క్వార్టర్స్‌లో జోష్నా
ఎల్ గౌనా (ఈజిప్టు): భారత అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప పీఎస్‌ఏ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో జోష్నా 11–5, 7–11, 9–11, 11–8, 11–9తో తొమ్మిదో ర్యాంకర్ అలీసన్ వాటర్స్ (ఇంగ్లండ్)ను కంగుతినిపించింది. మరో భారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ 9–11, 10–12, 6–11తో నికోల్ డేవిడ్ (మలేసియా) చేతిలో తొలి రౌండ్‌లోనే ఓడింది.
టాప్–10లో సాక్షి, సందీప్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, సందీప్ తోమర్ టాప్–10లో చోటు సంపాదించారు. మహిళల 58 కేజీల విభాగంలో సాక్షి ఐదో స్థానాన్ని సంపాదించగా... పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సందీప్ తోమర్ ఏడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూఢిల్లీలో మేలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమవుతున్నారు.