కశ్యప్‌కు చుక్కెదురు | kashyap loss the match | Sakshi
Sakshi News home page

కశ్యప్‌కు చుక్కెదురు

Published Thu, Feb 27 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

కశ్యప్‌కు చుక్కెదురు

కశ్యప్‌కు చుక్కెదురు


 న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌కు ఊహించని ఓటమి ఎదురైంది.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ కశ్యప్ 19-21, 18-21తో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుతో ప్రణయ్ 2010 ఇండియా గ్రాండ్‌ప్రి  టోర్నీలో కశ్యప్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

 

భారత్‌కే చెందిన ఆనంద్ పవార్, అరవింద్ భట్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌లో ఆనంద్ పవార్ 21-16, 21-12తో ఉత్రోసా (స్లొవేనియా)పై నెగ్గగా... అరవింద్ భట్ 21-17, 16-21, 21-11తో ప్రపంచ 10వ ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను కంగుతినిపించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement