ఎనిమిదో సీడ్‌గా శ్రీకాంత్
టోక్యో: హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ జపాన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. నేడు (మంగళవారం) క్వాలిఫయింగ్ పోటీలు, బుధవారం నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతారుు. రియో ఒలింపిక్స్ తర్వాత శ్రీకాంత్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మెయిన్ డ్రా మొదటి రౌండ్లో అతను క్వాలిఫయర్‌తో తలపడనున్నాడు. గాయంతో ఆటకు దూరమై ర్యాంకింగ్‌ను కోల్పోయి పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లో తలపడనున్నాడు. తొలిరౌండ్లో అతను డేవిడ్ ఒబెర్నోస్టెర్ (ఆస్ట్రియా)తో పోటీపడతాడు. మహిళల క్వాలిఫయింగ్‌లో తన్వీలాడ్... జపాన్‌కు చెందిన కిసాటో హొషిని ఢీకొంటుంది.
పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో ప్రపంచ 18వ ర్యాంకర్ అజయ్ జయరామ్... సోని ద్వి కుంకోరోతో (ఇండోనేసియా), సారుు ప్రణీత్... గ క లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో, ప్రణయ్... ఇస్కందర్ జుల్కర్‌నెన్ (మలేసియా)తో తలపడతారు. డబుల్స్, మహిళల సింగిల్స్ మెయిన్ డ్రాలో భారత క్రీడాకారులెవరూ ఆడటం లేదు.