ఇషాంత్‌ను జ్లటాన్‌ అన్న రోహిత్‌! | Rohit Comes Up With Cheeky Throwback Photo | Sakshi
Sakshi News home page

ఇషాంత్‌ను జ్లటాన్‌ అన్న రోహిత్‌!

Published Sat, Nov 2 2019 12:14 PM | Last Updated on Sat, Nov 2 2019 12:28 PM

Rohit Comes Up With Cheeky Throwback Photo - Sakshi

ఢిల్లీ: టెస్టు ఫార్మాట్‌లో ఓపెనర్‌గా విజయవంతమైన టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మంచి జోష్‌లో ఉన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.గత జనవరి నుంచి విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో రోహిత్‌ శర్మకు సారథ్య పగ్గాలు అప్పచెప్పారు. 

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక పాత ఫోటోను పంచుకున్నాడు. ఈ ఫోటోకు రోహిత్ శర్మ .. ‘ మాతో పాటు జ్లటాన్‌ ఉన్నాడు. అతడితో ఛాటింగ్ చేయడం చాలా సరదాగా అనిపించింది’ అంటూ కామెంట్ పెట్టాడు. రోహిత్ శర్మ పోస్టు చేసిన ఫోటోలో అతడితో పాటు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మలు ఉన్నారు. అయితే, రోహిత్ మాత్రం జాట్లాన్ అని ట్వీట్ చేశాడు.జ్లటాన్‌ ఎవరో కాదు. స్వీడన్‌ మాజీ స్టార్ పుట్ బాల్ ప్లేయర్. జ్లటాన్‌ అనగానే సాకర్ అభిమానులకు ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి పోనీటైల్.

అయితే, రోహిత్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలో ఇషాంత్ శర్మ అతడిలాగే పోనీ టైల్‌తో ఉండటంతో జ్లటాన్‌ అని సంబోధించాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టీ20 అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వాయు కాలుష్య ప్రభావం ఉండటంతో ఇరు జట్ల క్రికెటర్లు కాస్త ఆందోళనలో ఉన్నారు. కాకపోతే ఇది టీ20 మ్యాచ్‌ కావడంతో పెద్దగా ఇబ్బందులు రావని అనుకుంటున్నారు.

We got zlatan amongst us. Great fun chatting 😁

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement