‘విక్టోరియా’ చాంప్ జోష్నా | Josh Chinnapp won in victoria open international squash tournament | Sakshi
Sakshi News home page

‘విక్టోరియా’ చాంప్ జోష్నా

Published Mon, Aug 3 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

‘విక్టోరియా’ చాంప్ జోష్నా

‘విక్టోరియా’ చాంప్ జోష్నా

మెల్‌బోర్న్: విక్టోరియా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోష్నా చిన్నప్ప విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ జోష్నా 11-5, 11-4, 11-9తో రెండో సీడ్ లైన్ హాన్సెన్ (డెన్మార్క్)ను ఓడించింది. ఈ ఏడాది జోష్నాకిదే తొలి అంతర్జాతీయ టైటిల్. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో జరిగిన రిచ్‌మండ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన జోష్నా ఆ తర్వాత ఈ టోర్నీలోనే టైటిల్ సాధించింది. విక్టోరియా ఓపెన్‌లో టైటిల్ సాధించే క్రమంలో ఈ భారత స్టార్ తన ప్రత్యర్థులకు కేవలం ఒక గేమ్‌ను మాత్రమే కోల్పోయింది. అంతేకాకుండా నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement