆసన్నమైన వేళ టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో పాటు అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ సైతం సౌతాఫ్రికా టూర్ మిస్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా కాన్పూర్ మ్యాచ్‌లో జడేజా కుడి ముంజేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంజేయి వాపు కారణంగా జడేజా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, గాయం తీవ్రతరం కావడంతో పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. ఒకవేళ జడేజా సర్జరీకి వెళ్లాల్సి వస్తే అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న అక్షర్ పటేల్ సైతం స్ట్రెస్ రియాక్షన్(కీళ్ల నొప్పి) కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం అతడు దక్షిణాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయం తేలనుంది. చదవండి: IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి మరోవైపు పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న సీనియర్ సీమర్ ఇషాంత్ శర్మ సైతం జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే అతడి స్థానంలో ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అందుబాటులో ఉండటంతో పెద్దగా సమస్యకాకపోవచ్చు. కానీ, ఒకవేళ జడేజా, అక్షర్ పటేల్ టూర్ మిస్ అయితే మాత్రం.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు తోడుగా.. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అనధికార టెస్టులు ఆడుతున్న ఇండియా ఏ జట్టులోని షాబాజ్ నదీం, సౌరభ్ కుమార్‌ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా... ముంబై టెస్టులో గిల్ మధ్య వేలికి గాయమైన నేపథ్యంలో అతడు కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇలా టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న కారణంగా జట్టు ఎంపిక కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది. చదవండి: Ind Vs Sa Test Seires: ప్రొటిస్ జట్టు ఇదే.. పాక్‌కు చుక్కలు చూపించిన బౌలర్ వచ్చేశాడు! -
రోహిత్, ఇషాంత్ అవుట్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకే కాదు... అభిమానులనూ ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్త! బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్ లకు అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. అటు ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్, ఇటు వెటరన్ పేసర్ ఇషాం త్ ఇద్దరూ దూరమవడం భారత్‌కు ఒక విధంగా ఆల్‌రౌండ్ దెబ్బలాంటిదే! జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని భారత జట్టు మేనేజ్మెంట్ కలవరపడుతోంది. అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్‌కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు. ఇదే విషయాన్ని ఆదివారం హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పారు. అక్కడ 14 రోజుల ఐసోలేషన్ తర్వాతే వారు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అందుకే సీనియర్ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఎన్సీఏలోనే ఆటగాళ్లు... సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం యూఏఈలో ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు సభ్యులు సిడ్నీ ఫ్లయిట్ ఎక్కారు. కానీ జట్టుకు ఎంపికైనప్పటికీ గాయాలతో రోహిత్, ఇషాంత్ వెళ్లలేకపోయారు. లీగ్ మధ్యలోనే పక్కటెముకల గాయంతో ఇషాంత్ స్వదేశానికి రాగా, తొడకండరాల గాయంతోనే ఫైనల్ మ్యాచ్ ఆడిన రోహిత్ భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్నారు. ఇషాంత్ గాయం నుంచి కోలుకోవడంతో ఫిజియో, ట్రెయి నర్ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ పెంచాడు. అయితే మ్యాచ్ ఫిట్నెస్ స్థాయికి ఇంకా రాలేదు. రోజుకు కనీసం 20 ఓవర్లయినా బౌలింగ్ చేస్తేనే టెస్టు బౌలర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు. అందుకే పని ఒత్తిడిని ఉన్నపళంగా పెంచకుండా ఎన్సీఏ బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. వీళ్లిద్దరు పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరో 3–4 వారాలు పడుతుందని ఎన్సీఏ ఫిజియో బోర్డుకు నివేదిక ఇచ్చాడు. అయ్యర్‌కు అవకాశం! పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడైన శ్రేయస్ అయ్యర్‌కు టెస్టులాడే అవకాశం రావొచ్చు. రోహిత్ అం దుబాటులో లేకపోవడం, తొలి టెస్టు తర్వాత కెప్టెన్ కోహ్లి స్వదేశానికి రానుండటంతో అయ్యర్ టెస్టు అరంగేట్రానికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. టీమిండియా ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టి20లు, నాలుగు టెస్టులు ఆడుతుంది. -
జట్టు కోసం ఎక్కడైనా ఆడతా
న్యూఢిల్లీ: జట్టు అవసరాలకి అనుగుణంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధమని భారత స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో గాయం నుంచి కోలుకుంటోన్న రోహిత్... తాను టీమిండియాతో కలిసే సమయానికల్లా జట్టులో తన బ్యాటింగ్ స్థానం ఖరారు అవుతుందని పేర్కొన్నాడు. ‘గతంలో ఎన్నోసార్లు చెప్పిందే మళ్లీ చెప్తున్నా. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమంటే అక్కడ సంతోషంగా ఆడతా. ఓపెనర్‌గా నా స్థానాన్ని మారుస్తారో? లేదో? నాకు తెలియదు. విరాట్ కోహ్లి భారత్‌కు వచ్చేశాక ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే అంశంపై ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్న మా జట్టు ఓ అంచనాకు వచ్చిందని అనుకుంటున్నా. అక్కడికి వెళ్లాకే నాకూ నా స్థానంపై స్పష్టత వస్తుంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా వరుసగా డబుల్ సెంచరీ, సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ... సంప్రదాయ క్రికెట్లో రాణించేందుకు ప్రాథమిక అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై పెద్దగా బౌన్స్ ఉండదని వ్యాఖ్యానించాడు. ‘2018 పర్యటనలో ఎంతమంది భారత బ్యాట్స్‌మెన్ బౌన్సర్లకు అవుటయ్యారు? పెర్త్ మినహా అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలలో బౌన్స్ ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ కొత్త బంతితో స్టార్క్, కమిన్స్, హాజెల్‌వుడ్ బౌన్స్, స్వింగ్ చేసేందుకే ప్రయత్నిస్తారు. కాబట్టి ఎక్కువ బంతులు నేరుగా బ్యాట్‌పైకి వచ్చే అవకాశముంది. ఈ ఫార్మాట్లో రాణించాలంటే ప్రాథమిక అంశాలే కీలకం. అందుకే వాటిపైనే దృష్టి సారించా. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. వాటి నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు’ అని రోహిత్ శర్మ వివరించాడు. మరో నాలుగైదు రోజుల్లోనే... ఇషాంత్, రోహిత్ ఆస్ట్రేలియా రావాలన్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సిడ్నీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాల్గొనాలంటే భారత సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ మరో నాలుగైదు రోజుల్లోనే ఆస్ట్రేలియా చేరుకోవాలని హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. ఆలస్యం చేసిన కొద్దీ పరిస్థితులు మారిపోతాయని అన్నారు. క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా భారత్ నుంచి బయల్దేరాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘రోహిత్, ఇషాంత్ టెస్టు సిరీస్ ఆడాలంటే మరో నాలుగు లేదా ఐదు రోజుల్లోనే ఆస్ట్రేలియా విమానం ఎక్కాలి. లేనిపక్షంలో వారికి ఇబ్బందిగా మారుతుంది. క్వారంటైన్ కారణంగా వారిద్దరు డిసెంబర్ 6–8 వరకు జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌కు దూరం కానున్నారు. ఇంకా ఆలస్యమైతే రెండో వార్మప్ మ్యాచ్ (డిసెంబర్ 11–13)కు కూడా దూర మయ్యే అవకాశముంది. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా వారిద్దరూ ఆడాల్సి ఉంటుంది. బీసీసీఐ వీలైనంత త్వర గా వారిని ఆస్ట్రేలియా పంపించాలి’ అని రవిశాస్త్రి సూచించారు. -
ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా
ఇస్లామాబాద్ : క్రికెట్ ప్రపంచంలో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లను ఎంతోమందిని చూశాం. దిగ్గజ ఆటగాళ్ల నుంచి మొదలుకొని సాధారణ ఆటగాళ్ల వరకు ఎంతో మంది ఆటతీరును చూశాం.. చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఆటలో తమ నైపుణ్యతను అంటే బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇలా ఏదో ఒక దాంట్లో తమ మెళుకువలను చూపెడుతూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటారు. సర్ డాన్ బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, ఇయాన్ బోథమ్ సహా ఇంకా చాలా మంది ఆటగాళ్లు ఇదే కోవలోకి వస్తారు. కానీ కొంతమంది మాత్రం ప్రదర్శనతో కాకుండా తమ రూపురేఖలతో ఆకట్టుకుంటారు. క్రికెట్లో అత్యంత పొడవైన క్రికెటర్‌గా పాక్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ రికార్డు నెలకొల్పాడు. కాగా ఇర్ఫాన్ పొడవు .. 7 అడుగుల 1అంగుళం. (చదవండి : ధోనీలా ఆడడం లేదు: బ్రియన్ లారా) 2010లో పాక్ వన్డే క్రికెట్లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఇర్ఫాన్ తన బౌన్సర్లతో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. తాజాగా మహ్మద్ ఇర్ఫాన్ రికార్డును పాక్‌కే చెందిన ముదస్సార్ గుజ్జర్ అనే కుర్రాడు బద్దలు కొట్టాడు. గుజ్జర్ పొడవు 7 అడుగుల 6 అంగుళాలు. ముదస్సార్ గుజ్జర్ గతేడాది నవంబర్‌లో లాహోర్ క్వాలాండర్స్ డెవలప్మెంట్ లో చేరి కోచ్, ట్రైనర్ల సహాయంతో బౌలర్‌గా శిక్షణ పొందుతున్నాడు. గుజ్జార్ ఎక్కువ పొడవు కావడంతో ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కఠోర సాధన చేస్తున్నాడు. ఏదో ఒక రోజు పాక్ తరపున దేశవాలి క్రికెట్లో ఆడి పేరు సంపాదించి ఆపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలనే ఆశతో ఉన్నాడు. తాజాగా ముదస్సార్ గుజ్జార్‌ను కలిసిన ఒక జర్నలిస్ట్ అతనితో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ' ముదస్సార్ గుజ్జార్ పొడవు.. 7 అడుగుల 6 అంగుళాలు, షూ సైజ్ 23.6.. ఇంత పొడవు క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా.. మీట్ విత్ ముదస్సార్ గుజ్జార్' అంటూ క్యాప్షన్ జత చేశాడు.(చదవండి : ‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’) సాధారణంగా విండీస్ నుంచి వచ్చే క్రికెటర్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆరు అడుగులకు పైగానే ఉంటారు. మన టీమిండియాలో కూడా అత్యంత పొడగరి ఎవరంటే ఇషాంత్ శర్మ పేరు టక్కున చెబుతారు. ఇషాంత్ శర్మ పొడవు 6 అడుగుల 5అంగుళాలు. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత పొడవైన క్రికెటర్లుగా మహ్మద్ ఇర్ఫాన్(పాకిస్తాన్), జోయల్ గార్నర్(వెస్టిండీస్), బ్రూస్ రీడ్(ఆస్ట్రేలియా), కర్ట్లీ ఆంబ్రోస్(వెస్టిండీస్), టామ్ మూడీ( ఆస్ట్రేలియా), జాసన్ హోల్డర్(వెస్టిండీస్), క్రిస్ ట్రెమ్లెట్( ఇంగ్లండ్), పీటర్ ఫుల్టన్(న్యూజిలాండ్), షాహిన్ ఆఫ్రది(పాకిస్తాన్), ఇషాంత్ శర్మ( ఇండియా) తొలి పది స్థానాల్లో ఉంటారు. -
బాధితుడిగా భావించడం లేదు!
న్యూఢిల్లీ: పదునైన వేగం, అన్ని పిచ్‌లపై చెలరేగే సత్తా ఉన్నా ఉమేశ్ యాదవ్‌కు ఇతర భారత పేస్ బౌలర్లతో పోలిస్తే తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డేల్లో చాలా కాలంగా జట్టుకు దూరమైన అతను టెస్టుల్లో కూడా ఇషాంత్, షమీ, బుమ్రాల జోరులో రిజర్వ్ స్థానానికే పరిమితం కావాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. అయితే తానేమీ బాధ పడటం లేదని, అవకాశం వచ్చినప్పుడే నిరూపించుకోవడం తన పని అని అతను వ్యాఖ్యానించాడు. 2018నుంచి చూస్తే ఉమేశ్ 10 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. వీటిలో అతను 45 వికెట్లు పడగొట్టాడు. ‘ఈ విషయంలో నన్ను నేను బాధితుడిగా భావించుకోవడం లేదు. కొన్ని సార్లు ఆడతాం. కొన్ని సార్లు ఆడలేమంతే. నిజాయితీగా చెప్పాలంటే మానసికంగా నేను చాలా దృఢంగా ఉంటాను. ఇలాంటి సమయంలో అది ఎంతో ముఖ్యం. మ్యాచ్‌లో ఎవరికైన్నా అవకాశం దక్కవచ్చు. ఫామ్, పిచ్, వాతావరణ పరిస్థితులు... ఇలా ఒక బౌలర్‌ను తీసుకునేందుకు ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి దాని గురించి అతిగా ఆలోచించను. మ్యాచ్‌లో అవకాశం దక్కనప్పుడు కూడా నా ఆటను మరింత మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెడతా. ఇలాంటి సమయంలో ఎవరి దగ్గరికో వెళ్లి సలహాలు అడగను’ అని ఉమేశ్ యాదవ్ చెప్పాడు. లాక్డౌన్ సమయంలో శరీర దారుఢ్యాన్ని పెంచుకునేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్‌పైనే దృష్టి పెట్టినట్లు అతను వెల్లడించాడు. -
ఖేల్ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్
ముంబై : టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కు నామినేట్ చేసినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసీసీఐ) శనివారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరింది. ఈ మేరకు క్రీడా శాఖ ప్రతిపాధించిన సమయంలో రోహిత్ శర్మ ప్రదర్శన గమనిస్తే టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు, 8 వన్డేల్లో 150కు పైగా పరుగులు సాధించాడు.(అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్) 2017 ఆరంభం నుంచి వన్డేల్లో 18 శతకాలు నమోదు చేయగా, మొత్తం 28 శతకాలతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్‌లో అత్యద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. ఒకే వరల్డ్‌కప్‌లలో ఐదు సెంచరీలు నమోదు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. వన్డేల్లో మూడు ద్విశతాకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. మరోవైపు అర్జున అవార్డుకు నామినేట్ అయిన శిఖర్ ధావన్ సైతం కొన్నేండ్లుగా నిలకైడన ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో పేసర్ ఇషాంత్ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడేండ్లుగా బ్యాట్‌తో, బంతితో రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది.(స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?) -
ధోనిపై ఇషాంత్ ఘాటు వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత పేస్ ఎటాక్‌లో ఇషాంత్ శర్మ ఒక పిల్లర్‌గా కొనసాగుతున్నాడు. 2007లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ.. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనిల కెప్టెన్సీలో ఆడాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి నేతృత్వంలో రెగ్యులర్ టెస్టు పేసర్‌గా ఉన్నాడు. అయితే స్పిన్నర్లను ఎక్కువగా అందించే భారత్‌లో పేస్ విభాగం ఇటీవల కాలంలో బాగా రాటు దేలింది. ఆ మార్పు ఎందుకు వచ్చిందనే ఇషాంత్ శర్మను అడగ్గా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఇక్కడ ధోని సమయంలో తనకు ఎక్కువగా అవకాశాలు రాకపోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు.అసలు ఫాస్ట్ బౌలర్లకు నిలకడగా ధోని ఎప్పుడు అవకాశాలు ఇచ్చాడంటూ ఇషాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘ధోని కెప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్లjకు ఎక్కువగా రొటేషన్ పద్ధతిలో అవకాశాలు మాత్రమే వచ్చేవి. ధోని ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లను మార్చుతూనే ఉండేవాడు. అది అప్పట్లో ఏ ఒక్క ఫాస్ట్ బౌలర్‌కి ఉపయోగపడలేదు. ఇలా చేయడం వల్ల మాలో నిలకడ లోపించేది. నిలకడను సాధించడానికి ధోని అవలంభించిన పేసర్ల రొటేషన్ పద్ధతి ఉపయోగం లేకుండా పోయింది. ఇలా చేయడం వల్ల మాలో అనుభవలేమి ఎక్కువగా కనబడేది. టీమిండియాకు ధోని కెప్టెన్సీ చేసిన సమయాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. మాలో కొంతమందికి ఎక్కువ అనుభవం ఉండేది కాదు. అదే సమయంలో పేసర్లను తరచు రొటేట్ చేసేవాడు. అందుచేత ఏ ఒక్క పేసర్ నిలకడ సాధించలేక సతమతమయ్యే వాళ్లం. ఇప్పుడు ఒక పూల్‌లో మూడు నుంచి నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండటం వల్ల మా మధ్య సమన్వయం కరెక్ట్‌గా ఉంటుంది. అంతకముందు 6 నుంచి 7గురు ఫాస్ట్ బౌలర్లు ఉండేవారు.. మా మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు. ధోని అవలంభించిన రొటేషన్ విధానంతో మాకు లాభం చేకూరలేదు’ అని ఇషాంత్ పేర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లి కెప్టెన్సీలో జట్టు పూర్తి స్థాయిలో మారిపోయిందన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు పెద్ద పీట వేయడంతో మనం కూడా బలమైన పేస్ ఎటాక్ ఎదిగామన్నాడు. కోహ్లి నేతృత్వంలో ఫాస్ట్ బౌలర్లు విశేషంగా రాణించడానికి వారికి నిలకడగా అవకాశాలు రావడమేనన్నాడు. వచ్చే ఏడాది న్యూజిలాండ్‌తో భారత్‌కు టెస్టు సిరీస్ ఉంది. అంతకుముందుగానే పరిమిత ఓవర్ల సిరీస్ ఉన్నప్పటికీ రాబోవు సీజన్లో భారత్ టెస్టు సిరీస్ మాత్రం కివీస్‌తోనే ఆరంభం కానుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాంత్ ఎనిమిది వికెట్లు సాధించాడు. ప్రతీ ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఇషాంత్ మళ్లీ విజృంభణ..బంగ్లా విలవిల
కోల్‌కతా: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ విలవిల్లాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లో అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. శనివారం రెండో రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా తొమ్మిది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.బంగ్లాదేశ్ ఇలా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కాసేపటికే రెండు వికెట్లను కోల్పోయింది. ఇషాంత్ శర్మ నిప్పులు చెరిగే బంతులతో తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ షాద్మన్ ఇస్లామ్, మోమినుల్ హక్‌లను డకౌట్లగా పెవిలియన్‌కు పంపాడు. ఇషాంత్ వేసే బంతుల్ని ఎదుర్కోవడానికి బెంబేలెత్తిన వీరిద్దరూ చివరకు వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత మహ్మద్ మిథున్(6)ను ఉమేశ్ యాదవ్ ఔట్ చేశాడు. ఆపై స్వల్ప వ్యవధిలో ఇమ్రుల్ కేయిస్(5)ను ఇషాంత్ ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ వేసిన ఏడో ఓవర్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన ఇమ్రుల్ పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ ఐదు వికెట్లతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో భారత్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. -
ఇద్దరూ కలిసి హ్యాట్రిక్..!
ఇండోర్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. ఈరోజు తొలి రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్.. టీ బ్రేక్ తర్వాత తమ ఇన్నింగ్స్‌ను 58.3 ఓవర్లలో 150 పరుగుల వద్ద ముగించింది. భారత బౌలర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్, అశ్విన్ ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఒక వికెట్ రనౌట్ రూపంలో లభించింది. కాగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ షమీ హ్యాట్రిక్ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 54 ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ వికెట్ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలోనే టీ బ్రేక్ రాగా, షమీని హ్యాట్రిక్ ఊరించింది. కాగా, టీ విరామం తర్వాత షమీ మరొక ఓవర్‌ను అందుకోవడానికి ముందే ఇషాంత్ శర్మ వేసిన 55 ఓవర్ మొదటి బంతికే లిటాన్ దాస్ ఔటయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు. దాంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్ హ్యాట్రిక్‌ను సాధించారు. బంగ్లాదేశ్ స్కోరు 140 పరుగుల వద్ద ఉండగా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో అది కంబైన్డ్ హ్యాట్రిక్‌గా నమోదైంది. ఆపై షమీ వేసిన ఓవర్లో అతని వ్యక్తిగత హ్యాట్రిక్ సాధిస్తాడేమోనని ఎదురుచూసినా అది జరగలేదు. కాకపోతే సంయుక్తంగా హ్యాట్రిక్ రావడమే భారత పేస్ బౌలింగ్ ధాటిగా అద్దం పడుతోంది. బంగ్లా తన చివరి రెండు వికెట్లలో ఒక రనౌట్ కాగా, మరొక వికెట్‌ను ఉమేశ్ యాదవ్ తీశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. అటు తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు ఆరంభంలోనే రోహిత్ శర్మ(6) వికెట్‌ను కోల్పోయింది. అబు జాయేద్ బౌలింగ్‌లో రోహిత్ ఔటయ్యాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(37 బ్యాటింగ్), పుజారా(43 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు. -
ఇషాంత్‌ను జ్లటాన్ అన్న రోహిత్!
ఢిల్లీ: టెస్టు ఫార్మాట్లో ఓపెనర్‌గా విజయవంతమైన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మంచి జోష్‌లో ఉన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.గత జనవరి నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మకు సారథ్య పగ్గాలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పాత ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటోకు రోహిత్ శర్మ .. ‘ మాతో పాటు జ్లటాన్ ఉన్నాడు. అతడితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది’ అంటూ కామెంట్ పెట్టాడు. రోహిత్ శర్మ పోస్టు చేసిన ఫోటోలో అతడితో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు ఉన్నారు. అయితే, రోహిత్ మాత్రం జాట్లాన్ అని ట్వీట్ చేశాడు.జ్లటాన్ ఎవరో కాదు. స్వీడన్ మాజీ స్టార్ పుట్ బాల్ ప్లేయర్. జ్లటాన్ అనగానే సాకర్ అభిమానులకు ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి పోనీటైల్. అయితే, రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలో ఇషాంత్ శర్మ అతడిలాగే పోనీ టైల్తో ఉండటంతో జ్లటాన్ అని సంబోధించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వాయు కాలుష్య ప్రభావం ఉండటంతో ఇరు జట్ల క్రికెటర్లు కాస్త ఆందోళనలో ఉన్నారు. కాకపోతే ఇది టీ20 మ్యాచ్ కావడంతో పెద్దగా ఇబ్బందులు రావని అనుకుంటున్నారు. View this post on Instagram We got zlatan amongst us. Great fun chatting 😁 A post shared by Rohit Sharma (@rohitsharma45) on Nov 1, 2019 at 12:13am PDT -
ఆలస్యమైనా... అద్భుతమే
1947 నుంచి టీమిండియా 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించింది. 44 టెస్టులాడితే ఐదే గెలిచింది. వీటిలోనూ సిరీస్‌లోని మొదటి టెస్టును ఎన్నడూ నెగ్గలేదు. 2003–04 సిరీస్‌లో రెండో టెస్టును నెగ్గి ఆధిక్యంలో నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఈసారి మాత్రం పరిస్థితులు కలిసొస్తేనేమి? జట్టు బలంగా ఉన్నందుకైతేనేమి? కోహ్లి సేన తొలి మ్యాచ్‌లోనే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యమైనా, అద్భుతం అనదగ్గ రీతిలో ‘సిరీస్ వేట’ను ఆరంభించింది. ఇదే ఊపు కొనసాగిస్తే సిరీస్ గెలవాలనే చిరకాల కోరికను మూడో టెస్టులోపే ఖాయం చేసుకోవచ్చు. వారు న్యాయం చేశారు... జట్టు నుంచి పూర్తిగా తీసేయలేక, అలాగని మొత్తానికి కొనసాగించలేని పరిస్థితి పుజారా, రహానేలది. గత రెండు విదేశీ సిరీస్‌లలో వారికిదే అనుభవమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగా చాలా కీలకం. కెప్టెన్ కోహ్లి సహా టాపార్డర్ విఫలమైన అత్యంత కీలక సందర్భాన తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదడం ద్వారా పుజారా తన సత్తా ఏమిటో చాటాడు. జట్టును సురక్షిత స్థానానికి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి పాత్రను తక్కువ చేయలేం. ఇక... ఆధిక్యాన్ని సాధ్యమైనంత మేర పెంచాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో రహానే చేసిన అర్ధశతకం మెచ్చుకోదగ్గది. ఇది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరి రాణింపుతో కోహ్లి అరుదైన వైఫల్యం ప్రభావం చూపలేకపోయింది. తక్కువే అయినా, యువ రిషభ్ పంత్ చేసిన పరుగులూ విలువైనవే. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతడి ఎదురుదాడి మున్ముందు లయన్ లయను దెబ్బతీసేందుకు మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఓ మార్గం చూపింది. రెండో ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుతో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన స్థానాన్ని కనీసం మరో టెస్టుకైనా పొడిగించుకున్నాడు. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో మన జోరును ఆపడం ఆతిథ్య జట్టు తరం కాలేదు. నోబాల్స్ సమస్యను పక్కన పెడితే ఇషాంత్ శర్మ ఎప్పటిలానే మెరుపు బంతులేయగా, కొంత ఇబ్బందిపడ్డా షమీ తర్వాత తేరుకుని ప్రభావం చూపాడు. అయితే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్విన్, బుమ్రా గురించే. కొంతకాలంగా విదేశీ పర్యటనల్లో వైఫల్యాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న అశ్విన్ ఈ టెస్టుతో దానిని అధిగమించాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోనే కాదు... సంప్రదాయ క్రికెట్లోనూ తాను ప్రమాదకారినని బుమ్రా చాటిచెప్పాడు. అడిలైడ్‌లో కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ గతిని మార్చాడు. ఆ రెండు స్థానాలే... జట్టుగా సాధించిన ఈ విజయంలోనూ సరిచేసుకోవాల్సిన కొన్ని లోపాలున్నాయి. అందులో మొదటిది ఓపెనింగ్ స్థానం. మురళీ విజయ్ వైఫల్యాల నుంచి బయటపడలేదు. దీంతో స్థానం కోల్పోక తప్పని పరిస్థితి. రెండో టెస్టు నాటికి కోలుకుంటే పృథ్వీ షా అతడి స్థానంలోకి వచ్చేస్తాడు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ అరుదైన అవకాశాన్ని మరోసారి చేజార్చుకున్నాడు. ధాటైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడం అటుంచి, టెస్టు క్రికెట్‌కు తగిన ఆటగాడేనా అన్న అనుమానాలు మళ్లీమళ్లీ రేకెత్తిస్తున్నాడు. దీంతో ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్ వేయగల హనుమ విహారిని కాదని... రోహిత్‌ను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా పెర్త్ టెస్టుకు రోహిత్‌నూ పక్కన పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో కుదురుగా ఉన్న పృథ్వీ, విహారి జత కలిస్తే జట్టు మరింత బలీయం కావడం ఖాయం. తద్వారా ‘సిరీస్’ దక్కడమూ ఖాయం. –సాక్షి క్రీడావిభాగం -
పోరాడుతున్న బట్లర్, స్టోక్స్
నాటింగ్‌హామ్: మూడో టెస్టులో టీమిండియా విజయాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్-స్టోక్స్ మరింత ఆలస్యం చేస్తున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైనా ఈ జోడి పట్టుదలతో ఆడుతున్నారు. ఒకానొక దశలో 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జట్టు బాధ్యతలను బట్లర్, స్టోక్స్ తీసుకున్నారు. టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వికెట్లకు ఆడ్డుగోడలా నిలుస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ భారీ ఓటమి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ జోస్ బట్లర్(70 నాటౌట్; 118 బంతుల్లో 13ఫోర్లు) అర్దసెంచరీ పూర్తిచేసి సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. మరో ఎండ్‌లో బ్రిటీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (42 నాటౌట్; 115 బంతుల్లో 5ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. లంచ్ విరామం వరకు ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు గెలవాలంటే మరో 341 పరుగులు చేయాల్సివుంది. ఓవర్‌నైట్ స్కోర్ 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ దెబ్బతీశాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (13), అలిస్టర్ కుక్(17)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్(13) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ బుమ్రా బోల్తా కొట్టించాడు. షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్‌తో పోప్(16) వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బట్లర్ స్టోక్స్ ఆచితూచి ఆడుతున్నారు. -
విజయం ఊరిస్తోంది..!
తొలి టెస్టులోనే విజయం సాధించి సుదీర్ఘ సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశం... 194 పరుగుల సాధారణ లక్ష్యం.. కానీ మన బ్యాట్స్‌మెన్ మరో పేలవ ప్రదర్శనతో గెలుపు బాట కఠినంగా మారిపోయింది. 78 పరుగులకే ఐదుగురు పెవిలియన్ చేరి ఆందోళన పెంచారు. అయితే ఎప్పటిలాగే నేనున్నానంటూ విరాట్ కోహ్లి నిలబడ్డాడు. మెల్లగా జట్టును విజయం దిశగా నడిపిస్తున్నాడు. అతనికి అండగా దినేశ్ కార్తీక్ గట్టిగానే నిలబడ్డాడు. అయినా సరే మదిలో కాస్త సందేహం... ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోతుండటంతో మరో 84 పరుగులు ఇంకా సుదూరంగానే కనిపిస్తోంది. భారత్ గెలుపుపై ఆశలు పెంచుకోగలిగిందంటే ఇషాంత్ శర్మ అద్భుత బౌలింగ్ ప్రదర్శన వల్లే. ఒకే ఓవర్లో మూడు వికెట్లు సహా మొత్తం ఐదు వికెట్లతో గత సిరీస్ ‘లార్డ్స్’ ప్రదర్శనను గుర్తు చేయగా, అశ్విన్ స్పిన్ కూడా మాయ చేసింది. అయితే కుర్రాడు కరన్ పట్టుదలగా నిలబడటంతో ఇంగ్లండ్ చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. నాలుగో రోజు మనోళ్లు మిగిలిన ఐదు వికెట్లతో గట్టుకు చేరతారా? లేక ఇంగ్లండ్ వలలో పడతారా? ఇక అంతా కోహ్లిపైనే భారం..! బర్మింగ్‌హామ్: తొలి టెస్టులో భారత్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76 బంతుల్లో 43 బ్యాటింగ్; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (18 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లాగే కోహ్లికి లోయర్ ఆర్డర్ సహకరిస్తే శనివారం సిరీస్‌లో 1–0తో భారత్ ఆధిక్యం సాధించేందుకు మంచి అవకాశం ఉంది. అంతకుముందు ఇషాంత్ శర్మ (5/51) ధాటికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలింది. ఎనిమిదో స్థానంలో ఆడిన స్యామ్ కరన్ (65 బంతుల్లో 63; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఒకే ఓవర్లో మూడు వికెట్లు... ఓవర్‌నైట్ స్కోరు 9/1తో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. రెండో రోజు తొలి వికెట్‌తో భారత్‌కు శుభారంభం అందించిన అశ్విన్ తన జోరును కొనసాగించడంతో ఇంగ్లండ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ముందుగా జెన్నింగ్స్ (8) స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా... కొద్ది సేపటికే కెప్టెన్ జో రూట్ (14)ను కూడా అశ్విన్ వెనక్కి పంపించాడు. ఇషాంత్ వేసిన చక్కటి బంతిని ఆడలేక మలాన్ (20) స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పతనం మొదలైంది. అనంతరం ఇన్నింగ్స్ 31వ ఓవర్లో ఇషాంత్ చెలరేగిపోయాడు. ముగ్గురిని ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. రెండో బంతికి బెయిర్‌స్టో (40 బంతుల్లో 28; 5 ఫోర్లు) ఔట్ కాగా, నాలుగో బంతికి స్టోక్స్ (6) వెనుదిరిగాడు. ఈ వికెట్ తర్వాత లంచ్ విరామం వచ్చింది. అయితే ఆ తర్వాత తన ఓవర్ కొనసాగించిన ఇషాంత్ చివరి బంతికి బట్లర్ (1) పని పట్టాడు. ఈ దశలో ఇంగ్లండ్ స్కోరు 87/7 కాగా... ఆధిక్యం సరిగ్గా వంద పరుగులకు చేరింది. కరన్ మెరుపులు... తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీసిన స్యామ్ కరన్ ఈసారి బ్యాటింగ్ బలం చూపించాడు. ఎనిమిదో వికెట్‌కు రషీద్ (16)తో 48 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు బ్రాడ్ (11)తో 41 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. షమీ, ఇషాంత్ ఓవర్లలో అతను రెండేసి ఫోర్లు కొట్టాడు. బంతులు అనూహ్యంగా ఎడ్జ్ తీసుకొని స్లిప్ ఫీల్డర్లను దాటి బౌండరీలకు వెళ్లిపోవడం, రషీద్ క్యాచ్‌ను ధావన్ వదిలేయడం, వేగంగా పరుగులు రావడం... ఇలా ఇరు జట్లు ఇలా కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్నాయి. వెలుతురు తగ్గడంతో కొద్ది సేపు నిలిచిపోయిన ఆట మళ్లీ మొదలయ్యాక భారత్ కోలుకుంది. రషీద్‌ను ఉమేశ్ బౌల్డ్ చేశాక కూడా కరన్ దూకుడు తగ్గలేదు. అశ్విన్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన అతను ఇషాంత్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్‌తో 54 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్‌ను ఔట్ చేసి ఇషాంత్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా... తర్వాతి ఓవర్లో కరన్ వికెట్ తీసి ఉమేశ్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగించాడు. టాపార్డర్ విఫలం... ఛేదనలో భారత్‌కు మళ్లీ నిరాశాజనక ఆరంభం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లాగే టాప్–3 మరోసారి విఫలమయ్యారు. విజయ్ (6)ను ఎల్బీగా వెనక్కి పంపిన బ్రాడ్... తన తర్వాతి ఓవర్లో ధావన్ (13)నూ ఔట్ చేశాడు. స్టోక్స్‌కు రాహుల్ (13) వికెట్ దక్కగా, రహానే (2) పేలవ ఫామ్ కొనసాగింది. ఈ దశలో మరోసారి కోహ్లి బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు. ఆరో వికెట్‌కు కార్తీక్‌తో అభేద్యంగా 32 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను అతను నడిపించాడు. ►మధ్యాహ్నం గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం -
ఇషాంత్ కు చిర్రెత్తుకొచ్చింది!
-
ఇషాంత్ ఇలా భయపెడుతున్నాడు!
-
ఇషాంత్ ఇలా భయపెడుతున్నాడు!
బెంగళూరు:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్ కు మారుపేరు. మరి అటువంటుది ఆస్ట్రేలియా జట్టునే స్లెడ్జ్ చేస్తున్నాడు మన పేసర్ ఇషాంత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆ దేశ క్రికెటర్ల పట్ల వెకిలి చేష్టలను ప్రదర్శించి మరీ స్లెడ్జింగ్ కు దిగాడు ఇషాంత్. ఆదివారం రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటింగ్ దిగిన క్రమంలో ఇషాంత్ ఉన్నపళంగా తనలోని నటుడ్ని బయటకు తీశాడు. ప్రధానంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ రెన్ షాలు బ్యాటింగ్ చేస్తున్నసమయంలో వారిని అనుకరించే యత్నం చేశాడు. ఇలా ఇషాంత్ కొత్త తరహాలో స్లెడ్జింగ్ చేయడం అభిమానులకు విపరీతమైన నవ్వులు తెప్పించగా, మన కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం పగలబడి నవ్వుకోవడం కొసమెరుపు. ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతున్న ఇషాంత్ శర్మ కనీసం ఇలా అయినా ప్రత్యర్థి ఆటగాళ్లను భయపెడుతున్నాడని అభిమానులు సర్దుకుపోతున్నారు. -
ఇషాంత్‌పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం
కొలంబో: శ్రీలంకతో మూడో టెస్టులో సూపర్ స్పెల్‌తో రాణించిన భారత పేసర్ ఇషాంత్ శర్మ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. లంక క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఇషాంత్‌పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. ఐసీసీ ఈ మేరకు ప్రకటించింది. మూడో టెస్టులో ఇషాంత్ లంక క్రికెటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇషాంత్ ఐసీసీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించినట్టు తేలడంతో చర్యలు తీసుకున్నారు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించి 2-1తో సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఇషాంత్ శర్మ @ 200
భారత పేసర్ ఇషాంత్ శర్మ మరో మైలురాయిని అధిగమించాడు. టెస్టు క్రికెట్లో ఇషాంత్ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. శ్రీలంకతో మూడో మ్యాచ్‌లో ఈ ఢిల్లీ బౌలర్.. సెంచరీ హీరో మాథ్యూస్‌ను అవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇవ్వడంతో పాటు తన ఖాతాలో 200వ వికెట్‌ను జమ చేశాడు. ఇషాంత్‌కిది 65వ టెస్టు మ్యాచ్. శ్రీలంకతో కీలక మూడో టెస్టులో ఇషాంత్ అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ 5 వికెట్లు పడగొట్టి టీమిండియా ఆధిక్యానికి సాయపడ్డాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. లంక పర్యటనలో స్పిన్నర్ల హవా సాగిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌ల్లో అతను అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి టెస్టులో 2, రెండో మ్యాచ్‌లో 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే మూడో టెస్టులో ఇషాంత్ సూపర్ స్పెల్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇక తన కెరీర్లో 76 వన్డేలాడిన ఇషాంత్ 106 వికెట్లు తీశాడు. -
ఓవల్ ను ఛేదిస్తారా!
లండన్: క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో ధోని సేన కొత్త చరిత్రను సృష్టించాక సగటు భారతాభిమాని సిరీస్ పై ఆశలు పెంచుకున్నాడు. అయితే మనం ఒకటి తలస్తే.. మన ధోని గ్యాంగ్ మరోటి తలచింది. లార్డ్స్ టెస్టు అనంతరం మంచి ఊపు మీద కనిపించిన ధోనీ గ్యాంగ్ దారుణంగా విఫలమై సిరీస్ పై ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇప్పటికే మూడు, నాల్గో టెస్టుల్లో గెలిచి ఈ సిరీస్ ను తమ చేతుల్లోకి తీసుకున్న ఇంగ్లండ్ ఫైనల్ టెస్టును కైవసం చేసుకుని సిరీస్ ను చేజిక్కించుకోవాలని భావిస్తుండగా, ధోనీ సేన మాత్రం టెస్టును గెలిచి సిరీస్ ను సమం చేయాలని వ్యూహరచన చేస్తోంది. భారత్ కు సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ఓవల్ లో ఆరంభం కానున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి చవిచూసిన భారత్ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఈ తరుణంలో భారత్ చివరి టెస్టును ఏ రకంగా నెట్టుకొస్తోందో చూడాలి. ఈ టెస్టు మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేస్తారా? లేక ఆ మ్యాచ్ ను కూడా ఇంగ్లండ్ చేతిలో పెట్టి భారత్ కు ఉట్టి చేతుల్తో తిరిగి వస్తారా?అనేది చూడాల్సి ఉంది. -
సమం చేస్తారా?చాప చుట్టేస్తారా?
లండన్: క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర.. లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం..విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్నవేళ.. 28ఏళ్ల అనంతరం భారత జట్టు రికార్డు. ఇది గత మూడు వారాల క్రితం మాట. ఆ లార్డ్స్ విజయంతో భారత జట్టు టెస్ట్ సిరీస్ ను గెలుచుకుంటుందని అంతా భావించారు. కాగా, ఆ టెస్టు మ్యాచ్ అనంతరం జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమి పాలైన భారత్.. ఆధిక్యాన్ని ఇంగ్లండ్ చేతుల్లో పెట్టింది. ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో 266 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో చిత్తయింది. 445 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 178 పరుగులకే ఆలౌటై ఇంగ్లండ్ ను సిరీస్ ను సమం చేయడానికి అవకాశం ఇచ్చింది. అదేదో యాధృచ్చింగా జరిగిపోయిందని భావించిన సగటు భారత్ అభిమానికి మాత్రం నాల్గో టెస్టు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఏకంగా ఇన్నింగ్స్ 54 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శల పాలైంది. ఇంకా భారత్ కు చివరి టెస్టు రూపంలో ఆశలు మిగిలే ఉన్నాయి. ఆగస్టు 15 వ తేదీన ఓవల్ లో జరుగనున్న ఐదో టెస్టుకు భారత్ సన్నద్ధం అవుతోంది. ఆ టెస్ట్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేయడానికి భారత్ తీవ్రంగా పోరాడాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా మంచి ఊపు మీద కనబడుతోంది. కనీసం భారత్ తో మ్యాచ్ గెలవకపోయినా.. సిరీస్ ను మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరనేది సత్యం. అసలు అంతకుముందు జరిగిన రెండు టెస్టుల్లో భారత్ విఫలమైన తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఆ రెండు టెస్టుల్లో కనీసం పోరాడకుండానే భారత జట్టు ఓటమి పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. విదేశాల్లో గత భారత జట్టు చరిత్రను చూస్తే మాత్రం మనకు ఎక్కువ గుర్తుకు వచ్చే వ్యక్తులు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లు. వీరు విఫలమైయ్యారంటే మాత్రం భారత జట్టు ఓటమి పాలైన సందర్భాలే మెండు. వీరు సమష్టిగా విఫలమైన చోట భారత జట్టు ఫలితం కూడా ప్రతికూలంగా వచ్చిందని చరిత్ర చెబుతోంది.ఇప్పుడు టీం ఇండియా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 2011లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, చటేశ్వర పూజారాలు లేరు. తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తొలిసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లారు. దాంతో వీరిపై అంచనాలు పెరిగాయి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల ప్రదర్శనపైనే భారత్ విజయావకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు కూడా విశ్లేషించారు. ఇప్పుడు అదే సరిగ్గా ప్రతికూలంగా జరిగింది. వీరిద్దరి వైఫల్యంతో భారత జట్టు వరుస రెండు టెస్టుల్లో ఘోర పరాభావాన్ని మూట గట్టుకుంది. టెస్టుల్లో మూడు, నాలుగు స్థానాల్లో ఆడిన ఆటగాళ్లు విఫలమైతే మాత్రం అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత 16 ఇన్నింగ్స్ లలో ఈ ఇద్దరు కలిసి మధ్య 315 పరుగులు మాత్రమే నమోదయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.అలాంటప్పుడు వీరు నాటి దిగ్గజాల స్థానాలను భర్తీ చేయగలరంటే అతిశయోక్తే అవుతుంది.సచిన్ తన తొలి ఇంగ్లండ్ పర్యటనలో 61.25 సగటుతో ఐదు ఇన్నింగ్స్ లలో 245 పరుగులు చేయగా, ద్రవిడ్ తొలి మూడు ఇన్నింగ్స్ లలో 62.33 సగటుతో 187 పరుగులు సాధించాడు. మరీ వారి స్ఫూర్తిని తీసుకుని ఈ ఇద్దరు భారత్ చివరి టెస్టులో రాణిస్తారా?లేక పాత కథే పునరావృతం చేస్తారో వేచి చూడాల్సిందే. -
మది నిండా ఆనందం
►క్రికెట్ పుట్టింట్లో ధోని సేన కొత్త చరిత్ర ► లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌పై 95 పరుగుల విజయం ► సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యం ► మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ శర్మ పిల్లాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే... నచ్చిన సెల్‌ఫోన్ నాన్న కొనిస్తే... మెచ్చిన హీరో సినిమా మార్నింగ్ షో చూస్తే... ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌కు వెయ్యి లైక్‌లు వస్తే... ఎంత ఆనందం కలుగుతుందో... భారత క్రికెట్ అభిమానికీ అంత ఆనందం కలిగింది. ఇది నిజమేనా..! అని ఆశ్చర్యపోయేలా ధోనిసేన మురిపించింది. క్రికెట్‌ను ఊపిరిగా శ్వాసించే అభిమానులకు ఇదో సంబరం. ఈ ఆటను మతంలా భావించే దేశానికి ఇదో పెద్ద విజయం. క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం టెస్టు గెలిచిన తర్వాత... సచిన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలు అనేకసార్లు ప్రయత్నించినా సాధ్యం కాని విజయం... ఇన్నాళ్లకు దక్కింది. విఖ్యాత లార్డ్స్ మైదానం 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సంతోష సమయంలో... భారత జట్టు ఈ ప్రతిష్టాత్మక మైదానంలో ఇంగ్లండ్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. పేసర్ ఇషాంత్ శర్మ (7/74) సంచలన బౌలింగ్‌తో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. లండన్: అద్భుతం.. మహాద్భుతం. అవును.. భారత జట్టు మహాద్భుతమే సృష్టించింది. లార్డ్స్ మైదానంలో 28 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌లో గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. తొలి నాలుగు రోజులు ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన రెండో టెస్టు.. చివరి రోజు ఇషాంత్ శర్మ బెబ్బులిలా విజృంభించడంతో ఏకపక్షమైంది. కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేస్తూ నిప్పులు కురిపించిన ఇషాంత్ బంతులకు ఇంగ్లండ్ కుదేలైంది. ఆట ఆఖరి రోజు రెండో సెషన్లోనే 223 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో 95 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయం నమోదు చేసిన భారత్.. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అద్భుత విజయాన్నందించిన ఇషాంత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్: 342 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 7; కుక్ (సి) ధోని (బి) ఇషాంత్ 22; బాలెన్స్ (సి) ధోని (బి) షమీ 27; బెల్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) బిన్ని (బి) ఇషాంత్ 66; అలీ (సి) పుజారా (బి) ఇషాంత్ 39; ప్రయర్ (సి) విజయ్ (బి) ఇషాంత్ 12; స్టోక్స్ (సి) పుజారా (బి) ఇషాంత్ 0; బ్రాడ్ (సి) ధోని (బి) ఇషాంత్ 8; ప్లంకెట్ నాటౌట్ 7; అండర్సన్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 32, మొత్తం: (88.2 ఓవర్లలో): 223 ఆలౌట్. వికెట్ల పతనం: 1-12, 2-70, 3-71, 4-72, 5-173, 6-198, 7-201, 8-201, 9-216, 10-223. బౌలింగ్: భువనేశ్వర్ 16-7-21-0; షమీ 11-3-33-1; ఇషాంత్ 23-6-74-7; జడేజా 32.2-7-53-1; విజయ్ 4-1-11-0; ధావన్ 2-0-2-0. సెషన్-1: ఆఖరి బంతితో ఆరంభం 319 పరుగుల లక్ష్యంతో.. ఓవర్‌నైట్ స్కోరు 105/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రూట్, అలీ ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకుండా ఆచితూచి ఆడారు. తొలుత ఇషాంత్, జడేజాలతో బౌలింగ్ చేయించిన భారత కెప్టెన్ ధోని.. ఆ తరువాత వ్యూహం మార్చి భువనేశ్వర్, షమీలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో పార్ట్‌టైమర్ ధావన్ చేతికీ బంతినిచ్చాడు. అయినా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ క్రీజును అంటిపెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఇన్నింగ్స్ 70వ ఓవర్లో స్కోరు 150 మార్క్‌కు చేరింది. లంచ్‌కు ముందు ఇషాంత్ మళ్లీ బంతి పట్టగా.. ఒకే ఓవర్లో రూట్ మూడు ఫోర్లు సాధించి దూకుడు ప్రదర్శించాడు. అయితే ఇషాంత్ వేసిన సెషన్ చివరి ఓవర్, చివరి బంతి ఇంగ్లండ్ పతనానికి నాంది పలుకుతూ అలీ (147 బంతుల్లో 39; 5 ఫోర్లు) వికెట్‌ను బలిగొంది. దీంతో 101 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరదించుతూ భారత్ లంచ్‌కు వెళ్లింది. ఓవర్లు: 30; పరుగులు: 68; వికెట్లు: 1 సెషన్-2: ఇంగ్లండ్ పేకమేడలా..! తిరిగి మ్యాచ్ ఆరంభమయ్యాక ఎదురుదాడికి దిగే వ్యూహం అవలంబించిన ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇషాంత్ వేసిన ఊరించే బంతుల్ని పుల్షాట్లుగా మలిచే ప్రయత్నంలో బ్యాట్స్‌మెన్ ఒకరి వెనుక ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలుత ఇన్నింగ్స్ 80వ ఓవర్లో పుల్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ప్రయర్ (12) డీప్ మిడ్వికెట్లో విజయ్ చేతికి చిక్కగా, ఇషాంత్ మరుసటి ఓవర్లో స్టోక్స్ (0), రూట్ (146 బంతుల్లో 66; 7 ఫోర్లు)లు అతణ్ని అనుసరించారు. స్టోక్స్ వరుసగా నాలుగో డకౌట్ నమోదు చేసుకోగా, రూట్ నియంత్రణ లేని షాట్‌తో ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయం ఖాయమైంది. మరో మూడు ఓవర్లు గడిచాయో లేదో.. ఇషాంత్ నమ్మశక్యం కాని రీతిలో ధోని క్యాచ్ ద్వారా బ్రాడ్ (8)ను వెనక్కిపంపి ఏడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఏడు పరుగులు జతయ్యాక.. అండర్సన్ (2)ను జడేజా రనౌట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం పూర్తయింది. 50 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ శిబిరంలో విషాదం చోటుచేసుకుంది. రిజర్వు ఆటగాళ్లతో సహా భారత బృందం మైదానంలోకి వచ్చి ఆనందాన్ని పంచుకుంది. ఓవర్లు: 12.2; పరుగులు: 60; వికెట్లు: 5 మలుపు తిరిగిందిక్కడే..! ఇంగ్లండ్ స్కోరు 173/4. ఐదో వికెట్‌కు 101 పరుగులు నమోదయ్యాయి. అర్ధసెంచరీతో రూట్, అతనికి అండగా మొయిన్ అలీ క్రీజులో పాతుకుపోయారు. విజయానికి మరో 146 పరుగులు కావాల్సివుంది. దీంతో ఇంగ్లండ్ శిబిరంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కానీ, అప్పుడే జరిగింది అద్భుతం. లంచ్‌కు వెళ్లేముందు చివరి బంతిని ఇషాంత్ జూలు విదిల్చిన సింహంలా విజృంభిస్తూ సంధించాడు. దీంతో అనూహ్యంగా ముఖం మీదికి దూసుకొచ్చిన బంతికి అలీ వద్ద సమాధానమే లేకపోయింది. ముఖానికి బ్యాట్‌ను అడ్డం పెట్టి పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. అంతే... మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ‘లంబూ’ పంబ రేపాడు! ఎప్పుడో ఆరేళ్ల క్రితం...పెర్త్ మైదానంలో రికీపాంటింగ్లాంటి దిగ్గజాన్ని వణికించిన అద్భుతమైన స్పెల్ అది...ఇషాంత్ శర్మ అంటే అందరికీ అదే గుర్తొస్తుంది. ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని మెరుపులు ఉన్నా...అతని కెరీర్లో అద్భుతాలు పెద్దగా లేవు. 50కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన తర్వాత కూడా ఒక సీనియర్‌గా జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించే స్థాయిలో లేడంటూ ఇషాంత్‌పై విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2011లో వెస్టిండీస్‌లో సిరీస్ నెగ్గినపుడు 22 వికెట్లతో ఇషాంత్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అయితే ఆ తర్వాత అతడి బౌలింగ్ మరీ నాసిరకంగా తయారైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆ తర్వాత ఇషాంత్ మారాడు. ఇక ఆట మారకుంటే కష్టం అనుకున్నాడు. అందుకే తనకు ఓనమాలు నేర్పిన కోచ్ శ్రవణ్ కుమార్ దగ్గరికి మళ్లీ వెళ్లాడు. తన బౌలింగ్ శైలిని మార్చుకున్నాడు. వేగం ధ్యాసలో పడి కోల్పోయిన లైన్ అండ్ లెంగ్త్‌ను అంది పుచ్చుకున్నాడు. దాని ఫలితం ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ సిరీస్‌లో కనిపించింది. రెండు టెస్టుల్లో కలిపి 15 వికెట్లతో సత్తా చాటాడు. ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లలో నోబాల్స్ సమస్య...తొలి టెస్టులో మూడే వికెట్లు...రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ పడలేదు! ఇలాంటి స్థితిలో అతను రెండో ఇన్నింగ్స్‌లో తన విలువేంటో చూపించాడు. 2011లో ఘోర పరాజయం బాధను అనుభవించిన లంబూ... ఈసారి తాను ఊరట చెందడంతో పాటు దేశంలో అందరిలో సంతోషాన్ని నింపాడు. ప్రధాని అభినందనలు ‘భారత జట్టు చాలా బాగా ఆడింది. లార్డ్స్‌లో అద్భుత విజయం సాధించినందుకు నా అభినందనలు. ఈ ప్రదర్శనపై మేం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నాం’ - నరేంద్ర మోడి ఇంగ్లండ్‌లో మా ఆటగాళ్లు చాలా మంది టెస్టు క్రికెట్ ఆడలేదు. సమీప భవిష్యత్తులో నేను లార్డ్స్‌లో టెస్టు ఆడకపోవచ్చు. కాబట్టి జట్టుకే కాకుండా వ్యక్తిగతంగా ఈ విజయం ఎంతో చిరస్మరణీయం. అందరూ అద్భుత ప్రదర్శన ఇచ్చారు. లంచ్‌కు ముందు ఆఖరి ఓవర్లో షార్ట్ బంతులు వేయమని నేనే ఇషాంత్‌పై ఒత్తిడి తెచ్చాను. షార్ట్ బంతులు విసిరి డీప్‌లో ఫీల్డర్ ఉంచిన మా వ్యూహం ఫలించింది. గతంలో విదేశాల్లో ఓడినప్పటితో పోలిస్తే ఈ జట్టు పూర్తిగా కొత్తగా ఉంది. మా శ్రమకు దక్కిన ఫలితమిది. - ధోని, భారత కెప్టెన్ జట్టు పరిస్థితి మార్చేందుకు నేను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా నేను పరుగులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల నేను బాగా ఆడటం లేదనేది వాస్తవం. అయితే కెప్టెన్‌గా నేను పనికి రానని భావిస్తే దీనిపై తొందరగా నిర్ణయం తీసుకుంటాను. ఇప్పుడు మేం గెలవాలంటే జట్టు మొత్తం ఎంతో పట్టుదల కనబర్చాలి. కుర్రాళ్లు బాగానే ఆడుతున్నా...సీనియర్ల వైఫల్యమే దెబ్బ తీస్తోంది. ఈ ఓటమి మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. - అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ కెప్టెన్ ధోని జట్టును నడిపించే తీరు, మమ్మల్ని ప్రోత్సహించే తీరు అద్భుతం. నేను తీసిన వికెట్లన్నీ నావి కావు. అవి మా కెప్టెన్‌కే దక్కాలి. నన్ను బౌన్సర్లు ప్రయత్నించమని అతనే ప్రోత్సహించాడు. మా జట్టు బ్యాట్స్‌మెన్‌కు కూడా ఈ విజయంలో కీలక పాత్ర ఉంది. రహానే తొలి ఇన్నింగ్స్ సెంచరీనే జట్టుకు కావాల్సిన ఊపునిచ్చింది. - ఇషాంత్ శర్మ -
మూడవ రోజు ఆట: ఇంగ్లాండ్ 352/9
నాటింగహమ్: పటౌడీ కప్ లో భాగంగా నాటింగ్ హమ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మలు విజృభించడంతో మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ 78, అండర్సన్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడవ రోజు ఆటలో భారత బౌలర్లు భువనేశ్వర్ కు 4 వికెట్లు, ఇషాంత్ శర్మ 3, షమీకి రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో రాబ్సన్ 59, బల్లాన్స్ 71, బ్రాడ్ 47 పరుగులు చేసి అవుటయ్యారు. 105 పరుగులు వెనకపడి ఉన్న ఇంగ్లాండ్ చేతిలో మరో వికెట్ ఉంది.