పటిష్టస్థితిలోదక్షిణాఫ్రికా
డుమిని, ఎల్గర్ సెంచరీలు ఆసీస్‌తో తొలి టెస్టు
పెర్త్: డీన్ ఎల్గర్, జేపీ డుమిని సెంచరీ లతో... ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సరికి సఫారీ జట్టు 388 పరుగుల ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. శనివారం 104/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్‌సలో 126 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (316 బంతుల్లో 127; 17 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (225 బంతుల్లో 141; 20 ఫోర్లు, 1 సిక్స్) వాకా మైదానంలో సెంచరీల మోత మోగించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 250 పరుగులు జోడించారు. ఆట ముగిసేసమయానికి డికాక్ (16 బ్యాటింగ్), ఫిలాండర్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హజెల్‌వుడ్, సిడిల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, మార్ష్ చెరో వికెట్ తీశారు.