జాఫ్రిన్‌కు రెండు రజతాలు | jafrin won Two silver medals | Sakshi
Sakshi News home page

జాఫ్రిన్‌కు రెండు రజతాలు

Published Wed, Jun 4 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

జాఫ్రిన్‌కు రెండు రజతాలు

జాఫ్రిన్‌కు రెండు రజతాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బధిర క్రీడాకారిణి షేక్ జాఫ్రిన్ జర్మనీలో జరిగిన బధిర యూత్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. సింగిల్స్, డబుల్స్ రెండు విభాగాల్లోనూ రజత పతకాలు సాధించింది. జర్మనీలోని హంబర్గ్‌లో ఇటీవల ముగిసిన ఈ టోర్నీలో మొత్తం 9 దేశాలకు చెందిన బధిర క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో జాఫ్రిన్ సింగిల్స్, డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. టోర్నీ ఆసాంతం రాణించిన జాఫ్రిన్ తుదిమెట్టుపై చతికిలబడింది. సింగిల్స్ టైటిల్ పోరులో ఆమె 1-6, 2-6తో రష్యా అమ్మాయి స్మిర్నొవా పొలినా చేతిలో ఓడింది.
 
 అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో జాఫ్రిన్ 6-1, 6-1తో గ్రిన్ అనన్‌స్తాసియా(రష్యా)పై అలవోక విజయం సాధించి ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. డబుల్స్ ఫైనల్లో షేక్ జాఫ్రిన్-పారుల్ గుప్తా జోడి 1-6, 6-4 (2/10)తో స్మిర్నొవా పొలినా- గ్రిన్ అనన్‌స్తాసియా (రష్యా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో జాఫ్రిన్-పారుల్ గుప్తా జంట 7-6, 6-4తో జెనోసికోవా-జురయ్ జెనోసిక్ (స్లోవేకియా) ద్వయంపై గెలుపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement