Duminy
-
నేడు చివరి టి20 మ్యాచ్
-
'ఫినిష్' చేసేదెవరు?
కేప్‌టౌన్‌లో మొదలైన భారత జట్టు సఫారీ ఆఖరి మజిలీగా మళ్లీ కేప్‌టౌన్ చేరింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఒక అద్భుత విజయంతో టెస్టు సిరీస్‌కు ముగింపు... ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఏకపక్షంగా వన్డే సిరీస్ సొంతం... పొట్టి ఫార్మాట్లో రెండు మ్యాచ్‌లలో సమం సమం... ఇక దక్షిణాఫ్రికా పర్యటనను సంతృప్తికరంగా ముగించి స్వదేశం తిరిగి వెళ్లేందుకు భారత్ ముందు ఆఖరి అవకాశం. మరొక్క మ్యాచ్‌లో మన ఆటగాళ్లు స్థాయికి తగ్గట్లుగా ఆడితే ఈ 51 రోజుల టూర్ ఎప్పటికీ చిరస్మరణీయంగా మారిపోతుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వన్డేల్లో పోయిన పరువును ఇక్కడైనా కాపాడుకునే ప్రయత్నంలో సిరీస్ గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా జట్టు ఆఖరి సారిగా 2015లో భారత్‌లో పర్యటించినప్పుడు టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడినా... వన్డే, టి20 సిరీస్‌లు రెండింటిని సొంతం చేసుకుంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో బదులివ్వాలంటే టీమిండియా టి20 సిరీస్ కూడా గెలుచుకోవాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నేడు న్యూలాండ్స్ మైదానంలో ఆఖరి టి20 మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సఫారీ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరగగా... ఆ మ్యాచ్‌లో దొర్లిన తప్పులను దిద్దుకొని సత్తా చాటాలని కోహ్లి సేన పట్టుదలగా ఉంది. కుల్దీప్కు చోటు! చాలా కాలంగా పరిమిత ఓవర్లలో చుక్కానిలా ఉన్న భారత్ టాపార్డర్ సెంచూరియన్‌లో అనూహ్యంగా విఫలమైంది. రోహిత్, ధావన్, కోహ్లి ముగ్గురూ ఒకేసారి తక్కువ స్కోర్లకే వెనుదిరగడం ఇటీవల ఎప్పుడూ జరగలేదు. అయితే అదీ ఒకందుకు మేలు చేసింది. మనీశ్ పాండే బ్యాటింగ్ లోతు ఏమిటో తెలియగా, తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉంటే ఏం చేయగలడో ధోని చూపించాడు. రైనా రెండు మ్యాచ్‌లలో తన విలువను చూపించాడు. మరోసారి ఈ బ్యాటింగ్ లైనప్ చెలరేగాల్సి ఉంది. కేప్‌టౌన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ మినహా ఒక్కసారి కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించలేకపోయిన పాండ్యాకు ఇది మరో అవకాశం. బౌలింగ్‌లో భువనేశ్వర్‌తో పాటు రాణించిన శార్దుల్ ఠాకూర్‌కు కూడా చోటు ఖాయం. బుమ్రా కోలుకోవడంపై ఇంకా స్పష్టత రాలేదు. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఉనాద్కట్ స్థానంలో కుల్దీప్ లేదా అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కవచ్చు. చహల్ రెండో టి20లో ఘోరంగా విఫలమైనా... అతని స్థానానికి ఢోకా లేదు. అయితే ఆ మ్యాచ్ దెబ్బకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతను తిరిగి గాడిలో పడాల్సి ఉంది. ఇప్పటికే దక్షి ణాఫ్రికా గడ్డపై అనుకున్నదానికంటే మంచి ఫలితాలు సాధించిన భారత్‌కు ఈ మ్యాచ్ చావోరేవోలాంటిదేమీ కాదు. అయితే రెండు సిరీస్ విజయాలతో తిరిగి వెళ్లాలని జట్టు కోరుకుంటుందనడంలో మాత్రం సందేహం లేదు. అమితోత్సాహంతో... రెండో టి20లో పవర్‌ప్లే ముగిసేసరికి కూడా దక్షిణాఫ్రికా విజయంపై ఎవరికీ అంచనాలు లేవు. కానీ క్లాసెన్ ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపం మార్చేసింది. డుమిని చాలా కాలం తర్వాత బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా దక్కిన గెలుపు వారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ జోరును తగ్గించరాదని, ఇదే తరహాలో ఆడి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆ జట్టూ భావిస్తోంది. వీరిద్దరితో పాటు హెన్డ్రిక్స్ దూకుడైన బ్యాటింగ్ సఫారీలకు ఇప్పుడు బలంగా మారింది. స్మట్స్ రెండు మ్యాచ్‌లలో విఫలమైనా... అతని దేశవాళీ రికార్డును బట్టి చూస్తే సంచలన ఇన్నింగ్స్ ఆడగలడని జట్టు నమ్ముతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు ఏకైక సమస్యగా మిల్లర్ మారాడు. ఐదు వన్డేల్లో 39 పరుగులే అతని అత్యధిక స్కోరు కాగా రెండు టి20ల్లోనూ విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లోనైనా చెలరేగితే టీమ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో కొత్త ఆటగాడు డాలా మెరవగా... మోరిస్, ఫెలుక్వాయో ప్రధాన పేసర్లు. అయితే సఫారీలు కూడా రెండో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. భారీగా పరుగులిచ్చిన ప్యాటర్సన్ స్థానంలో ఫాంగిసో రావచ్చు. మొత్తానికి సీనియర్లు లేని లోటు సెంచూరియన్‌లో కనిపించనివ్వని కొత్త ఆటగాళ్లు మరో విజయాన్ని అందించి తమ ఎంపికకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. సిరీస్ విజయమే లక్ష్యంగా మహిళల జట్టు బరిలోకి... దక్షిణాఫ్రికా గడ్డపై అరుదైన రెండు సిరీస్ విజయాల ఘనత సాధించేందుకు భారత మహిళల జట్టు సన్నద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్, ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2–1తో ముందంజలో నిలిచింది. నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేప్‌టౌన్‌లోనే నేడు జరిగే ఆఖరి మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని తేల్చనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాసంగా నెగ్గిన హర్మన్ బృందం మూడో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడింది. ఆఖరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంటే భారత మహిళల జట్టు ప్రస్థానంలో మరో కీలక మైలురాయి కాగలదు. ►మరో 17 పరుగులు చేస్తే టి20ల్లో కోహ్లి 2 వేల పరుగులు పూర్తవుతాయి. ► ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 8 మ్యాచ్‌లు ఆడి 5 ఓడింది. మరోవైపు భారత్ న్యూలాండ్స్‌లో ఒక్క టి20 కూడా ఆడలేదు. ఇదే తొలి మ్యాచ్. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రైనా, పాండే, ధోని, పాండ్యా, భువనేశ్వర్, చహల్, ఠాకూర్, కుల్దీప్/అక్షర్ పటేల్. దక్షిణాఫ్రికా: డుమిని (కెప్టెన్), హెన్డ్రిక్స్, స్మట్స్, క్లాసెన్, మిల్లర్, బెహర్దీన్, ఫెలుక్వాయో, మోరిస్, డాలా, షమ్సీ, ప్యాటర్సన్/ఫాంగిసో. పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. భారీ స్కోరుకు తగిన వేదిక. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉన్నా తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ► రాత్రి గం. 9.30 నుంచి సోనీ టెన్–1, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
క్లాసెన్ కొట్టేశాడు
వన్డే సిరీస్‌లో భారత్ ఏకైక ఓటమికి కారణమైన హెన్రిక్ క్లాసెన్ టి20 మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపం చూపించాడు. భారీ స్కోరు చేసిన తర్వాత గెలుపుపై భారత్ ఆశలు పెంచుకున్న మ్యాచ్‌ను ఒంటి చేత్తో లాగేశాడు. సప్త సిక్సర్లతో చెలరేగి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్లాసెన్ జోరుకు చేతులెత్తేసిన యజువేంద్ర చహల్ రికార్డు స్థాయిలో పరుగులిచ్చి పరాభవంలో కీలక పాత్రగా మారాడు. క్లాసెన్‌కు తోడుగా కెప్టెన్ డుమిని కూడా జోరు ప్రదర్శించడంతో మిగతా భారత బౌలర్లూ అసహాయంగా ఉండిపోయారు. అంతకుముందు పాండే చక్కటి బ్యాటింగ్, ధోని మెరుపు ప్రదర్శన కూడా తుది ఫలితం తర్వాత వెనక్కి వెళ్లిపోయాయి. ఇక పర్యటనలో ఆఖరి వేదికలాంటి చివరి టి20తోనే సిరీస్ విజేత ఎవరో తేలనుంది. సెంచూరియన్: టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా కోలుకొని కీలక గెలుపును అందుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మనీశ్ పాండే (48 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోని (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 56 బంతుల్లోనే అభేద్యంగా 98 పరుగులు జోడించడం విశేషం. అనంతరం దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసెన్ (30 బంతుల్లో 69; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... జేపీ డుమిని (40 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. తాజా ఫలితంతో సిరీస్ ప్రస్తుతం 1–1తో సమమైంది. చివరిదైన మూడో టి20 ఈ నెల 24న కేప్‌టౌన్‌లో జరుగుతుంది. మెరుపు భాగస్వామ్యం... రెండు మెయిడిన్ ఓవర్లు... మూడు వికెట్లు... అద్భుతమైన స్వింగ్ బౌలింగ్... బౌండరీల జోరు... ఇవన్నీ భారత ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో విశేషాలు. మోరిస్ వేసిన తొలి ఓవర్లో ధావన్ పరుగులేమీ చేయకపోగా, డాలా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే రోహిత్ శర్మ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే తర్వాతి రెండు ఓవర్లలో భారత్ చెలరేగి 32 పరుగులు చేసింది. మోరిస్ వేసిన మూడో ఓవర్లో ధావన్ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టి లెక్క సరి చేయగా... తర్వాతి ఓవర్లో రైనా మూడు ఫోర్లు బాదాడు. కానీ ఎనిమిది బంతుల వ్యవధిలో ధావన్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కోహ్లి (1) వికెట్లు కోల్పోయి భారత్ ఇన్నింగ్స్ తడబాటుకు గురైంది. కోహ్లి వెనుదిరిగాక తర్వాతి 18 బంతుల్లో భారత్ ఒక ఫోర్ మాత్రమే కొట్టగలిగింది. ఈ దశలో షమ్సీ ఓవర్లో పాండే 2 భారీ సిక్సర్లు, ఫోర్ కొట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రైనా (24 బంతుల్లో 31; 5 ఫోర్లు)ను ఫెలుక్వాయో అవుట్ చేయడంతో 45 పరుగుల (31 బంతుల్లో) నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన పాండే 33 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అనంతరం మరో ఎండ్‌లో ధోని తనదైన శైలిలో చెలరేగాడు. చాలా కాలంగా దూకుడుకు దూరమైన ఈ మాజీ కెప్టెన్ చివరి రెండు ఓవర్లలో తన ప్రతాపం చూపించాడు. 19వ ఓవర్లో ఒక ఫోర్, సిక్సర్ కొట్టిన అతను... ప్యాటర్సన్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 4, 4తో విరుచుకు పడ్డాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే కెరీర్లో రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేసిన భారత్... తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 103 పరుగులు సాధించడం విశేషం. అనారోగ్యానికి గురైన బుమ్రా స్థానంలో భారత్ ఈ మ్యాచ్‌లో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. క్లాసిక్ ఇన్నింగ్స్... ఛేదనలో దక్షిణాఫ్రికాకు కూడా సరైన ఆరంభం లభించలేదు. తొలి రెండు ఓవర్లలో ఆ జట్టు 3 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత హెన్డ్రిక్స్ (17 బంతుల్లో 26; 5 ఫోర్లు) తాను ఆడిన ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే స్మట్స్ (2), హెన్డ్రిక్స్ తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఈ దశలో డుమిని, క్లాసెన్ భాగస్వామ్యం సఫారీని ముందంజలో నిలిపింది. ముఖ్యంగా క్లాసెన్ అద్భుతమైన షాట్లతో చెలరేగాడు. ఉనాద్కట్ వేసిన ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను, చహల్ బౌలింగ్‌లో విరుచుకు పడ్డాడు. చహల్ తొలి ఓవర్లో సిక్సర్ కొట్టిన క్లాసెన్, అతని రెండో ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లోనే క్లాసెన్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత కూడా చహల్‌ను వదలకుండా మరుసటి ఓవర్లో వరుసగా 6, 6, 4తో బెంబేలెత్తించాడు. అదే ఓవర్లో డుమిని కూడా మరో సిక్సర్ కొట్టడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి ఓవర్ తొలి బంతికే క్లాసెన్‌ను అవుట్ చేసిన జైదేవ్ ఉనాద్కట్ భారత్‌కు కీలక వికెట్ అందించాడు. అయితే డుమిని, బెహర్దీన్ (16 నాటౌట్) ఐదో వికెట్‌కు 48 పరుగులు జత చేసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించారు. ►64 చహల్ 4 ఓవర్లలో ఇచ్చిన పరుగులు. అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున ఇదే అత్యంత చెత్త ప్రదర్శన. గతంలో జోగిందర్ శర్మ (57) పేరిట ఉన్న రికార్డును చహల్ సవరించాడు. ►73 పేసర్ శార్దుల్ ఠాకూర్ ఈ మ్యాచ్‌తో టి20ల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన 73వ ఆటగాడు శార్దుల్. -
ఆమ్లా, డుమిని సెంచరీలు
• దక్షిణాఫ్రికా 338/3 • శ్రీలంకతో మూడో టెస్టు జొహన్నెస్‌బర్గ్: శ్రీలంకతో గురువారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే దక్షిణాఫ్రికా భారీ స్కోరుతో చెలరేగింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. కెరీర్లో వందో టెస్టు ఆడుతున్న హషీం ఆమ్లా (221 బంతుల్లో 125 బ్యాటింగ్; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, మరో బ్యాట్స్‌మన్ జేపీ డుమిని (221 బంతుల్లో 155; 19 ఫోర్లు) కూడా శతకం అందుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 292 పరుగులు జోడించడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తక్కువ వ్యవధిలో ఓపెనర్లు కుక్ (10), ఎల్గర్ (27) వికెట్లు కోల్పోయింది. అయితే ఆమ్లా, డుమిని కలిసి లంక బౌలర్లపై చెలరేగారు. ఈ క్రమంలో డుమిని 140 బంతుల్లో కెరీర్లో ఆరో సెంచరీని, ఆమ్లా 169 బంతుల్లో కెరీర్లో 26వ సెంచరీని అందుకున్నారు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. గతంలో కౌడ్రీ, మియాందాద్, గ్రీనిడ్జ్, స్టివార్ట్, ఇంజమామ్, పాంటింగ్ (రెండు ఇన్నింగ్స్‌లలోనూ), గ్రేమ్ స్మిత్ ఈ ఘనత సాధించారు. లహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆమ్లాతో పాటు ఒలివర్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. -
శ్రీలంకతో తొలి టెస్టు: దక్షిణాఫ్రికా 267/6
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ (4/62) నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఫలితంగా తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు సోమవారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో ఆరు వికెట్లకు 267 పరుగులు చేసింది. జేపీ డుమిని (63; 10 ఫోర్లు), స్టీఫెన్ కుక్ ( 59; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. -
పటిష్టస్థితిలోదక్షిణాఫ్రికా
డుమిని, ఎల్గర్ సెంచరీలు ఆసీస్‌తో తొలి టెస్టు పెర్త్: డీన్ ఎల్గర్, జేపీ డుమిని సెంచరీ లతో... ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితికి చేరింది. మూడో రోజు ఆట ముగిసే సరికి సఫారీ జట్టు 388 పరుగుల ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. శనివారం 104/2 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్సలో 126 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్ (316 బంతుల్లో 127; 17 ఫోర్లు, 1 సిక్సర్), డుమిని (225 బంతుల్లో 141; 20 ఫోర్లు, 1 సిక్స్) వాకా మైదానంలో సెంచరీల మోత మోగించారు. ఇద్దరు మూడో వికెట్‌కు 250 పరుగులు జోడించారు. ఆట ముగిసేసమయానికి డికాక్ (16 బ్యాటింగ్), ఫిలాండర్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హజెల్‌వుడ్, సిడిల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, మార్ష్ చెరో వికెట్ తీశారు. -
డుప్లెసిస్ అజేయ సెంచరీ
దక్షిణాఫ్రికా 481/8 డిక్లేర్డ్ న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సెంచూరియన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డు ప్లెసిస్ (234 బంతుల్లో 112 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 481/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. 283/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు భారీ స్కోరుకు డుమినీ (88), డు ప్లెసిస్ బాటలు వేశారు. లోయర్ ఆర్డర్లో వాన్ జిల్ 35 పరుగులు చేశాడు. వాగ్నెర్‌కు 5 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 38 పరుగులు చేసింది. గప్టిల్ (8), లాథమ్ (4), టేలర్ (1) నిరాశపరిచారు. విలియమ్సన్ (15 బ్యాటింగ్), నికోల్స్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా జహీర్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు పేసర్ జహీర్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ తరఫున జహీర్‌కు ఇది రెండో సీజన్ కాగా.. గత సీజన్లో డుమిని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కొత్త బాధ్యతలపట్ల జహీర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. కచ్చితంగా ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లతో మంచి ఫలితాలను సాధిస్తాను. తమ శక్తిసామర్థ్యాల మేరకు అందరూ ఆడితే నిలకడైన ఫలితాలు వస్తాయి’ అని జహీర్ అన్నాడు. మరోవైపు టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ కూడా జహీర్ నియామకాన్ని హర్షించారు. చాలాకాలంగా జహీర్ సమర్థవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడని, భారత క్రికెట్‌ను అనుసరించేవారికి జహీర్ ప్రభావమేమిటో తెలుస్తుందని గుర్తు చేశారు. -
డుమిని, మోర్కెల్ ఫిట్
బెంగళూరు: భారత్‌తో తొలి టెస్టులో దారుణంగా ఓడిన దక్షిణాఫ్రికాకు రెండో టెస్టుకు ముందు ఊరట లభించింది. గాయాల కారణంగా తొలి టెస్టు ఆడని ఆల్‌రౌండర్ డుమిని, పేసర్ మోర్నీ మోర్కెల్ 14 నుంచి జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారని ఆ జట్టు తెలిపింది. అయితే తొలి టెస్టులో గాయపడ్డ స్టెయిన్ ఆ సమయానికి కోలుకోకపోవచ్చు. రెండో ర్యాంక్‌లోనే భారత్ దుబాయ్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఓడినప్పటికీ భారత్ జట్టు ఐసీసీ ర్యాంక్ మాత్రం మారలేదు. ప్రస్తుతం ధోని సేన 114 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో ఉండగా... ఆస్ట్రేలియా 127 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
కావాలి... ‘విజయ’ దశమి
నేడు దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డే భారత్‌కు చావోరేవో సిరీస్‌పై సఫారీల దృష్టి దేశమంతా నేడు పండగ. గొప్ప విజయాన్ని ఆస్వాదించే సంబరం. మరి క్రికెట్ ను ఆరాధించే అభిమానుల సంగతేంటి..? దక్షిణాఫ్రికా జట్టు మన గడ్డపై అడుగుపెట్టిన దగ్గర్నించి భారత క్రికెటర్లు విజయం కోసం ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఇప్పుడు అసలు సమయం వచ్చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితి ఎదురైంది. మరి ఈ పండగ పూటైనా మన హీరోలు చెలరేగుతారా..? అభిమానులకు విజయ దశమిని మిగులుస్తారా... లేక మరో పరాభవాన్ని రుచి చూపిస్తారా..? చెన్నై: దక్షిణాఫ్రికా చేతిలో టి20 సిరీస్ కోల్పోయిన భారత్, వన్డే సిరీస్ కూడా చేజారకుండా ఉండాలంటే రెట్టింపు శ్రమించాల్సిన పరిస్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన ధోని సేన చావోరేవోలాంటి పోరుకు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడి చిదంబరం స్టేడియంలో జరిగే నాలుగో వన్డేలో భారత్ జట్టు సఫారీలతో తలపడుతుంది. మూడు మ్యాచ్‌లలోనూ బ్యాటింగ్ వైఫల్యమే భారత్‌ను దెబ్బతీయడంతో ఈ సారైనా మన లైనప్ నిలబడుతుందా అనేది చూడాలి. మరో వైపు ప్రధాన ఆటగాడు డుమిని దూరం కావడంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా బలహీనంగా మారింది. ముగ్గురు స్పిన్నర్లతోనే: ఎట్టకేలకు గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వచ్చినా భారత్ విజయానికి ఆ ప్రదర్శన సరిపోలేదు. తనకిష్టమైన మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాణించిన కోహ్లి, దీనిని కొనసాగించాల్సి ఉంది. రోహిత్ ఫామ్ అద్భుతంగా కొనసాగుతుండగా, ఓపెనింగ్ సహచరుడు ధావన్ 3 ఇన్నింగ్స్‌లలో కలిపి 59 పరుగులు మాత్రమే చేయగలగడం జట్టు శుభారంభాన్ని దెబ్బ తీస్తోంది. అందరికి మించి 3, 0, 0 పరుగులు చేసిన రైనా కోలుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక ఉండదు. తనకు సొంత మైదానంతో సమానమైన చేపాక్‌లో చెలరేగడం భారత్‌కు ఎంతో అవసరం. గతంతో పోలిస్తే ధోని బ్యాటింగ్ శైలి మారింది. ఇండోర్ వన్డేలో అతని అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... గత మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో అతి జాగ్రత్తగా ఆడి ఒత్తిడి పెంచుకోవడం ధోనినుంచి ఊహించలేనిది. అతను మరోసారి నాలుగో స్థానంలోనే బరిలోకి దిగాలని భావిస్తుండగా... రహానే పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారైంది. రెండు అర్ధ సెంచరీల తర్వాత ఆరో స్థానంలో చివర్లో వేగంగా ఆడలేక విఫలమైన రహానేను ఈ సారి ఎక్కడ ఆడిస్తారో చూడాలి. బౌలింగ్‌లో మన స్పిన్నర్లు ముగ్గురూ హర్భజన్, అక్షర్, మిశ్రా రాణించారు కాబట్టి మరోసారి స్పిన్‌ను నమ్ముకోవచ్చు. పేసర్ అరవింద్‌కు తొలి వన్డే ఆడే అవకాశం ఉంది. మోరిస్‌కు చాన్స్: టి20ల్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన డుమిని వన్డేల్లోనూ కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కోట్‌లో మధ్య ఓవర్లలో అతని స్పిన్ బౌలింగ్ వల్లే భారత్ ఓడిందనేది స్పష్టం. అయితే గాయంతో డుమిని దూరం కావడం సఫారీలకు పెద్ద దెబ్బ. అతని స్థానంలో ఎంపికైన ఎల్గర్, బుధవారం ఉదయమే జట్టుతో చేరడంతో మ్యాచ్‌లో ఆడే అవకాశాలు తక్కువ. కాబట్టి బౌలింగ్ ఆల్‌రౌండర్ మోరిస్ లేదా కొత్త బ్యాట్స్‌మన్ జోండోలలో ఒకరిని ఎంపిక చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. అయితే ఎవరు వచ్చినా డుమిని స్పిన్ బలాన్ని మాత్రం ఆ జట్టు కోల్పోతుంది. ఫలితంగా బెహర్దీన్ ఎక్కువ ఓవర్లు వేయాల్సి రావడం భారత్‌కు లాభించే అంశం. ప్రధాన పేసర్లు స్టెయిన్, మోర్కెల్, రబడ రాణిస్తే ఆ జట్టుకు ఇబ్బంది ఉండదు. తాహిర్ కూడా బాగానే ప్రభావం చూపిస్తున్నాడు. అయితే గత మ్యాచ్‌లో చిన్న గాయానికి గురైన మోర్కెల్ కోలుకోకపోతే అబాట్ జట్టులోకి వస్తాడు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఫర్వాలేదనిపించిన మిల్లర్ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది. డివిలియర్స్, డు ప్లెసిస్ ఫామ్‌లో ఉండగా, ఆమ్లా వైఫల్యంపై జట్టు ఆందోళన పడుతోంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగానే కనిపిస్తున్నా...ఇక్కడి వికెట్‌పై స్పిన్‌ను ఎలా ఎదుర్కొంటారనేదానిపైనే సఫారీల సిరీస్ అవకాశాలు నిలిచి ఉంటాయి. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, అక్షర్, హర్భజన్, మిశ్రా, భువనేశ్వర్, అరవింద్. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డి కాక్, డు ప్లెసిస్, బెహర్దీన్, మిల్లర్, మోరిస్, స్టెయిన్, రబడ, తాహిర్, మోర్కెల్/అబాట్. ఎలాగైనా మేం ఈ మ్యాచ్ గెలవాల్సిందే. పరిస్థితులను మార్చగల సత్తా ఈ జట్టుకు ఉంది. గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే మేం మరింత తెలివిగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. మా స్పిన్నర్లు సింగిల్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. అటాకింగ్ చేస్తూ కొన్ని పరుగులు ఇచ్చినా వికెట్ దక్కితే మ్యాచ్ దిశ మారుతుంది. కాబట్టి ఏం చేసినా జట్టు విజయం కోసమే. పోలీసు కేసుతో మ్యాచ్‌కు సంబంధం లేదు. మిశ్రా ఈ వన్డేకు అందుబాటులోనే ఉన్నాడు. -హర్భజన్ సింగ్ మేం టి20 సిరీస్ గెలిచినా ఇవాళ వన్డే కూడా గెలుస్తామని అతి విశ్వాసంతో లేము. ఒక్క రోజులో పరిస్థితి తలకిందులు కావచ్చు. కాబట్టి మేం వంద శాతం శ్రమిస్తాం. అయితే విదేశాల్లో బాగా ఆడాలని మేం గట్టి పట్టుదలతో ఇక్కడికి వచ్చాం. ఫలితాలు అన్నీ అనుకూలంగా రావడం సంతోషం. సిరీస్ గెలిచే అవకాశాన్ని పోగొట్టుకోం. ఆధిక్యంలో ఉన్నాం కాబట్టి మాపై ఒత్తిడి లేదు. భారత్‌కు వచ్చి రెండు వారాలు దాటింది కాబట్టి చెన్నైలో వేడి గురించి ఆందోళన లేదు. ఇక్కడి పిచ్‌లపై నిలకడగా వికెట్లు తీయలేకపోయినా మా పేసర్లే మా ప్రధానం బలం. -స్టెయిన్ -
ధర్మశాల దద్దరిల్లింది
తొలి టి20లో పరుగుల వరద 7 వికెట్లతో భారత్ పరాజయం రోహిత్ సెంచరీ వృథా దక్షిణాఫ్రికాను గెలిపించిన డుమిని రెండో టి20 సోమవారం హిమాలయాల చలి మంచులో బ్యాట్స్‌మెన్ భారీ షాట్లతో వేడి పుట్టిస్తుంటే... పక్కనే శిఖరాన్ని తాకుతాయా అనే రీతిలో సిక్సర్లు దూసుకుపోతుంటే... ధర్మశాల మైదానంలో పరుగుల వరద పారింది. ఒకరితో పోటీ పడుతూ మరొకరు... ఒకరిని మించి మరొకరు చెలరేగుతూ రసవత్తర పోరు సాగించారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరుతో శతక్కొడితే... నేనూ ఉన్నానంటూ డివిలియర్స్ దడ పుట్టించాడు. అయితే ఆఖరి పంచ్ మాత్రం డుమినిదే. దక్షిణాఫ్రికా విజయానికి ఏ మాత్రం ఆశలు లేని స్థితినుంచి సిక్సర్ల మోతతో తమ జట్టుకు గెలుపు కిక్ అందించాడు. భారత జట్టు ఓడిపోయినా... సొంతగడ్డపై దాదాపు ఏడాది తర్వాత జరిగిన మ్యాచ్ అభిమానులకు సంపూర్ణ విందు భోజనాన్ని అందించింది. గాంధీ-మండేలా ‘కాయిన్’ గాంధీ-మండేలా సిరీస్ మ్యాచ్‌లలో టాస్ వేసేందుకు బీసీసీఐ వీరిద్దరి బొమ్మలతో ప్రత్యేక నాణెం తయారు చేయించింది. బంగారు పూత కలిగిన ఈ వెండి నాణాన్ని ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు టాస్ కోసం ఉపయోగించడంతో పాటు భవిష్యత్తులో ఇరు జట్ల మధ్య సిరీస్‌లకు ఇదే తరహా నాణాన్ని ఉపయోగిస్తారు. శుక్రవారం తొలి టి20 మ్యాచ్ సందర్భంగా దీనిని ప్రవేశ పెట్టారు. ఇందులో బొమ్మ వైపు గాంధీ, మండేలా చిత్రాలు ఉండగా... బొరుసు వైపు ఫ్రీడం సిరీస్ అని రాసి ఉంటుంది. ధర్మశాల: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఊహించినట్లుగానే బ్రహ్మాండమైన ఆరంభం లభించింది. హోరాహోరీగా సాగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో చివరకు సఫారీలదే పైచేయి అయింది. శుక్రవారం ఇక్కడి జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (66 బంతుల్లో 106; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లి (27 బంతుల్లో 43; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 74 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జేపీ డుమిని (34 బంతుల్లో 68 నాటౌట్; 1 ఫోర్, 7 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు... డివిలియర్స్ (32 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా చెలరేగాడు. డుమిని, బెహర్దీన్ (23 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) 55 బంతుల్లోనే అభేద్యంగా 105 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ సోమవారం కటక్‌లో జరుగుతుంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 ఆధిక్యంలో ఉన్నారు. సూపర్ హిట్ బ్యాటింగ్: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత జట్టులో శ్రీనాథ్ అరవింద్‌కు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ఒక వైపు రోహిత్ శర్మ ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లతో భారత్‌కు మెరుగైన ఆరంభం అందించినా...సమన్వయ లోపంతో ధావన్ (3) రనౌట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తాహిర్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో కోహ్లి 2, రోహిత్ 1 సిక్సర్ బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 39 బంతుల్లోనే రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు కోహ్లి కూడా ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయాడు. లాంగాఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 62 బంతుల్లో టి20 కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత అబాట్ ఒకే ఓవర్లో వీరిద్దరిని అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త తెరిపిన పడింది. చివర్లో మరి కొన్ని పరుగులు జోడించిన ధోని (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సిక్సర్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 41 పరుగులే చేయగలిగింది. సెంచరీ భాగస్వామ్యం: దక్షిణాఫ్రికాకు కూడా ఓపెనర్లు ఆమ్లా, డివిలియర్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. ముగ్గురు పేసర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. అయితే లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి ఆమ్లా రనౌట్ కావడంతో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. కొద్ది సేపటికే 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డివిలియర్స్‌ను అశ్విన్ అద్భుత బంతితో బౌల్డ్ చేయడంతో భారత్ కోలుకుంది. ఆ వెంటనే అరవింద్ తన తొలి వికెట్‌గా డు ప్లెసిస్ (4)ను అవుట్ చేశాడు. ఆరంభంలో ప్రతీ పరుగు కోసం తడబడ్డ డుమిని, బెహర్దీన్ ఆ తర్వాత నిలదొక్కుకున్నారు. అయితే అక్షర్ వేసిన 16వ ఓవర్లో డుమిని వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తర్వాతి నాలుగు ఓవర్లలో చెలరేగి వీరిద్దరు 44 పరుగులు జోడించడంతో భారత్ ఓటమి ఖాయమైంది. 2 భారత్ తరఫున టి20ల్లో సెంచరీ నమోదు చేసిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. గతంలో రైనా కూడా దక్షిణాఫ్రికాపైనే శతకం బాదాడు. ఈ మ్యాచ్‌తో రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన ఆటగాడయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో బ్యాట్స్‌మన్. ఈ ఇన్నింగ్స్‌తో వన్డేలు, టి20ల్లోనూ అతను భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. 1 రోహిత్, కోహ్లి నెలకొల్పిన 138 పరుగుల భాగస్వామ్యం టి20ల్లో భారత్‌కు అత్యుత్తమం. గతంలో గంభీర్, సెహ్వాగ్ (136) రికార్డును వీరు సవరించారు. 1 టి20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడు విరాట్ కోహ్లి. ప్రపంచ క్రికెట్లో అందరికంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో (27) అతను ఈ ఘనత సాధించాడు. 50 అంతర్జా తీయ క్రికెట్లో 50 టి20 మ్యాచ్‌లకు సారథ్యం వహిం చిన తొలి కెప్టెన్ ధోని స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోరిస్ (బి) అబాట్ 106; ధావన్ (రనౌట్) 3; కోహ్లి (సి) డుమిని (బి) అబాట్ 43; రైనా (ఎల్బీ) (బి) మోరిస్ 14; ధోని (నాటౌట్) 20; రాయుడు (రనౌట్) 0; అక్షర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1-22; 2-160; 3-162; 4-184; 5-184. బౌలింగ్: అబాట్ 4-0-29-2; రబడ 4-0-32-0; డి లాంజ్ 4-0-47-0; మోరిస్ 4-0-46-1; తాహిర్ 3-0-35-0; డుమిని 1-0-8-0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (రనౌట్) 36; డివిలియర్స్ (బి) అశ్విన్ 51; డు ప్లెసిస్ (బి) అరవింద్ 4; డుమిని (నాటౌట్) 68; బెహర్దీన్ (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1-77; 2-93; 3-95. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-40-0; అరవింద్ 3.4-0-44-1; మోహిత్ 4-0-40-0; అక్షర్ 4-0-45-0; అశ్విన్ 4-0-26-1. -
సఫారీలపై బంగ్లా పంజా
♦ మూడో వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు ♦ సిరీస్ 2-1తో బంగ్లాదేశ్ సొంతం చిట్టగాంగ్ : పాక్‌పై సిరీస్ గెలిస్తే ప్రత్యర్థి బలహీనమన్నారు... భారత్‌ను ఓడిస్తే ఎప్పుడో ఒకసారి కలిసొచ్చిన అదృష్టం అన్నారు... కానీ ఇప్పుడు పటిష్ట దక్షిణాఫ్రికాపై కూడా బంగ్లా పులులు పంజా విసిరారు. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో బంగ్లా ఏకంగా 9 వికెట్ల తేడాతో, మరో 83 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఫలితంగా సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. సొంతగడ్డపై బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్లకు 168 పరుగులు చేసింది. డుమిని (70 బంతుల్లో 51; 3 ఫోర్లు), మిల్లర్ (51 బంతుల్లో 44; 5 ఫోర్లు) రాణించారు. షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా, ముస్తఫిజుర్, రూబెల్కు చెరో 2 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 26.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 170 పరుగులు చేసి (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయాన్నందుకుంది. సౌమ్య సర్కార్ (75 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడగా, తమీమ్ ఇక్బాల్ (77 బంతుల్లో 61; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 154 పరుగులు జోడించడం విశేషం.