బాస్కెట్‌బాల్‌ జాతీయ శిబిరానికి కార్తీక్‌ | Karthik in Basket Ball National Camp | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ జాతీయ శిబిరానికి కార్తీక్‌

Published Thu, Jun 13 2019 1:52 PM | Last Updated on Thu, Jun 13 2019 1:52 PM

Karthik in Basket Ball National Camp - Sakshi

హైదరాబాద్‌: ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఖాజాగూడ) విద్యార్థి కార్తీక్‌ చద్దా జాతీయ బాస్కెట్‌బాల్‌ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన అండర్‌–16 బాస్కెట్‌బాల్‌ సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన కార్తీక్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బెంగళూరులో జరుగనున్న ఈ శిబిరానికి కార్తీక్‌తో పాటు మరో 24 మంది ఎంపికయ్యారు. ఈ శిబిరంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన 12 మంది క్రీడాకారులకు జాతీయ జట్టులో చోటు దక్కుతుంది. బంగ్లాదేశ్‌లో జూలై 3 నుంచి 7 వరకు జరుగనున్న దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ అండర్‌–16 క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఈ జట్టు పాల్గొంటుంది.

ప్రస్తుతం ఓక్రిడ్జ్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోన్న కార్తీక్‌ స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ డేవిడ్‌ రాజ్‌కుమార్‌ పర్యవేక్షణలో కోచ్‌లు కిశోర్, శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో బాస్కెట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఈ సందర్భంగా డేవిడ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో రాణించి కార్తీక్‌ జాతీయ అండర్‌–16 జట్టుకు ఎంపికవుతాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement