Miami Open WTA Premier tennis
-
మయామి ఓపెన్ చాంపియన్ స్వియాటెక్
పోలాండ్ టెన్నిస్ స్టార్ స్వియాటెక్ మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీ ఫైనల్లో 6–4, 6–0తో మాజీ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఈ సీజన్లో స్వియాటెక్‌కిది వరుసగా మూడో ప్రీమియర్ టైటిల్ (ఖతర్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, మయామి ఓపెన్) కావడం విశేషం. సెరెనా (అమెరికా–2013లో), వొజ్నియాకి (డెన్మార్క్–2010లో) తర్వాత ఒకే సీజన్లో వరుసగా మూడు డబ్ల్యూటీఏ–1000 టైటిల్స్ నెగ్గిన మూడో ప్లేయర్‌గా స్వియాటెక్ గుర్తింపు పొందింది. -
40 ఏళ్ల తర్వాత...
ఫ్లోరిడా (అమెరికా): మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో బ్రిటన్ క్రీడాకారిణి జొహానా కోంటా మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల కోంటా 6–4, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై విజయం సాధించింది. తద్వారా వర్జినియా వేడ్ (1977లో వింబుల్డన్ టైటిల్) తర్వాత ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ సాధించిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా కోంటా గుర్తింపు పొందింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 2009లో ప్రీమియర్ స్థాయి టోర్నీలు ప్రవేశపెట్టాక ఓ బ్రిటన్ క్రీడాకారిణి ఈ స్థాయి ఈవెంట్స్‌లో టైటిల్ సాధించడం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన కోంటాకు 11 లక్షల75 వేల 505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.