విజయానంతరం జోస్ బట్లర్
సాక్షి, పుణే: ఓపెనర్ జోస్ బట్లర్ మరో కీలక ఇన్నింగ్స్‌తో ఐపీఎల్-11వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా అత్యధిక అర్ధ శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి బట్లర్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.
మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జోస్ బట్లర్(94 నాటౌట్; 53 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మీడియాతో మాట్లాడాడు. ‘నేడు నా కల సాకారమైంది. మిడిలార్డర్‌లో ఆడే నేను ఓపెనింగ్‌లో కూడా రాణించాలనుకున్నా. ఐపీఎల్‌లో రాజస్తాన్ తరఫున ఆడి ఇది నిజం చేసుకున్నా. నా ఫామ్ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా. మిడిలార్డర్‌లో ఎక్కువగా ఆడే నేను.. ఇన్నింగ్స్ చివరివరకూ ఉండాలని ముందే నిర్ణయించుకుని బ్యాటింగ్‌కు దిగా. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారీ స్కోరు దిశగా వెళ్తున్న ముంబైని కీలక సమయంలో నిలువరించారని’ ప్రశంసించాడు.
ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్తాన్ రాయల్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆరు విజయాలు, 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరో స్థానానికి పడిపోయిన ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment