హార్ధిక్‌ను ఆడిస్తేనే మేలు: లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, కరుణ్ నాయర్‌ల మధ్య తుది జట్టులో చోటు కోసం పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. అరుుతే మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం కరుణ్ నాయర్ కన్నా హార్ధిక్ ఆడితేనే జట్టుకు మేలని అభిప్రాయపడ్డారు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడాన్ని సమర్థించే లక్ష్మణ్.. పాండ్యా, షమీ కలిసి కొత్త బంతితో బౌలింగ్‌ను పంచుకోవాలని సూచించారు. అలాగే మూడో స్పిన్నర్‌గా అమిత్ మిశ్రాను ఆడించాలన్నారు. ‘ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు నేను మద్దతిస్తాను. ముగ్గురు నాణ్యమైన స్పిన్నర్లు జట్టులో ఉంటే ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది’ అని లక్ష్మణ్ వివరించారు.
ఇషాంత్ వికెట్లు తీయగలిగే బంతులు వేయాలి: కపిల్
పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్లు తీయగల బంతుల కొరత ఉందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేర్కొన్నారు. అతడు మంచి ఎత్తుతో కూడిన నాణ్యమైన పేసర్ అరుునా జట్టుకు అవసరమయ్యే విధంగా బౌలింగ్ చేయగలగాలని సూచించారు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల నైపుణ్యాన్ని అతడు పెంచుకోవాలని చెప్పారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో ఆల్‌రౌండర్లు అన్ని ఫార్మాట్లలో రాణించడం కష్టమని కపిల్ అభిప్రాయపడ్డారు.