40 ఏళ్ల తర్వాత... | Johanna Konta defeats Caroline Wozniacki in Miami Open final | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల తర్వాత...

Published Mon, Apr 3 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

40 ఏళ్ల  తర్వాత...

40 ఏళ్ల తర్వాత...

ఫ్లోరిడా (అమెరికా): మయామి ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బ్రిటన్‌ క్రీడాకారిణి జొహానా కోంటా మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల కోంటా 6–4, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)పై విజయం సాధించింది.

తద్వారా వర్జినియా వేడ్‌ (1977లో వింబుల్డన్‌ టైటిల్‌) తర్వాత ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్‌ సాధించిన తొలి బ్రిటన్‌ క్రీడాకారిణిగా కోంటా గుర్తింపు పొందింది. మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) 2009లో ప్రీమియర్‌ స్థాయి టోర్నీలు ప్రవేశపెట్టాక ఓ బ్రిటన్‌ క్రీడాకారిణి ఈ స్థాయి ఈవెంట్స్‌లో టైటిల్‌ సాధించడం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన కోంటాకు 11 లక్షల75 వేల 505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement