భారత్‌తో సిరీస్ ఆడనున్న కలిస్ | jacques kallis playing with india series | Sakshi
Sakshi News home page

భారత్‌తో సిరీస్ ఆడనున్న కలిస్

Published Wed, Aug 21 2013 1:06 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

భారత్‌తో సిరీస్ ఆడనున్న కలిస్

భారత్‌తో సిరీస్ ఆడనున్న కలిస్

ప్రిటోరియా: దాదాపు ఏడాదిన్నరగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జాక్వస్ కలిస్ పునరాగమనం చేయనున్నాడు. ఈ నవంబరులో భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆడనున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌లో కనీసం ఒక్క వన్డే ప్రపంచకప్ అయినా గెలవాలనేది తన కల అని, 2015లో దానిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు.
 
 అయితే ఇప్పటినుంచి ఒక్కో సిరీస్‌కు తన ఫిట్‌నెస్‌ను అంచనా వేసుకుని... పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే మెగా టోర్నీ ఆడతానని 38 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ చెప్పాడు. 2012 ఫిబ్రవరిలో చివరిసారి వన్డే ఆడిన కలిస్... ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమింగో... ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరాడు. దాంతో కలిస్ మళ్లీ వన్డేలు ఆడాలని నిర్ణయించుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement