సాక్షి, హైదరాబాద్: ఏయూ తైక్వాండో అంతర్జాతీయ చాంపియన్‌షిప్‌లో వైఎంసీఏ నారాయణగూడ యామగుచి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో యామగుచి ప్లేయర్లు 3 పతకాలను సాధించారు. అకాడమీకి చెందిన కరణ్ స్వర్ణంతో మెరవగా... ఎస్.ఎన్. పూజ, మహాదేవ్ చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను యామగుచి తైక్వాండో అకాడమీ శుక్రవారం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు ఆర్‌కే కృష్ణ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, కార్యదర్శులు పి. సంధ్య స్మిత, బీజే వినయ్ స్వరూప్, కోచ్ డి. విశ్వనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment