
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్నాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించడం ఆరంభించిన గేల్.. 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
రెండు మ్యాచ్‌ల తర్వాత కింగ్స్ పంజాబ్ జట్టులో చోటు దక్కించుకున్న గేల్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బౌలర్ ఎవరు అనేది చూడకుండా బౌండరీలే లక్ష్యంగా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దాంతో కింగ్స్ పంజాబ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను గేల్, కేఎల్ రాహుల్‌లు ఆరంభించారు. ఒకవైపు రాహుల్ సమయోచితంగా హిట్టింగ్ చేస్తే, గేల్ మాత్రం తనదైన స్టైల్‌లో భారీ షాట్లతో అలరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment