
లండన్: ఏడాది నిషేధం తర్వాత ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌పై ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల జల్లు కురిపించాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టీవ్ స్మిత్ ఐపీఎల్‌లో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటాడు. ఐపీఎల్ అనంతరం ప్రపంచకప్‌పై దృష్టి పెట్టిన స్మిత్ నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రపంచకప్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న ఆసీస్ జట్టు కఠోర సాధన చేస్తోంది.
అయితే ప్రాక్టీస్‌లో భాగంగా స్మిత్ బ్యాటింగ్‌కు లాంగర్ ఫిదా అయ్యాడు. ఆసీస్ ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. స్మిత్ బ్యాటింగ్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. స్మిత్ బ్యాటింగ్ చూస్తుంటే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గుర్తుకొస్తున్నాడంటూ లాంగర్ పేర్కొన్న కామెంట్‌ను జత చేసింది. ముఖ్యంగా కౌల్టర్‌నైల్ బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్ సచిన్‌ను మైదానంలో మళ్లీ చూసినట్లుందని లాంగర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హలచల్ చేస్తున్నాయి. లాంగర్ కామెంట్స్‌కు సచిన్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment