Ind Vs Sa: These 4 Indian Players Doubtful For SA Tour, Cause Of Injuries దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే సమయం ఆసన్నమైన వేళ టీమిండియాకు భారీ షాక్ తగిలింది. నలుగురు కీలక ఆటగాళ్లు ఈ టూర్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. వీరితో పాటు అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ సైతం సౌతాఫ్రికా టూర్ మిస్సయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా కాన్పూర్ మ్యాచ్‌లో జడేజా కుడి ముంజేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంజేయి వాపు కారణంగా జడేజా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టుకు దూరమయ్యాడు. అయితే, గాయం తీవ్రతరం కావడంతో పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
ఒకవేళ జడేజా సర్జరీకి వెళ్లాల్సి వస్తే అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక టెస్టు సిరీస్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న అక్షర్ పటేల్ సైతం స్ట్రెస్ రియాక్షన్(కీళ్ల నొప్పి) కారణంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం అతడు దక్షిణాఫ్రికా టూర్‌కు అందుబాటులో ఉంటాడా లేడా అన్న విషయం తేలనుంది.
చదవండి: IND-A vs SA-A: చెలరేగిన ఇషాన్ కిషన్, హనుమ విహారి
మరోవైపు పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న సీనియర్ సీమర్ ఇషాంత్ శర్మ సైతం జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే అతడి స్థానంలో ముంబై టెస్టుతో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ అందుబాటులో ఉండటంతో పెద్దగా సమస్యకాకపోవచ్చు.
కానీ, ఒకవేళ జడేజా, అక్షర్ పటేల్ టూర్ మిస్ అయితే మాత్రం.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు తోడుగా.. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అనధికార టెస్టులు ఆడుతున్న ఇండియా ఏ జట్టులోని షాబాజ్ నదీం, సౌరభ్ కుమార్‌ను అక్కడే ఉండాల్సిందిగా బీసీసీఐ ఆదేశించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా... ముంబై టెస్టులో గిల్ మధ్య వేలికి గాయమైన నేపథ్యంలో అతడు కూడా జట్టుకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇలా టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న కారణంగా జట్టు ఎంపిక కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకంగా మారింది.
చదవండి: Ind Vs Sa Test Seires: ప్రొటిస్ జట్టు ఇదే.. పాక్‌కు చుక్కలు చూపించిన బౌలర్ వచ్చేశాడు!
Comments
Please login to add a commentAdd a comment