నాటింగ్‌హామ్: మూడో టెస్టులో టీమిండియా విజయాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బట్లర్-స్టోక్స్ మరింత ఆలస్యం చేస్తున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైనా ఈ జోడి పట్టుదలతో ఆడుతున్నారు. ఒకానొక దశలో 62 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో జట్టు బాధ్యతలను బట్లర్, స్టోక్స్ తీసుకున్నారు. టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ వికెట్లకు ఆడ్డుగోడలా నిలుస్తున్నారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ భారీ ఓటమి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జోస్ బట్లర్ జోస్ బట్లర్(70 నాటౌట్; 118 బంతుల్లో 13ఫోర్లు) అర్దసెంచరీ పూర్తిచేసి సెంచరీ వైపు పరుగులు తీస్తున్నాడు. మరో ఎండ్‌లో బ్రిటీష్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (42 నాటౌట్; 115 బంతుల్లో 5ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. లంచ్ విరామం వరకు ఇంగ్లండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు గెలవాలంటే మరో 341 పరుగులు చేయాల్సివుంది.
ఓవర్‌నైట్ స్కోర్ 23/0తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ దెబ్బతీశాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (13), అలిస్టర్ కుక్(17)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించాడు. అనంతరం ఇంగ్లండ్ సారథి జోయ్ రూట్(13) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ బుమ్రా బోల్తా కొట్టించాడు. షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి అద్భుత క్యాచ్‌తో పోప్(16) వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన బట్లర్ స్టోక్స్ ఆచితూచి ఆడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment