
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు అరోన్ ఫించ్ గోల్డెన్ డక్‌గా అవుటయ్యాడు. తాను ఎదుర్కొన తొలి బంతికే వికెట్లు ముందు దొరికిపోయాడు. ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో సైతం ఫించ్ గోల్డెన్ డక్‌గా ఔటైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కూడా ఫించ్ ఎల్బీగానే పెవిలియన్ చేరడం గమనార్హం.
చెన్నైతో మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు లోకేశ్ రాహుల్, క్రిస్ గేల్‌ల జోడి 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. తొలి వికెట్‌గా రాహుల్(37;22 బంతుల్లో 7 ఫోర్లు) ఔట్ కాగా, గేల్(63; 33 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరి దూకుడుతో కింగ్స్ పంజాబ్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత పంజాబ్ స్కోరు బోర్డు వేగం తగ్గింది. ఆపై మయాంక్ అగర్వాల్(30; 19 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో మూడో వికెట్‌గా ఔట్ కాగా, ఫించ్ వచ్చిన వెంటనే డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కాసేపటికి యువరాజ్ సింగ్(20) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment