
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. పంజాబ్ ఓపెనర్లు క్రిస్ గేల్, కేఎల్ రాహుల్‌లు పంజాబ్‌కు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 96 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ఈ క‍్రమంలోనే గేల్(గేల్(63; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, రాహుల్(37;22 బంతుల్లో 7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. ఆపై మయాంక్ అగర్వాల్(30; 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), యువరాజ్ సింగ్ (20;13 బంతుల్లో 2 ఫోర్లు 1సిక్స్), కరుణ్ నాయర్(29; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) లు బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహీర్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్, షేన్ వాట్స్‌న్, డ్వేన్ బ్రేవోలు తలో వికెట్ తీశారు.
క్రిస్ గేల్ దూకుడు
కింగ్స్ పంజాబ్ ఆడిన రెండు మ్యాచ్‌లకు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన క్రిస్ గేల్.. ఆ జట్టు ఆడే మూడో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టోనిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన గేల్ తన విలువ ఏమిటో చూపించాడు. తన దైన స్టైయిల్‌లో భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. బౌండరీలే లక్ష్యంగా ధాటిగా బ్యాటింగ్ చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన గేల్.. షేన్ వాట్సన్ వేసిన స్లో బంతికి వికెట్‌ను సమర్పించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment